Jump to content

వాలిడి

వికీపీడియా నుండి

Hominoids or apes
Temporal range: Miocene–Holocene
Bornean orangutan (Pongo pygmaeus)
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: క్షీరదాలు
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Parvorder: Catarrhini
Superfamily: Hominoidea
Gray, 1825
Type species
Homo sapiens
Families

Equatorius
Proconsulidae
Afropithecidae
Pliobatidae
Dendropithecidae
Ekembo
Hylobatidae
Hominidae

sister: Cercopithecoidea

వాలిడి (హోమినోయిడియా) అనేది, పాత ప్రపంచంలో ఆఫ్రికా, ఆగ్నేయాసియాలకు చెందిన తోకలేని కోతి (సిమియన్). దీన్ని తోకలేని కోతి అని కూడా ఆంటారు. ఇవి పాత ప్రపంచపు కోతులకు సోదర సమూహాలు. ఈ రెండూ కలిసి కెటరైన్ క్లాడ్‌లో భాగం. ఇతర ప్రైమేట్ల కంటే భిన్నంగా వీటికి భుజం కీళ్ళ వద్ద చలనాలు ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయిక, సైన్సేతర ఉపయోగంలో, "వాలిడి", "తోక లేని కోతి" అనే పదానికి అర్థంలో మానవులు రారు. ఆ విధంగా, ఇది హోమినోయిడియా శాస్త్రీయ టాక్సన్ తో సమానం కాదు. హోమినోయిడియా సూపర్ ఫ్యామిలీలో రెండు శాఖలు ఉన్నాయి: గిబ్బన్లు లేదా చిన్న వాలిడులు; హోమినిడ్లు లేదా గొప్ప వాలిడులు.

  • చిన్న వాలిడుల కుటుంబమైన హైలోబాటిడేలో నాలుగు ప్రజాతులు, మొత్తం పదహారు జాతుల గిబ్బన్లు ఉన్నాయి. ఇవన్నీ ఆసియాకు చెందినవి. అవి ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. నేలపై ఉన్నపుడు రెండు కాళ్ళపై నడుస్తాయి. వీటికి గొప్ప వాలిడుల కంటే తేలికైన శరీరాలుంటాయి. చిన్న సమూహాల్లో నివసిస్తాయి.
  • గొప్ప వాలిడుల కుటుంబమైన హోమినిడే (హోమినిడ్స్) లో మూడు ప్రజాతులు (జీనస్‌లు) ఉన్నాయి. వీటిలో మూడు జాతులు ఉన్న ఒరంగుటాన్లూ వాటి ఉపజాతులూ, రెండు జాతుల గొరిల్లాలూ వాటి ఉపజాతులూ, రెండు జాతుల చింపాంజీలూ వాటి ఉపజాతులూ, ఒక జాతి మానవులు అందులో ఉన్న ఒకే ఒక్క ఉపజాతీ - ఇవన్నీ ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి. [1] [a] [2] [3]

గొరిల్లాలు మానవులు తప్ప, మిగతా హోమినాయిడ్లన్నీ చెట్లు ఎక్కడంలో దిట్టలే. వాలిడులు రకరకాల మొక్కలు, జంతువులనూ తింటాయి. ఎక్కువగా మొక్కల ఆహారమే తింటాయి. వీటిలో పండ్లు, ఆకులు, కాండాలు, వేర్లు, గింజలు, గడ్డి గింజలూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, వివిధ రకాల నివాస ప్రాంతాల కారణంగా మానవుల ఆహారాలు ఇతర వాలిడుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. సంఖ్యలో మానవులే ఇప్పటివరకు వాలిడి జాతులన్నిటి లోకీ ఎక్కువ. వాస్తవానికి మిగతా అన్ని ప్రైమేట్ల కంటే మానవులు అనేక వేల రెట్లు ఎక్కువ.

మానవేతర హోమినాయిడ్లు చాలా అరుదు. ఉన్నవి కూడా అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న చాలా జాతులకు ప్రధాన ముప్పు ఉష్ణమండల వర్షారణ్యాల్లో ఆవాసాలు తగ్గిపోవడం. అయితే కొన్ని జాతులు మానవుల ఆహారం కోసం బలైపోతున్నాయి. ఆఫ్రికా లోని గొప్ప వాలిడులు ఎబోలా వైరస్ నుండి కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికన్ వాలిడుల మనుగడకు గొప్ప ముప్పుగా పరిగణించబడుతున్న ఈ ఎబోలా, 1990 నుండీ జరిగిన మొత్తం గొరిల్లాలు, చింపాంజీల మరణాల్లో కనీసం మూడింట ఒక వంతుకు కారణమైంది. [4]

పేరు వుత్పత్తి

[మార్చు]

వాలు, ఇడి అనే రెండు పదాలు కలిసి వాలిడి అయింది. వాలు అంటే తోక. వాల అనే పదానికి వికృత రూపం వాలు. [5] ఇడి అనే ప్రత్యయానికి అర్థం, లేనిది అని. ఆవిధంగా వాలిడి అంటే తోకలేనిది అని అర్థం. [6]

ఫైలోజెనీ

[మార్చు]

అంతరించిపోయిన జాతులతో కూడిన క్లాడోగ్రామ్ ఇది. దీనిలో ఎక్కువ ఉత్పన్నమైన కోతులు, ప్రోకాన్సులిడే ఎకెంబోలో కనిపిస్తాయి. డెండ్రోపిథెసిడే ప్రాథమికమైన కోతిగా గుర్తించారు. తుర్కనాపిథెకస్, రంగ్వాపిథెకస్, న్యాన్జాపిథెకస్ (గతంలో ప్రోకాన్సులిడేగా పరిగణించేవారు) లకు సిమియోలస్ (డెండ్రోపిథెసిడే) తో దగ్గరి సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. మైక్రోపిథెకస్ క్రౌన్ కాతరినికి సోదరి అని కనుగొన్నారు. [7] [8] [9] [10] [11] సుమారు ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం (ఎమ్‌వైఎ) క్లాడ్‌లు కొత్త క్లాడ్‌లుగా పరిణామం చెందాయో ఇది సూచిస్తుంది.


క్రౌన్ కాటరీని (31)
(29)

సాడానోయిడియా (†28)

సెర్కోపిథెకోయిడియా (24)

విక్టోరియా పిథెసినే (†19)

క్రౌన్ సెర్కోపిథెకోయిడియా

హోమినోయిడియా (30)

డెండ్రోపిథెసిడే (†7 Mya)

ఎకెంబో

ఎకెంబో హెసెలోని (†17 Mya)

ప్రోకాన్సులిడే (†18 Mya)

ఎకెంబో న్యాన్జే (†17 Mya)

(29)

ఈక్వటోరియస్ (†16)

ప్లయోబేట్స్ (†11.6 Mya)

(29)
ఆఫ్రోపిథెసిడే (28)

మొరోటోపిథెకస్ (†20)

ఆఫ్రోపిథెకస్ (†16)

క్రౌన్ హోమినోయిడియా (22)

హోమినిడే

హైలోబాటిడే


సూపర్ ఫ్యామిలీ హోమినోయిడే యొక్క క్లాడోగ్రామ్ ఈ రోజు విస్తృతంగా ఆమోదంపొందిన హోమినాయిడ్ల వారసత్వ సంబంధాలను చూపిస్తుంది. [12] [13] [14] ప్రతి క్లాడ్ నుండి, సుమారు ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం (ఎమ్‌వైఎ) కొత్త క్లాడ్‌లు ఉద్భవించాయో సూచిస్తుంది. [15]


కాటరీని (31.0 Mya)
 హోమినోయిడియా/వాలిడులు(20.4 Mya)
 హోమినిడే/గొప్ప వాలిడులు (15.7 Mya)
 హోమినినే (8.8 Mya)
 హోమినిని (6.3 Mya)

మానవులు (ప్రజాతి హోమో)

చింపాంజీలు (genus పాన్)

గొరిల్లాలు (ప్రజాతి గొరిల్లా)

ఒరాంగుటన్లు (ప్రజాతి పోంగో)

గిబ్బన్లు/చిన్న వాలిడులు (కుటుంబం హైలోబాటిడే)




సాంప్రదాయిక వాలిడులు

సెర్కోపిథెకోయిడియా  పాత ప్రపంచపు కోతులు

హోమినాయిడ్ల వర్గీకరణ అనేక మార్పులకు గురైంది. శిలాజ ఆధారాలతో కలిపి జన్యు విశ్లేషణ, ఒలిగోసిన్-మియోసిన్ సరిహద్దుకు సమీపంలో 25 మిలియన్ సంవత్సరాల క్రితం (ఎమ్‌వైఎ) పాత ప్రపంచపు కోతుల నుండి హోమినాయిడ్లు ఉద్భవించాయని సూచిస్తుంది. గిబ్బన్లు మిగిలినవాటి నుండి 18 మిలియన్ సంవత్సరాల క్రితం (ఎమ్‌వైఎ) విడిపోయాయి. హోమినిడ్ చీలికలు 14 ఎమ్‌వైఎ (పోంగో), 7 ఎమ్‌వైఎ (గొరిల్లా), 3–5 ఎమ్‌వైఎ (హోమో & పాన్) జరిగాయి. 2015 లో, ప్లయోబేట్స్ కాటలోనియే అనే ఒక కొత్త ప్రజాతిని, జాతినీ వర్ణించారు. ఇది 11.6 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించింది. హోమినిడే, హైలోబాటిడే లువేరుపడక ముందు ఇది ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

వాలిడి[permanent dead link] సూపర్ ఫామిలీ అయిన హోమినోయిడియా లోని సభ్యుల అస్థిపంజరాలు. ప్రస్తుతం రెండు కుటుంబాలు ఉనికిలో ఉన్నాయి: హోమినిడే, "గొప్ప వాలిడులు"; హైలోబాటిడే, గిబ్బన్లు లేదా "చిన్న వాఅలిడులు".
ఎడమ[permanent dead link] నుండి: గిబ్బన్, మానవుడు, చింపాంజీ, గొరిల్లా, ఒరంగుటాన్ పరిమాణాల పోలిక. మానవేతర కోతులు సాధారణ భంగిమలో నిటారుగా నిలబడవు.

హోమినాయిడ్ల కుటుంబాలు, ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రజాతులు జాతులు:

  • సూపర్ ఫ్యామిలీ హోమినోయిడియా [16]
    • కుటుంబం హోమినిడే : హోమినిడ్స్ ("గొప్ప వాలిడులు")
      • పోంగో జాతి: ఒరంగుటాన్స్
        • బోర్నియన్ ఒరంగుటాన్, పి. పిగ్మేయస్
        • సుమత్రన్ ఒరంగుటాన్, పి. అబెలి
        • తపనులి ఒరంగుటాన్, పి. తపానులియెన్సిస్ [17]
      • గొరిల్లా జాతి: గొరిల్లాస్
        • వెస్ట్రన్ గొరిల్లా, జి. గొరిల్లా
        • తూర్పు గొరిల్లా, జి. బెరింగీ
      • హోమో జాతి: మానవులు
      • పాన్ జాతి: చింపాంజీలు
        • సాధారణ చింపాంజీ, పి. ట్రోగ్లోడైట్స్
        • బోనోబో, పి. పానిస్కస్
    • కుటుంబం హైలోబాటిడే : గిబ్బన్లు ("తక్కువ కోతులు")
      • హైలోబేట్స్ జాతి
        • లార్ గిబ్బన్ లేదా వైట్-హ్యాండ్ గిబ్బన్, హెచ్. లార్
        • బోర్న్ వైట్-గడ్డం గిబ్బన్, హెచ్. అల్బిబార్బిస్
        • ఎజైల్ గిబ్బన్ లేదా బ్లాక్-హ్యాండ్ గిబ్బన్, హెచ్. అగిలిస్
        • ముల్లర్స్ బోర్నిన్ గిబ్బన్ లేదా బూడిద గిబ్బన్, హెచ్. ముల్లెరి
        • సిల్వర్ గిబ్బన్, హెచ్. మోలోచ్
        • పైలేటెడ్ గిబ్బన్ లేదా క్యాప్డ్ గిబ్బన్, హెచ్. పైలేటస్
        • క్లోస్ గిబ్బన్ లేదా మెంటవాయి గిబ్బన్ లేదా బిలో, హెచ్. క్లోసి
      • హూలాక్ జాతి
        • వెస్ట్రన్ హూలాక్ గిబ్బన్, హెచ్. హూలాక్
        • తూర్పు హూలాక్ గిబ్బన్, హెచ్. ల్యూకోనెడిస్
        • స్కైవాకర్ హూలాక్ గిబ్బన్, హెచ్. టియాన్క్సింగ్
      • సింఫాలంగస్ జాతి
        • సియామాంగ్, ఎస్. సిండక్టిలస్
      • నోమాస్కస్ జాతి
        • నార్తర్న్ బఫ్డ్-చెంప గిబ్బన్, ఎన్. అన్నమెన్సిస్
        • బ్లాక్ క్రెస్టెడ్ గిబ్బన్, ఎన్. కాంకోలర్
        • తూర్పు బ్లాక్ క్రెస్టెడ్ గిబ్బన్, ఎన్. నాసుటస్
        • హైనాన్ బ్లాక్ క్రెస్టెడ్ గిబ్బన్, ఎన్. హైననస్
        • దక్షిణ తెల్ల-చెంప గిబ్బన్ ఎన్. సికి
        • వైట్-చెంప క్రెస్టెడ్ గిబ్బన్, ఎన్. ల్యూకోజెనిస్
        • పసుపు-చెంప గిబ్బన్, ఎన్. గాబ్రియెల్లా

స్వరూప శాస్త్రం

[మార్చు]
ఒరంగుటాన్[permanent dead link] మాదిరిగానే, హోమినాయిడ్ల భుజాలు కీళ్ళూ చెట్ల కొమ్మలకు వేళ్ళాడుతూ ఊగుతూ, కొమ్మనుండి కొమ్మకు దూకేందుకు వీలుగా ఉంటాయి

గిబ్బన్ కుటుంబం, హైలోబాటిడేలో పదహారు జాతులు ఉన్నాయి. ఇవన్నీ ఆసియాకు చెందినవే. వాటిని విభిన్నంగా చూపే ప్రధాన లక్షణం వాటి పొడవాటి చేతులు, ఇవి చెట్లకు వేలాడుతూ ఊగడానికి ఉపయోగపడతాయి. వాటి మణికట్టులో బంతి గిన్నె కీళ్ళు చెట్లపై జీవించేవాటి జీవనశైలికి పరిణామ అనుసరణ. గిబ్బన్లు సాధారణంగా ఆఫ్రికన్ వాలిడుల కంటే చిన్నవి. అతిపెద్ద గిబ్బన్, సియామాంగ్, 14 కిలోల వరకూ బరువుంటుంది. అతిచిన్న "గొప్ప వాలిడి" అయిన బోనోబో 34 కిలోలుంటుంది.

సూపర్ ఫ్యామిలీ హోమినోయిడియా పార్వర్డర్ కాటరీని లోకి వస్తుంది. ఇందులో ఆఫ్రికా, యురేషియా లకు చెందిన పాత ప్రపంచపు కోతులు కూడా ఉన్నాయి. ఈ సమూహంలో, హైలోబాటిడే, హోమినిడే అనే రెండు కుటుంబాలను పాతప్రపంచపు కోతుల నుండి వారి నములు దంతాల్లోని శిఖరాల సంఖ్యను బట్టి వేరు చేయవచ్చు; హోమినాయిడ్లకు "Y-5" మోలార్ నమూనాలో ఐదు వుండగా, పాత ప్రపంచపు కోతులకు నాలుగు మాత్రమే, బైలోఫోడోంట్ నమూనాలో, ఉన్నాయి.

ఇంకా, పాత ప్రపంచపు కోతులతో పోల్చితే, హోమినాయిడ్లకు మరింత ఎక్కువగా కదిలే భుజం కీళ్ళు, చేతులూ, చదునుగా ఉండే వెడల్పాటి పక్కటెముకలు; పొట్టిగా ఉండి, అంతగా కదలని వెన్నెముక, బాగా తగ్గిపోయిన తోకవెన్నుపూస (ఫలితంగా హోమినాయిడ్ జాతులలో తోక పూర్తిగా కోల్పోయింది) ఉంటాయి. ఈ శరీర నిర్మాణ సంబంధమైన అనుసరణలు, మొదట, కొమ్మల నుండి నిలువుగా వేలాడేందుకు, ఊగుతూ కొమ్మ నుండి కొమ్మకు దూకేందుకూ, ఆ తరువాత, రెండు కాళ్ళపై నడిచేటపుడు సమతుల్యతతో ఉండేందుకూ ఏర్పడిన పరిణామాలు. ఇతర కుటుంబాలలో కూడా తోకలు లేని ప్రైమేట్స్ ఉన్నాయి. కనీసం ఒక్కటి - పిగ్ టెయిల్‌డ్ లంగూర్, రెండు కాళ్ళపై చాలా దూరం నడవగలుగుతుంది. వాలిడి పుర్రె ముందు భాగంలో దాని ముక్కు రంధ్రాలు స్ఫుటంగా కనిపిస్తూంటాయి. ముక్కు దూలం అణగిపోయి ఉంటుంది.

హోమినాయిడ్ శిలాజ రికార్డు ఇప్పటికీ అసంపూర్తిగానూ, ముక్కలు ముక్కలుగానూ ఉన్నప్పటికీ, మానవుల పరిణామ చరిత్ర యొక్క రూపురేఖలను అందించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంతకుముందు, మానవులు, ఉనికిలో ఉన్న ఇతర హోమినాయిడ్లూ 15 నుండి 20 మిలియన్ సంవత్సరాల క్రితం వేరుపడ్డాయని గతంలో భావించారు. ఆ కాలావధికి చెందిన రామాపిథెకస్ వంటి అనేక జాతులను ఒకప్పుడు హోమినిన్లుగా, మానవుల పూర్వీకులుగా భావించారు. కానీ, తరువాత శిలాజ పరిశోధనల్లో రామాపిథెకస్‌కు ఒరంగుటాన్‌తో మరింత దగ్గరి సంబంధం ఉందని తెలిసింది; కొత్త జీవరసాయన ఆధారాలు, మానవుల, హోమినినేతరుల (అంటే చింపాంజీలు) చిట్టచివరి ఉమ్మడి పూర్వీకుడు 5 - 10 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని సూచించాయి.; చింపాంజీ-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు (CHLCA) చూడండి.

కోతులతో తేడాలు

[మార్చు]

క్లేడ్ (వంశం) ప్రకారం చూస్తే వాలిడులు, కాటరైన్లు, అంతరించిపోయిన జాతులైన ఏజిప్టోపిథెకస్, పారాపిథెసీడియా - అన్నీ కోతులే. కాబట్టి ఇతర కోతులలో లేని వాలిడి లక్షణాలను మాత్రమే పేర్కొనవచ్చు.

చాలా రకాల కోతులకు ఉన్నట్లుగా వాలిడులకు తోక ఉండదు. కోతులు ఎక్కువగా చెట్లపై ఉంటాయి. వాటి తోకలను సమతుల్యత కోసం ఉపయోగిస్తాయి. గొప్ప వాలిడులు కోతుల కంటే చాలా పెద్దవి అయితే, గిబ్బన్లు (చిన్నవాలిడులు) కొన్ని కోతుల కన్నా చిన్నవి. వాలిడులు కోతుల కంటే తెలివైనవని భావిస్తారు. కోతుల మెదళ్ళు మరింత ఆదిమ కాలానికి చెందినవి. [4]

ప్రవర్తన

[మార్చు]
గొరిల్లా[permanent dead link] ఒక చిన్న చెట్టు కాండాన్ని పట్టుకుని నీళ్ళ లోని మొక్కలను లాక్కునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు

ఈ రంగంలో "గొప్ప వాలిడుల" ప్రవర్తనపై జేన్ గూడాల్, డయాన్ ఫోస్సీ, బిరుట్ గాల్డికాస్ చేసిన మూడు ప్రధాన అధ్యయనాలు పూర్తయ్యాయి. వాటి సహజ వాతావరణంలో, మానవేతర హోమినాయిడ్లలో పరస్పరం చాలా భిన్నమైన సామాజిక వ్యవస్థ కనిపిస్తుందని ఈ అధ్యయనాల్లో గమనించారు: గిబ్బన్లు ఏకపత్నిత్వాన్ని పాటిస్తాయి, ప్రాదేశిక జత-బంధాలు కలిగి ఉంటాయి. ఒరంగుటన్లు ఒంటరిగా ఉంటాయి. గొరిల్లాలు చిన్న చిన్న మందలుగా, ఒకే వయోజన మగ గొరిల్లా నాయకత్వం కింద నివసిస్తాయి. చింపాంజీలు పెద్ద పెద్ద మందలుగా నివసిస్తాయి. బోనోబోలు విశృంఖల లైంగిక ప్రవర్తన ప్రదర్శిస్తాయి. ఈ జాతుల ఆహారం కూడా వైవిధ్యం గానే ఉంటుంది; గొరిల్లాలు ఆకులను తింటాయి. మిగిలినవి దాదాపుగా అన్నీ పండ్లు తింటాయి. కాకపోతే, సాధారణ చింపాంజీ మాంసం కోసం వేటాడతాయి.

ఆహారం

[మార్చు]

మానవులు, గొరిల్లాలు కాకుండా, కోతులు ప్రధానంగా పండ్లు తింటాయి. వీటికి తోడు రకరకాల ఇతర ఆహారాలు కూడా తింటూంటాయి. గొరిల్లాలు ప్రధానంగా ఎక్కువగా కొమ్మలు, రెమ్మలు, వేర్లు, ఆకులు, కొద్దిగా పండ్లు, ఇతర ఆహారాలూ తింటాయి. మనుషులు తప్ప మిగతా వాలిడులు సాధారణంగా కీటకాలు, గుడ్లు వంటి మాంసపదార్థాలను తక్కువ మొత్తంలో తింటాయి. మానవుల విషయంలో వలసలు, వేట సాధనాలు, వంటల ఆవిష్కరణ మరింత విస్తృతమైన ఆహారాలకు దారితీశాయి. మానవ ఆహారాల్లో పెద్ద మొత్తంలో వండిన దుంపలు (వేర్లు) లేదా చిక్కుళ్ళు ఉన్నాయి . [8] మానవులు, ఇతర వాలిడులూ అప్పుడప్పుడు ఇతర ప్రైమేట్లను తింటాయి. [9] ఈ ప్రైమేట్లలో కొన్ని ఇప్పుడు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. [10] [11]

తెలివితేటలు

[మార్చు]

మానవేతర హోమినాయిడ్లన్నీ సాధారణంగా అత్యంత తెలివైనవని భావిస్తారు. శాస్త్రీయ అధ్యయనంలో భాగంగా విస్తృతమైన జ్ఞాన పరీక్షలు చేసాక, అవి తెలివైనవని నిర్ధారించారు. అయితే, గిబ్బన్ల తెలివితేటల గురించిన డేటా తక్కువగా ఉంది. వోల్ఫ్‌గ్యాంగ్ కోహ్లర్ చేసిన తొలి అధ్యయనాల్లో చింపాంజీలు అసాధారణమైన సమస్యా పరిష్కార సామర్ధ్యాలను ప్రదర్శించాయి. దీనికి కారణం అంతర్దృష్టి అని కోహ్లెర్ చెప్పాడు. పదేపదే పనిముట్లను ఉపయోగించడం గమనించారు; ఇటీవల, పనిముట్లను తయారు చేసుకోవడాన్ని అడవిలోనూ, ప్రయోగశాల పరీక్షలలోనూ కూడా గమనించారు. ఇతర ప్రైమేట్ జాతుల కంటే "గొప్ప వాలిడులు" చాలా తేలికగా అనుకరణ చేస్తాయి. జంతువుల భాషా సముపార్జనలో చేసిన అధ్యయనాలు దాదాపు అన్నీ "గొప్ప వాలిడుల" పైననే చేసారు. అవి నిజమైన భాషా సామర్ధ్యాలను ప్రదర్శిస్తాయా అనే దానిపై వివాదం ఉన్నప్పటికీ, నేర్చుకోవడంలో అవి గణనీయమైన ప్రదర్శన చేసాయనడంలో సందేహం లేదు. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లోని చింపాంజీలు ఆహార సముపార్జనలో పనికొచ్చే పనిముట్లను అభివృద్ధి చేసి, ఓ రకమైన జంతు సంస్కృతిని ప్రదర్శించాయి. [13]

నోట్స్

[మార్చు]
  1. Although Dawkins is clear that he uses "apes" for Hominoidea, he also uses "great apes" in ways which exclude humans. Thus in Dawkins, R. (2005). The Ancestor's Tale (p/b ed.). London: Phoenix (Orion Books). ISBN 978-0-7538-1996-8.: "Long before people thought in terms of evolution ... great apes were often confused with humans" (p. 114); "gibbons are faithfully monogamous, unlike the great apes which are our closer relatives" (p. 126).

మూలాలు

[మార్చు]
  1. Dixson, A.F. (1981). The Natural History of the Gorilla. London: Weidenfeld & Nicolson. ISBN 978-0-297-77895-0., p. 13
  2. Grehan, J.R. (2006). "Mona Lisa Smile: The morphological enigma of human and great ape evolution". Anatomical Record. 289B (4): 139–157. doi:10.1002/ar.b.20107. PMID 16865704.
  3. Benton, Michael J. (2005). Vertebrate palaeontology. Wiley-Blackwell. ISBN 978-0-632-05637-8. Retrieved 10 జూలై 2011., p. 371
  4. 4.0 4.1 Rush, James (23 జనవరి 2015). "Ebola virus 'has killed a third of world's gorillas and chimpanzees' – and could pose greatest threat to their survival, conservationists warn". The Independent. Archived from the original on 30 మార్చి 2015. Retrieved 26 మార్చి 2015.
  5. "వాలు". ఆంధ్రభారతి నిఘంటువు.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. డి, చంద్రశేఖరరెడ్డి (2001). "అభావాది అర్థాలు". మన భాష. హైదరాబాదు: మీడియాహౌస్ పబ్లికేషన్స్. p. 114.
  7. Nengo, Isaiah; Tafforeau, Paul; Gilbert, Christopher C.; Fleagle, John G.; Miller, Ellen R.; Feibel, Craig; Fox, David L.; Feinberg, Josh; Pugh, Kelsey D. (2017). "New infant cranium from the African Miocene sheds light on ape evolution" (PDF). Nature. 548 (7666): 169–174. Bibcode:2017Natur.548..169N. doi:10.1038/nature23456. PMID 28796200. Archived from the original (PDF) on 22 జూలై 2018. Retrieved 10 ఏప్రిల్ 2020.
  8. 8.0 8.1 Alba, D. M.; Fortuny, J.; Moyà-Solà, S. (22 జూలై 2010). "Enamel thickness in the Middle Miocene great apes Anoiapithecus, Pierolapithecus and Dryopithecus". Proceedings of the Royal Society of London B: Biological Sciences (in ఇంగ్లీష్). 277 (1691): 2237–2245. doi:10.1098/rspb.2010.0218. ISSN 0962-8452. PMC 2880156. PMID 20335211.
  9. 9.0 9.1 Grabowski, Mark; Jungers, William L. (12 అక్టోబరు 2017). "Evidence of a chimpanzee-sized ancestor of humans but a gibbon-sized ancestor of apes". Nature Communications (in ఇంగ్లీష్). 8 (1): 880. Bibcode:2017NatCo...8..880G. doi:10.1038/s41467-017-00997-4. ISSN 2041-1723. PMC 5638852. PMID 29026075.
  10. 10.0 10.1 Rossie, James B.; Hill, Andrew (2018). "A new species of Simiolus from the middle Miocene of the Tugen Hills, Kenya". Journal of Human Evolution. 125: 50–58. doi:10.1016/j.jhevol.2018.09.002. PMID 30502897.
  11. 11.0 11.1 Rasmussen, D. Tab; Friscia, Anthony R.; Gutierrez, Mercedes; Kappelman, John; Miller, Ellen R.; Muteti, Samuel; Reynoso, Dawn; Rossie, James B.; Spell, Terry L. (2019). "Primitive Old World monkey from the earliest Miocene of Kenya and the evolution of cercopithecoid bilophodonty". Proceedings of the National Academy of Sciences. 116 (13): 6051–6056. doi:10.1073/pnas.1815423116. PMC 6442627. PMID 30858323.
  12. M. Goodman; D. A. Tagle; D. H. Fitch; W. Bailey; J. Czelusniak; B. F. Koop; P. Benson; J. L. Slightom (1990). "Primate evolution at the DNA level and a classification of hominoids". Journal of Molecular Evolution. 30 (3): 260–266. Bibcode:1990JMolE..30..260G. doi:10.1007/BF02099995. PMID 2109087.
  13. 13.0 13.1 Dixson 1981, p. 16
  14. Benton, Michael J. (2005). Vertebrate palaeontology. Wiley-Blackwell. ISBN 978-0-632-05637-8. Retrieved 10 జూలై 2011., p. 371
  15. Nengo, Isaiah; Tafforeau, Paul; Gilbert, Christopher C.; Fleagle, John G.; Miller, Ellen R.; Feibel, Craig; Fox, David L.; Feinberg, Josh; Pugh, Kelsey D. (2017). "New infant cranium from the African Miocene sheds light on ape evolution" (PDF). Nature. 548 (7666): 169–174. Bibcode:2017Natur.548..169N. doi:10.1038/nature23456. PMID 28796200. Archived from the original (PDF) on 22 జూలై 2018. Retrieved 10 ఏప్రిల్ 2020.
  16. గ్రోవ్స్, సి. (2005). విల్సన్, డి.ఇ; రీడర్, డి. ఎమ్ (eds.). మామల్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ (3rd ed.). బాల్టిమోర్: జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రెస్. pp. 178–184. OCLC 62265494. ISBN 0-801-88221-4.
  17. Cochrane, Joe (2 నవంబరు 2017). "New Orangutan Species Could Be the Most Endangered Great Ape". The New York Times. Retrieved 3 నవంబరు 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=వాలిడి&oldid=4302912" నుండి వెలికితీశారు