Jump to content

గండపెండేరం

వికీపీడియా నుండి
గండపెండేరం

గండపెండేరం అంటే ఏదైనా రంగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే తిరుగులేని బహుమతి. రాజుల కాలంలో రాజు సభలో అందరి సమక్షంలో విద్వాంసుల మధ్య వాదోపవాదాలు జరిగేవి. వాటిలో నెగ్గిన వారికి బంగారు కంకణం చేయించేవారు. దాన్నీ గండపెండేరం అంటారు.

రాయలవారి కాలంలో

[మార్చు]

శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో మొదటివాడు, ’ఆంధ్రకవితాపితామహుడు’ బిరుదాంకితుడు అల్లసాని పెద్దన రాయలవారికి అత్యంత ప్రీతిపాత్రుడు, రాయలువారి ఏనుగులు అధిరోహించేందుకు సమ్మతి గల ఏకైక కవి గా, రాయలువారు పెద్దనకి స్వయంగా తులాభారం చేసినట్టుగా, సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండాలి అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు.[1]

జాషువాకు గండపెండేరం

[మార్చు]

వెంకటశాస్త్రిపై జాషువా రాసిన తొమ్మిది పద్యాలతో ఒకదానిని వారణాసి రామకృష్ణ వినిపిం చారు. వెంకటశాస్త్రి స్వయంగా జాషువాకు గండపెండేరం తొడిగించారని శివరామకృష్ణ తెలిపారు.[2]

డా.గంగాధరన్ కు

[మార్చు]

తనకు గుండె శస్త్రచికిత్స చేసి ప్రాణదానం చేసిన వైద్యునికి పద్మవిభూషన్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు బంగారు గండపెండేరం తొడిగి సత్కారం చేసుకున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "భువన విజయం – మన అఖండ తెలుగు భాషా సాహితీ సమ్మేళనం ! November 17, 2015". Archived from the original on 2016-03-27. Retrieved 2016-04-08.
  2. "జాషువా కవితల్లో 'పదార్థం' ఉంది Sakshi | Updated: August 12, 2012". Archived from the original on 2017-05-19. Retrieved 2016-04-08.
  3. అక్కినేని జీవితంలో అపూర్వ ఘట్టం !August 27, 2012[permanent dead link]