Jump to content

గండి రామన్న దేవాలయం (నిర్మల్)

అక్షాంశ రేఖాంశాలు: 19°05′N 78°20′E / 19.09°N 78.34°E / 19.09; 78.34
వికీపీడియా నుండి
గండి రామన్న దేవాలయం (నిర్మల్)
గండి రామన్న దేవాలయం ప్రాంగణంలో ఉన్న శిరిడి సాయి బాబా మందిరం
గండి రామన్న దేవాలయం ప్రాంగణంలో ఉన్న శిరిడి సాయి బాబా మందిరం
గండి రామన్న దేవాలయం (నిర్మల్) is located in Telangana
గండి రామన్న దేవాలయం (నిర్మల్)
గండి రామన్న దేవాలయం (నిర్మల్)
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°05′N 78°20′E / 19.09°N 78.34°E / 19.09; 78.34
పేరు
ఇతర పేర్లు:గండి రామాలయం
ప్రధాన పేరు :శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నిర్మల్ ,తెలంగాణ
దేవనాగరి :गंडि रामन्ना देवस्थान निर्मल
మరాఠీ:गंडि रामन्ना देवस्थान निर्मल
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిర్మల్ జిల్లా
ప్రదేశం:నిర్మల్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీరాముడు, శివుడు, గణపతి, శ్రీ సాయిబాబా, దత్తాత్రేయ స్వామి
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి, మహాశివరాత్రి, దత్తాత్రేయ జయంతి, ఉగాది, దసరా
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం, హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:06
గండి రామన్న గుహలోని శివాలయం-నిర్మల్

గండి రామన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నుండి ఆదిలాబాదు వైపు వెళ్ళే పాత రహదారి కుడి వైపున సహ్యాద్రి పర్వత శ్రేణులలో సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో అత్యంత ప్రాచిన మైన ఆలయం.స్వయనా శ్రీరామచంద్రుడు రాతి గుహల్లో శివలింగం ప్రతిష్టించారని చెబుతారు [1][2].

చరిత్ర

[మార్చు]

నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గండి రామన్న ఆలయం చాలా పురాతన మైన హిందూ దేవాలయం. స్థానికుల కథనం ప్రకారం లంక రాక్షస రాజైన రావణుడు సీతను అపహరించి లంక రాజ్యానికి తీసుకుని వెళ్ళుతాడు. అప్పుడు రాముడు తన భార్య సీతను రక్షించడానికి తన సోదరుడు లక్ష్మణుడు, హనుమంతుని నేతృత్వంలో వానర సైన్యం సహాయంతో సీత అన్వేషణ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడని, ఇచ్చట రాముడు రాతి గుహల్లో శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు ప్రతిష్టించాడని,[3] స్థానికులు చెబుతారు. అత్యంత మహిమాన్వితమైన ఆలయాలలో ఒకటిగా చెప్పబడే ఈ ఆలయంలో శివునికి విశేష పూజలు జరుగుతాయి.

పూజలు ఉత్సవాలు

[మార్చు]

గండి రామన్న ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, మహాశివరాత్రి, వినాయక చవితి, శ్రీ సాయిబాబా, దత్తాత్రేయ జయంతి మొదలగు వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనబడేలా తీర్చి దిద్దుతారు. ఆలయంలో కొలువుదీరిన స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తారు. ఉత్సవాలు సందర్భంగా ఆలయంలో దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సహజ సిద్ధమైన గుహల్లో కొలువైవున్న శివలింగాన్ని, నందీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. ఆలయంలోని గుట్ట కింద భాగంలో శ్రీ సాయిబాబా, దత్తాత్రేయ స్వామి , వరసిద్ధి వినాయకుడు కొలువుదీరినాడు.శ్రీసీతారామ కళ్యాణోత్సవాలు, అభిషేకోత్సవాలు, కార్తీక దీపోత్సవం ఆలయంలో అతి వైభవంగా నిర్వహిస్తారు.ఈ ఘాట్ ప్రాంతం సహ్యాద్రి పర్వత శ్రేణులలో భాగంగా కావడంతో విభిన్నమైన ప్రకృతి సుందరమైన దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల భక్తులకు కావలసినంత ఆధ్యాత్మిక భక్తి భావం, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఆలయంలో కార్తీక దిపోత్సవం

[మార్చు]

హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహిళ భక్తులు దీపారాధనలు, ఉపవాసాలు, వ్రతాలు సత్య నిష్ఠతో దీపారాధనలో పాల్గొన్ని దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుతారు.

విశేషాలు

[మార్చు]

ఈ గండి రామన్న ఆలయ గుహల్లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి నేటికి కూడా గాలి, వెలుతురు విశాలంగా రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. గుట్ట పైన ఉన్న కంచు బండ పై చిన్న రాయితో కొడితే వచ్చే సబ్దం విన సొంపుగా ఉంటుంది.[4] రాముడు సీత జాడ కోసం వానర సైన్యంతో వచ్చారని అందువల్ల ఈ ప్రాంతంలో నేటికి కూడా వానరాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.

నిధులు మంజూరు

[మార్చు]

అతి పురాతన నిర్మల్ గండి రామన్న దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించడాని గత బి.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ దేవాదాయ శాఖ,న్యాయ,అటవీ శాఖల మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో రూపాయి 1.25 కోట్లు మంజూరు చేశారు. స్వయంభూ క్షేత్రాని అన్ని హంగులతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా నిర్మించడంతో దివ్యక్షేత్రం రూపుదిద్దుకుంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న గండిరామన్న క్షేత్రం..!!". News18 తెలుగు. 2024-09-28. Retrieved 2024-11-12.
  2. "గండి ఆంజనేయస్వామి శ్రీరాముడే చెక్కిన శిల్పం | special story to gandi Anjaneya Swamy | Sakshi". www.sakshi.com. Retrieved 2024-11-12.
  3. "నిర్మల్‌ | - | Sakshi". www.sakshi.com. Retrieved 2024-11-12.
  4. Bharat, E. T. V. (2021-12-17). "Gandi Ramanna temple: రాతితో కొడితే వింత శబ్దం.. ఆ మహిమాన్విత ఆలయం ఎక్కడో తెలుసా?". ETV Bharat News. Retrieved 2024-11-12.