గెలుపు పిలుపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గెలుపు పిలుపు
కృతికర్త: బుర్రా వెంకటేశం
దేశం: భారతదేశం
భాష: ఇంగ్లీషు, తెలుగు, స్పానిష్, బెంగాలీ
విభాగం (కళా ప్రక్రియ): నాన్ - ఫిక్షన్
ప్రచురణ: ప్రతాప్ చౌదరి
విడుదల:
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-942539-2-1


గెలుపు పిలుపు పుస్తకం తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఇంగ్లీషులో రాసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకాన్ని ఆయనే తెలుగులో 'గెలుపు పిలుపు' పేరుతో అనువదించాడు. ఆయన తొలి రచనగా విడుదలైన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకానికి మంచి ఆదరణ లభించడంతో అన్నివర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తులు మేరకు ఈ పుస్తకాన్ని అదనపు వ్యాఖ్యానాలతో మొదట తెలుగులోకి అనువదించాడు. ఆయన ఈ పుస్తకాన్ని తన స్ఫూర్తిగా భావించే భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్కు అంకితమిచ్చాడు.[1]

పుస్తకం ముఖ్య ఉద్దేశం

[మార్చు]

గెలుపు అంటే ఏమిటి ?ఎందుకు? ఎలా? గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది, గెలిస్తే చాలా? ప్రపంచంలో గొప్ప వ్యక్తుల విజయాలు, వాటి పర్యవసానాలు, .ఒకరు గెలవడం వెనక ఎంత మంది ఓడిపోతున్నారు అనేది ఈ పుస్తకంలో బుర్రా వెంకటేశం వివిధ విభాగాల్లో ప్రతీ అంశానికి సంబంధించి ప్రముఖులైన మహాత్మా గాంధీ, మదర్ థెరిస్సా, థామస్ అల్వా ఎడిసన్, అడాల్ఫ్ హిట్లర్, జె.ఆర్.డి.టాటా, బిల్ గేట్స్, పాబ్లో ఎస్కోబార్, జాక్మ, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, డేవిడ్ సర్నీప్, షేక్స్పియర్, మైఖేల్ జాక్సన్, జేకే రోలింగ్, ఓప్రా విన్‌ఫ్రే, గోవింద్ ఫాల్కే, మేరీకోం, రామోజీరావు జీవన యానాలను జోడించి ఉదహరిస్తూ వివరించాడు.

పుస్తకంలోని భాగాలు

[మార్చు]

గెలుపు పిలుపు పుస్తకంలో మానవ జీవితాలు, వారి మనోగతాలు, సామాజిక పరిస్థితులను ఆయన అధ్యయనం చేసి అసాధారణ వ్యక్తుల జీవితాలను విశ్లేషిస్తూ ‘విజయాన్ని చేరుకోవడం ఎలా ? దాని పాఠ్యాంశాలు, దాని సారాంశం, దుష్ప్రభావాలు, విజయ సంతకం అనే ఐదు విభాగాలుగా విభజించి రచించాడు.

  1. గెలుపు అవగాహన
  2. గెలుపు పాఠ్యాంశాలు
  3. గెలుపు సారాంశం
  4. గెలుపు లోపాలు
  5. గెలుపు సంతకం

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 January 2020). "మీ ముందుకు.. 'గెలుపు పిలుపు'". Sakshi. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.