గులియన్-బార్రే సిండ్రోమ్
గులియన్-బార్రే సిండ్రోమ్ | |
---|---|
ఇతర పేర్లు | గిలియన్–బార్రే–స్ట్రోల్ సిండ్రోమ్, లాండ్రీస్ పక్షవాతం, పోస్ట్‌ఇన్ఫెక్టియస్ పాలీన్యూరిటిస్ |
![]() | |
గిలియన్-బార్ సిండ్రోమ్ శ్వాస సమస్యలను అంచనా వేయడానికి ఉపయోగించే స్పిరోమెట్రీ పరికరం. | |
ఉచ్చారణ |
|
ప్రత్యేకత | నాడీ వ్యాధులు |
లక్షణాలు | పాదాలు, చేతుల్లో ప్రారంభమైన కండరాల బలహీనత శరీర పైభాగాలకు కదులుతోంది |
సంక్లిష్టతలు | శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె, రక్తపోటు సమస్యలు |
సాధారణ ప్రారంభం | త్వరగానే , గంటలనుండి వారాలలో |
కారణాలు | అస్పష్టం |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాల ఆధారంగా, నరాల ప్రసరణ అధ్యయనాలు, కటి పంక్చర్ |
చికిత్స | రోగలక్షణ చికిత్స, సహాయక సంరక్షణ, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్, ప్లాస్మాఫెరిసిస్ |
రోగ నిరూపణ | కోలుకోవడానికి వారాలనుండి సంవత్సరాలు పట్టవచ్చు |
తరుచుదనము | సంవత్సరంలో 100,000 మందిలో ఇద్దరికి |
మరణాలు | ప్రభావితమైన వారిలో 7.5% మందికి |
గులియన్-బార్రే సిండ్రోమ్ (GBS) అనేది పరిధీయ నాడీ వ్యవస్థ ను దెబ్బతీసే రోగనిరోధక వ్యవస్థ వల్ల కలిగే కండరాల బలహీనత. ఒక విధంగా ఇది పక్షవాతం[1].
లక్షణాలు
[మార్చు]సాధారణంగా, శరీరం రెండు వైపులా ప్రభావానికి లోనవుతుంది. ప్రారంభంలో కండరాల బలహీనతతో పాటు తరచుగా వెనుక భాగంలో సంవేదన లేదా నొప్పి పాదాలు, కాళ్లలో జలదరింపు, బలహీనత, చేతుల్లో ప్రారంభమై ఆపై ఈ లక్షణాలు చేతులు, ఎగువ శరీరానికి వ్యాపిస్తాయి. దీన్ని 'అసెండింగ్ పెరాలిసిస్' అని కూడా అంటారు. లక్షణాలు గంటల నుండి కొన్ని వారాలలో అభివృద్ధి చెందుతాయి[1]. కొందరిలో తీవ్రమైన దశలో, ఈ రుగ్మత ప్రాణాంతకం కావచ్చు, సుమారు 15 శాతం మందిలో గుండె, శ్వాస కండరాల బలహీనత అభివృద్ధి అవుతుంది. అందువల్ల యాంత్రిక వెంటిలేషన్ (యంత్రం సహాయంతో శ్వాసక్రియ ఏర్పాటు) అవసరం[2]. కొందరు స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థ పనితీరులో మార్పులకు ప్రభావితమవుతారు, వారిలో హృదయ స్పందన రేటు, రక్తపోటులను ప్రమాదకరమైన అసాధారణతలకు దారితీస్తుంది[1].[3]
వేళ్ళు, మడమలు లేదా మణికట్టు వద్ద సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం జరుగుతుంటుంది. నడవలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలడం , మెట్లు ఎక్కడంలో సమస్య, నోరు వంకర పోవడం , మాట్లాడలేక పోవడం, నమలడం మింగడం లో ఇబ్బంది పడడం మొదలైనవి లక్షణాలు.[3]
కారణాలు
[మార్చు]ఈ వ్యాధికి సరిఅయిన కారణం తెలియకపోయినప్పటికీ, అంతర్లీన యంత్రాంగం స్వయం ప్రతిరక్షక రుగ్మత దాడితో కూడి ఉంటుంది, దీనిలో శరీరం రోగనిరోధక వ్యవస్థ పరిధీయ నరాలపై దాడి చేసి వాటి మైలిన్ ఇన్సులేషన్ను (నాడీకణాలను కప్పివుంచే సంరక్షక పొర) దెబ్బతీస్తుంది[1].
మెదడు పంపే విద్యుత్ సంకేతాలు వెన్నుపాము నుండి వెలువడే పరిధీయ నదుల ద్వారా కాళ్ళు , చేతులు, ఛాతీ వంటి భాగాలలో కండరాలకు ప్రసరిస్తాయి. నాడుల చుట్టూరా ఉండే మైలిన్ సంరక్షక పొర దెబ్బ తినడమే ఈ రుగ్మతకు ప్రధాన కారణం. ఎందుకంటే విద్యుత్ సంకేతాలు నెమ్మదించి అస్తవ్యస్తం కావడంతో అవయవాలు బలహీనమయి, చచ్చుబడి కదలికలు ఆగిపోవడం జరుగుతుంది.[3]
వెన్నుపాము నుంచి కాళ్ళు , చేతుల వంటి భాగాలకు వెళ్లే నాడుల మీది పొరను ఈ రోగ నిరోధకాలు (యాంటీ బాడీలు) దెబ్బ తీయడం వలన సమస్య ఏర్పడుతుంది. పక్షవాతం మాదిరిగా కండరాలు చచ్చుబడడానికి దారి తీస్తుంది. శరీరంకొన్ని రకాల సంక్రమణాలకు గురి అయిన తరువాత రోగ నిరోధకాలను విడుదల చేస్తుంది. కొందరిలో ఇవి స్వీయ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచి గులియన్-బార్రే సిండ్రోమ్ వంటి జబ్బును కూడా కలుగ చేస్తుంది. చాలావరకు కాంపైలోబాక్టర్ జెజునీ బాక్టీరియా, సైటో మెగాలే, జికా వైరస్ ల వంటివి వీటికి కారణం అని భావిస్తున్నారు.[3]
కొన్నిసార్లు ఈ రోగనిరోధక శక్తి లోపించడం వలన లేదా శస్త్రచికిత్స ద్వారా, అరుదుగా ఫ్లూ, టెటనస్ టీకా ద్వారా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు[1][2][3].
రోగనిర్ధారణ
[మార్చు]రోగనిర్ధారణ సాధారణంగా సంకేతాలు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రత్యామ్నాయ కారణాలను మినహాయించడం ద్వారా, నరాల ప్రసరణ అధ్యయనాలు, సెరెబ్రోస్పానియల్ ద్రవ పరీక్షల ద్వారా జరుగుతుంది [1]. దీనిలో అనేక ఉపరకాలు ఉన్నాయి, బలహీనపడిన భాగాలూ, నరాల ప్రసరణ అధ్యయనాల ఫలితాలు, కొన్ని ప్రతిరోధకాల (యాంటీబోడీస్) ఉనికి ఆధారంగా వాటిని వర్గీకరించారు[4]. దీనిని తీవ్రమైన (అక్యూట్ ) పాలీన్యూరోపతి అంటారు[2]. సమస్యను అనుమానిస్తే కొన్ని పరీక్షలతో నిర్ధారిస్తారు. అవి -
- నర్వ్ కండక్షన్: నాడుల మీది చర్మానికి ఎలెక్ట్రోడ్స్ ని అమర్చి, స్వల్పంగా షాక్ ఇచ్చి స్పందన పరీక్షిస్తారు
- ఎలెక్ట్రోమయోగ్రఫీ - కండరాలలోనికి ఎలెక్ట్రోడ్స్ ని చొప్పించి నాడుల పనితీరు పరీక్ష
- సి.ఎస్.ఎఫ్. పరీక్ష - ఇది వెన్నుపాము నుండి ద్రవాన్ని సి.ఎస్.ఎఫ్. (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) తీసి చేసే పరీక్ష. ఈ సమస్య గలవారిలో (అల్బుమిన్) ప్రోటీన్ ఎక్కువగా తెల్ల రక్తకణాల సంఖ్య సాధారణంగా కానీ తక్కువగా ఉంటుంది.
- ఎం.ఆర్.ఐ. - ఇతర నాడీ సమస్యలను కనుగొనడానికి [3]
నివారణ, చికిత్స
[మార్చు]నివారణ చర్యలుగా త్రాగే నీటిలో, తినే ఆహారంలో, పరిసరాలలో శుభ్రత పాటించాలి. తీవ్రమైన బలహీనత ఉన్నవారిలో, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇస్తారు. ఇవి యాంటీబాడీస్, ఇతరత్రా విషతుల్యాలను నిర్వీర్యం చేస్తాయి. లేదా ప్లాస్మాఫెరెసిస్ (రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ) తక్షణ చికిత్స గా అందిస్తారు.[3]సహాయక సంరక్షణతో కలిసి, చాలా మందిలో ఈ సమస్య నుంచి కోలుకోవడానికి తోడ్పడుతుంది. కోలుకోవడానికి వారాల నుండి సంవత్సరాల వరకు పట్టవచ్చు, మూడింట ఒక వంతు మందికి కొంతవరకు ఈ బలహీనత ఎప్పటికి ఉంటుంది[1].
వ్యాప్తి
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా, ప్రభావితమైన వారిలో సుమారు 7.5% మంది మరణిస్తున్నారు[2]. ప్రతి సంవత్సరం 100,000 మందికి ఒకటి లేదా రెండు కేసులు లలో అరుదుగా గులియన్-బార్రే సిండ్రోమ్ కనపడుతోంది[1][5]. దీనికి లింగభేదం లేదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఒకే రకమైన వ్యాధి వ్యాప్తి తెలుస్తోంది [1][2].
పూణే పరిసర ప్రాంతాలలో ఉన్నట్లుండి 2025 సం.మొదట్లో ఒక వారంలో 100 కి పైగా దీని బారినపడగా కొందరికి వెంటిలేటర్ పైన చికిత్స చేసారు. ఇది పిల్లల మీద కూడా ప్రభావం చూపించింది. కేసులు పెరుగుతూ ఇతరప్రాంతాలకు విస్తరించే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) చికిత్సను ఉచితంగా అందించింది. [3]
ఈ సిండ్రోమ్కు ఫ్రెంచ్ న్యూరాలజిస్టులు జార్జెస్ గులియన్, జీన్ అలెగ్జాండర్ బార్రే పేరు పెట్టారు, వీరు ఫ్రెంచ్ వైద్యుడు ఆండ్రే స్ట్రోల్ కలిసి 1916లో ఈ పరిస్థితిని గుర్తించారు, వివరించారు [6][7].
సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Guillain–Barré Syndrome Fact Sheet". NIAMS. June 1, 2016. Archived from the original on 5 August 2016. Retrieved 13 August 2016.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Ferri, Fred F. (2016). Ferri's Clinical Advisor 2017: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 529. ISBN 9780323448383. Archived from the original on 2016-08-21.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 (డా.) పి., రంగనాధం (2025-01-28). "మరో రకం పక్షవాతం". ఈనాడు (దినపత్రిక).
- ↑ (15 July 2014). "Guillain–Barré syndrome: pathogenesis, diagnosis, treatment and prognosis".
- ↑ . "Population incidence of Guillain–Barré syndrome: a systematic review and meta-analysis".
- ↑ . "Clinical features, pathogenesis, and treatment of Guillain–Barré syndrome".
- ↑ . "Guillain Barré syndrome and other immune mediated neuropathies: diagnosis and classification".