ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Khammam Fort | |
---|---|
Stambhadri Hills లో భాగం | |
Khammam, Telangana, India | |
భౌగోళిక స్థితి | 17°14′43″N 80°08′48″E / 17.24528°N 80.14667°E |
రకము | Hill Fort |
ఎత్తు | 867 మీటర్లు (2,844 అ.) |
స్థల సమాచారం | |
హక్కుదారు | Government of India |
నియంత్రణ | Musunuri Nayaks 1210 A. D. - 1369 A. D.
Gurijala Nayaks 1369 A. D. - 1433 A. D. Independent rulers 1512 A. D. -1515 A.D Sri Krishnadevaraya of Tuluva Dynasty 1515 A.D for a brief period Qutb Shahi dynasty 1518 A.D - 1687 A.D Mughal Empire 1687 A.D - 1707 A.D Asaf Jahi Dynasty 1707 A.D-1948 A.D India (1948 - Till date) |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | Yes |
పరిస్థితి | Declared Protected Monument by Archaeological Survey of India in 2005. Mostly Destroyed. |
స్థల చరిత్ర | |
కట్టించింది | Musunuri Nayaks |
వాడుకలో ఉందా | Tourism |
వాడిన వస్తువులు | Stone, Limestone mortar |
Battles/wars | Musunuri Nayaks, Gurijala Nayaks, Qutub Shahis, Aurangazeb, Sri Krishnadevaraya and Local Rulers |
Events | Stambhadri Sambaralu,1000 Year Celebrations of Khammam Khilla |
Garrison information | |
Occupants | Musunuri Nayaks - 1210 A. D. - 1369 A. D.
Gurijala Nayaks 1369 A. D. - 1433 A. D. Krishna Deva Raya of Tuluva Dynasty, Shitab Khan - 1515 A.D - 1518 A.D Qutb Shahi dynasty- 1518 A.D - 1687 A.D Aurangazeb of the Mughal Empire - 1687 A.D - 1707 A.D Asaf Jahi Dynasty - 1707–1948 A.D |
ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది. ఈ కోట 300 సంవత్సరాల పాటు కాకతీయ రెడ్డి రాజుల ఆధీనంలో ఉంది. అప్పటి కాకతీయ రాజుల సైన్యాధిపతుల మధ్య విభేదాల కారణంగా, ఈ కోట పద్మనాయక వంశం (వెలమ రాజులు) చేతుల్లోకి వెళ్లింది, కొంతకాలం తర్వాత నందవాణి, కల్లూరు, గుడ్లూరు రాజులు వంటి వివిధ స్వతంత్ర పాలకులచే పాలించబడింది. ఆ తరువాత వచ్చిన ముసునూరి నాయకులు, కుతుబ్ షాహీ వంశస్థులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు.[1][2]
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ లాగ అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది.
గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు పది ద్వారాలున్నాయి. పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహలు ఉన్నాయి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ S.Ravi (2023-05-30). "13th Century Khammam Fort in Telangana being spruced up to woo tourists". Indianarrative (in ఇంగ్లీష్). Retrieved 2023-10-05.
- ↑ "కాకతీయుల ఖమ్మం కోట తెలంగాణ,Khammam Fort Of Kakatiyas -" (in English). 2023-01-25. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-05.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]