ఖుంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖుంగ్ అనే ఈ వాద్యపరికరం మణిపూర్, త్రిపుర, మేఘాలయ ప్రాంతములలో అధికంగా వాడుతారు[1][2]. ఇది చిన్న బంతి లాంటి ఆకారంలో కల వాయిద్యం. బంతిలాంటి కాళీ బుర్ర ఎ వాయిద్యానికి గాలి అరలాగ పనిచేస్తుంది. ముందుకు పొడుచుకు వచ్చిన రీతిలో వెదురుతో అమర్చిన నాజిల్ అనే పరికరం ఊదేందుకు గొట్టంలా పనిచేస్తుంది. ఆరు వెదురు గొట్టాల సముదాయం కల పైపుకు ఒక సింగిల్ హీటింగ్ పీక ఉంటుంది. పలుచని పొరని వదిలిపెట్టి చిన్న దీర్ఘ చతురస్రాకారంలో ఒక రంధ్రం చేస్తారు. అలా వదిలిపెట్టిన పొర ప్రకంపనకారిగా పనిచేసి శభ్దాన్ని సృష్టిస్తుంది. దీనికి అమర్చిన వెదురు గొట్టంలో పార్శ్వభాగాలలో చిన్న చిన్న రంద్రాలుంటాయి. ఇవి శబ్ధాన్ని నియంత్రిస్తుంటాయి. ఈ వాయిద్యం ఈశాన్యరాష్ట్రాలలోని గిరిజన నృత్యాలలో సహకార వాయిద్యంగా వాడుతారు.

మూలాలు

[మార్చు]
  1. Dick, Alastair DickAlastair (2015), "Khung", The Grove Dictionary of Musical Instruments (in ఇంగ్లీష్), Oxford University Press, doi:10.1093/acref/9780199743391.001.0001/acref-9780199743391-e-3863, ISBN 978-0-19-974339-1, retrieved 2024-06-20
  2. "Musical Instruments of Mizoram". www.oknortheast.com. Retrieved 2024-06-20.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఖుంగ్&oldid=4238915" నుండి వెలికితీశారు