గిబ్బన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు
గిబ్బన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు (GHLCA, GLCA, లేదా G / H LCA) హోమినిడే, హైలోబాటిడే కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీకుడు. మరో మాటలో చెప్పాలంటే, GHLCA అంటే ఒరంగుటాన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడికి, గిబ్బన్లకూ ఉన్న ఉమ్మడి పూర్వీకుడు అన్నమాట. సంక్లిష్టమైన సంకర స్పీసియేషన్ కారణంగా, ఈ పూర్వీకుల జనాభా వయస్సుపై ఖచ్చితమైన అంచనా వెయ్యడం సాధ్యం కాదు. ఇది 1.59 - 1.76 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభ మియోసిన్ కాలంలో (TGHLCA) నివసించినట్లు అంచనా.. [1]
ఇంకా గుర్తించని ఈ జాతి, గతంలో అనుకున్నదానికంటే చిన్నదిగా, సుమారుగా గిబ్బన్ పరిమాణంలో ఉంటుంది. [2]
హైలోబాటిడే కుటుంబంలో నాలుగు గిబ్బన్ ప్రజాతులు, వాటిలో 20 జాతులూ ఉన్నాయి (హైలోబేట్స్‌లో 9 జాతులు, హూలాక్ లో 3 జాతులు, మోమాస్కస్ లో 7 జాతులు, సింఫాలాంగస్ లో 1 జాతి). [3] [1] ప్రతి జాతికి వేర్వేరు సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయి. [4] విస్తృతమైన జన్యు విశ్లేషణ ఉన్నప్పటికీ, ఈ ప్రజాతుల వరుస స్పష్టంగా లేదు.
పరిణామ చరిత్ర
[మార్చు]అంతరించిపోయిన బునోపిథెకస్ సెరికస్ గిబ్బన్ లేదా గిబ్బన్ లాంటి వాలిడి. [5]
మొత్తం జన్యు మోలిక్యుకర్ డేటింగ్ విశ్లేషణలు గిబ్బన్ వంశం గొప్ప కోతుల (హోమినిడే) నుండి 1.68 కోట్ల సంవత్సరాల క్రితం (1.59 - 1.76 కోట్ల సంవత్సరాల క్రితాల మధ్య) వేరుపడిందని సూచిస్తున్నాయి. [1] క్రోమోజోమ్ పునర్వ్యవస్థీకరణలతో అనుసంధానమైన అడాప్టివ్ డైవర్జెన్స్ ఈ నాలుగు ప్రజాతులు 50 - 70 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య వేగంగా పరిణామం చెందడానికి దారితీసింది. వివిధ స్పీసియేషన్ల ఫలితంగా జాతుల ఫైలోజెనీలో చిన్న అంతర్గత శాఖలు ఏర్పడ్డాయి. [6] శరీరనిర్మాణం ఆధారంగా ఒక విశ్లేషణ ప్రకారం ఈ నాలుగు జాతులాను ( సింఫాలంగస్, ( నోమాస్కస్, ( హూలాక్, హైలోబేట్స్ )) అనే వరుసలో పేర్చారు. [7]
హోమినోయిడియా (హోమినాయిడ్లు, వాలిడులు) |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వర్గీకరణ
[మార్చు]హైలోబాటిడే కుటుంబం : గిబ్బన్లు [7]
గిబ్బన్ జాతుల సంబంధాలను పరిష్కరించడానికి భౌతిక లక్షణాలు సరిపోవు. డైప్లాయిడ్ క్రోమోజోమ్‌ల సంఖ్య ఆధారంగా ఈ కుటుంబాన్ని నాలుగు ప్రజాతులుగా విభజించారు. హైలోబేట్స్ (44), హూలాక్ (38), నోమాస్కస్ (52), సింఫాలాంగస్ (50). [5] [7] బునోపిథెకస్ అనే అంతరించిపోయిన ఐదవ జాతి ఒకటి ఉంది. ఇది గిబ్బన్ లేదా గిబ్బన్ లాంటి వాలిడీ అయి ఉండవచ్చు. మరొక అంతరించిపోయిన ఆరవ జాతిని చైనాలోని జుంజి లో లభించిన పాక్షిక పుర్రె ఆధారంగా 2018 లో గుర్తించారు. [8]
శిలాజ ప్రజాతులు
[మార్చు]- బునోపిథెకస్ జాతి
- బునోపిథెకస్ సెరికస్
- జుంజీ జాతి
- జుంజీ సామ్రాజ్యవాది
స్వరూపం, జీవావరణం
[మార్చు]శిలాజాలు కొరత చాలా ఉన్నందున GHLCA ఎలా ఉండేదో స్పష్టంగా తెలియడం లేదు. GHLCAకు దాని వారసుల మాదిరిగా తోకలేనిదో కాదో, విశాలమైన, చదునైన పక్కటెముకను కలిగి ఉందో లేదో తెలియదు. [9] : 193 కానీ అదొక చిన్న జంతువు, బహుశా 12 కిలోల బరువు ఉండి ఉండొచ్చు. ఇది చింపాంజీ పరిమాణంలో ఉండేదని, ఇవి చాలా పెద్దవిగా ఉన్నందున నేలపై నుండి లేవాలంటే చెట్ల నుండి వేలాడాల్సి వచ్చేదనీ తొలుత భావించిన దానికి ఇది విరుద్ధంగా ఉంది. మంచి ఆహారాన్ని సంపాదించుకునేందుకు చెట్లపై వేలాడుతూ పరుగెత్తడంలో బహుశా పోటీ ఉండి ఉండేది. తరువాత వచ్చిన హోమినిడే వాటి పూర్వీకుల కంటే చిన్నవిగా ఉన్నాయి. సాధారణంగా పరిణామ క్రమంలో జంతువులు వాటి పూర్వీకుల కంటే పెద్దవిగా ఉండటానికి ఇది విరుద్ధంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Carbone, Lucia; et al. (2014). "Gibbon genome and the fast karyotype evolution of small apes". Nature. 513 (11 Sept 2014): 195–201. Bibcode:2014Natur.513..195C. doi:10.1038/nature13679. PMC 4249732. PMID 25209798.
- ↑ "New Study Suggests that Last Common Ancestor of Humans and Apes was Smaller than Thought". Retrieved 26 October 2018.
- ↑ Shi, Cheng-Min; Yang, Ziheng (January 2018). "Coalescent-Based Analyses of Genomic Sequence Data Provide a Robust Resolution of Phylogenetic Relationships among Major Groups of Gibbons". Molecular Biology and Evolution. 35 (1): 159–179. doi:10.1093/molbev/msx277. PMC 5850733. PMID 29087487.
- ↑ Dawkins (2016). The Ancestor's Tale: A Pilgrimage to the Dawn of Evolution. pp. 152–170. ISBN 978-0544859937.
- ↑ 5.0 5.1 Mootnick, A.; Groves, C. P. (2005). "A new generic name for the hoolock gibbon (Hylobatidae)". International Journal of Primatology. 26 (4): 971–976. doi:10.1007/s10764-005-5332-4.
- ↑ Matsudaira K, Ishida T (2010) Phylogenetic relationships and divergence dates of the whole mitochondrial genome sequences among three gibbon genera. Mol. Phylogenet. Evol.
- ↑ 7.0 7.1 7.2 Geissmann, Thomas (December 1995). "Gibbon systematics and species identification" (PDF). International Zoo News. 42: 467–501. Archived from the original (PDF) on 2011-07-19. Retrieved 2008-08-15.
- ↑ Weintraub, Karen (2018-06-21). "Extinct gibbon found in tomb of ancient Chinese emperor's grandmother". The New York Times (in ఇంగ్లీష్). Archived from the original on 2018-09-21. Retrieved 2019-02-10.
- ↑ Kane, Jonathan; Willoughby, Emily; Michael Keesey, T. (2016-12-31). God's Word or Human Reason?: An Inside Perspective on Creationism. ISBN 9781629013725.
ఇవి కూడా చూడండి
[మార్చు]- మానవ పరిణామం
- చింపాంజీ-మానవ చివరి సాధారణ పూర్వీకుడు
- గొరిల్లా-మానవ చివరి సాధారణ పూర్వీకుడు
- ఒరంగుటాన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు
- హోమినాయిడ్ వర్గీకరణ చరిత్ర