అక్షాంశ రేఖాంశాలు: 15°16′17.652″N 78°59′37.572″E / 15.27157000°N 78.99377000°E / 15.27157000; 78.99377000

గోపాలునిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోపాలునిపల్లె ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

గోపాలునిపల్లె
గ్రామం
పటం
గోపాలునిపల్లె is located in Andhra Pradesh
గోపాలునిపల్లె
గోపాలునిపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°16′17.652″N 78°59′37.572″E / 15.27157000°N 78.99377000°E / 15.27157000; 78.99377000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొమరోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 373.

పటం

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో షేక్ అబ్దుల్ ఖాదర్, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ నాగరబొమ్మ దేవాలయం

[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2015, మే నెల-4వతేదీ, వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణాప్రతిష్ఠా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

గోపాలునిపల్లె గ్రామానికి చెందిన శ్రీ వీరంరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ప్రభావతి దంపతుల కుమారుడైన విష్ణువర్ధన రెడ్డి, సంతమాగులూరులోని మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నాడు. ఇతడికి చిన్నతనం నుండి చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువ. పల్లెటూరి వాతావరణం, ఎలాంటి వసతులూ లేని ప్రభుత్వ పాఠశాలలలో చదివిన ఇతడు, చిన్నప్పటి నుండి పాల్గొన్న చిత్రలేఖనం పోటీలన్నిటిలో ప్రథమ బహుమతి సాధించేవాడు. తాజాగా, 2014 జనవరిలో అమలాపురంలో జరిగిన కోనసీమ చిత్రకళాపరిషత్తు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి, మెగా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎవార్డు తోపాటు, 4 వేల రూపాయల నగదు బహుమతి గెల్చుకున్నాడు. ఇంకా ఇతడు వ్యర్ధ పదార్ధాలతో వాల్ హ్యాంగింగ్స్, పూలబుట్టలు, ఫొటో ఫ్రేంస్, తాబేలు, నెమళ్ళ ఆకారాలు తయారుచేస్తాడు. చాక్ పీసుపై వివిధ ఆకారాల దేవుడి బొమ్మలు తయారు చేస్తాడు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]