గాంధారి వనం - బొక్కలగుట్ట
గాంధారి వనం - మందమర్రి | |
---|---|
గాంధారి వనం అర్బన్ పార్క్ | |
రకం | ఉద్యానవనం |
స్థానం | మందమర్రి, మంచిర్యాల ,తెలంగాణ, భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 18°35′08″N 79°17′07″E / 18.5856°N 79.2852°E |
విస్తీర్ణం | బొక్కలగుట్ట |
నవీకరణ | ప్రకృతి సుందరమైన దృశ్యాలు |
హోదా | గాంధారి వనం అర్బన్ పార్క్ |
ప్రజా రవాణా సౌకర్యం | మంచిర్యాల- బెల్లంపల్లి |
గాంధారి వనం మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామ శివారులో మంచిర్యాల - బెల్లంపల్లి రోడ్డుకు ఇరువైపులా గాంధారి వనం ఉంది. అటవీ శాఖ వారు పార్కుగా అభివృద్ధి చేసిన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి[1][2].
పార్కులు
[మార్చు]గాంధారి వనంలోని మొత్తం మూడు ప్రాంతాలు అభివృద్ధిలో ఉన్నాయి. (1) గాంధారి వనం (2) గాంధారి వనం పార్క్ (3) గాంధారి వనం జింకల సంరక్షణ కేంద్రం. వారాంతాల్లో, సెలవు దినాల్లో ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తారు. చిన్న చిన్న సమావేశాలు, విందులు, సభలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంది[3].
వృక్ష జాతులు
[మార్చు]ఈ ఉద్యానవనంలో అటవీ వృక్ష జాతులు, పెద్ద ఏవియన్ కమ్యూనిటీ,సీతాకోకచిలుకలు, అడవి పందులు, కుందేళ్ళు, నక్కలు, కోతులకు నిలయం. వేప,పాలా,టేకు,రేగు, మరియు వందలాది మూలికా మొక్కులతో సహా 11,000 పూర్తిగా పెరిగిన చెట్ల జాతులకు నివాసంగా ఉంది. గాంధారి వనంలో అరుదైన వృక్షాలని అటవీ శాఖ పెంచుతుంది. గాంధారి వనం 5 పార్క్ వాకింగ్ ట్రాక్, బోటింగ్ సదుపాయం ఉంది. వీటితోపాటు అరుదైన వృక్షశిలాజాలని ఇక్కడ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం జింకల పార్క్ అభివృద్ధిలో ఉంది. గాంధారి వనం దగ్గరే గాంధారి మైసమ్మ ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుండి ఈ రోడ్డు మార్గంలో రహదారి ప్రమాదాలు తగ్గిపోయాయని స్థానికులు విశ్వసిస్తారు. ఇక్కడ గాంధారి మైసమ్మ దేవాలయంతోపాటు నాగదేవత ఆలయం ఉంది. ప్రధాన రహదారిని ఆనుకొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి అధిక సంఖ్యలో పర్యాటకులని ఆకర్షించే ప్రాంతం ఇది.
అభివృద్ధి
[మార్చు]ఈ ఉద్యానవనంలో 5 కిలోమీటర్ల దూరం వాకింగ్ ట్రాక్ నిర్మించారు. సందర్శికులు వాకర్ల సౌకర్యార్థం సుమారు 10 లక్షల వ్యయంతో గెజిబో సేద తీరేందుకు కూర్చునేది నిర్మాణం చేపట్టారు. జింకలను వీక్షించేందుకు సఫారీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు ఇంకా అభివృద్ధి జరగవలసి ఉంది. పాలకులు, ప్రభుత్వం పట్టించుకుంటే ఉన్న పర్యాటక ప్రాంతాలు అభివృద్ధిచెంది అందరికి అందుబాటులోకి వస్తాయని, తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల పర్యాటక హబ్గా మారే అవకాశం ఉంది
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "A showcase of biodiversity of vegetation". The Hindu (in Indian English). 2016-04-24. ISSN 0971-751X. Retrieved 2025-02-26.
- ↑ Today, Telangana (2022-08-18). "Telangana: Gandhari Vanam in Mancherial gets new lease of life". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2025-02-26.
- ↑ "పర్యాటక ప్రాంతంగా గాంధారి వనం | - | Sakshi". www.sakshi.com. Retrieved 2025-02-26.