Jump to content

గండ్ర రమాదేవి

వికీపీడియా నుండి
గండ్ర రమాదేవి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిసామాజిక సేవకురాలు, మాజీ జడ్పీటీసీ
బంధువులుగండ్ర అచ్యుతరావు (భర్త)

గండ్ర రమాదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, రాయికల్ మండల మాజీ జడ్పీటీసీ. ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2][3]

జననం

[మార్చు]

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కంచర్ల గ్రామంలో జన్మించింది.[4]

వివాహం - నివాసం

[మార్చు]

1981లో కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన గండ్ర అచ్యుతరావుతో రమాదేవి వివాహం జరిగింది. అదే సంవత్సరం రాయికల్‌కు మకాం మార్చారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

రాయకల్ గ్రామంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను కళ్ళార చూసిన రమాదేవి, వారిలో చైతన్యం తీసుకొచ్చి వారి జీవితాలను మార్చడంలో భాగంగా గ్రామైఖ్య సంఘాల ఏర్పాటుకు కృషిచేసింది. అలా గ్రామస్తుల సహకారంతో 1987లో గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలిగా ఎన్నికయింది. 1996లో జడ్పీటీసీగా గెలిచింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్ర్తీ శిశు సంక్షేమశాఖ స్టాండింగ్‌ కమిటీ అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. 2001లో మండల ప్రాదేశిక సభ్యురాలిగా, 2004లో జడ్పీటీసీగా రెండోసారి ఎన్నికయింది.

సామాజిక కార్యక్రమాలు

[మార్చు]
  1. రాయికల్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించి 2 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించింది
  2. రాయికల్‌ మండలవ్యాప్తంగా 1600 డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించింది
  3. ఎస్సీ, ఎస్టీ మహిళలకు దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇప్పించింది
  4. మండలంలోని పలు గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కృషిచేసింది
  5. ఆర్‌.ఎస్‌.ఎం.ఏ. పథకం ద్వారా మండలంలోని ఉన్నత పాఠశాలలకు పక్కా భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించింది.

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (6 March 2018). "20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు". Retrieved 9 March 2018.[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి (6 March 2018). "మహిళా దినోత్సవం సందర్భంగా.. 20 మంది మహిళలకు అవార్డులు". Retrieved 9 March 2018.[permanent dead link]
  3. ఈనాడు (6 March 2018). "మహిళామణులకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు". Archived from the original on 11 మార్చి 2018. Retrieved 9 March 2018.
  4. ఆంధ్రజ్యోతి, నవ్య, ఓపెన్ పేజి (7 March 2018). "సేవా రమణీయం!". కూర్మాచలం శ్రీనివాస్‌. Retrieved 9 March 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  5. Telangana Today (8 March 2018). "Telangana govt felicitates women achievers". Retrieved 9 March 2018.