Jump to content

క‌ర్త‌వ్యం (2018 సినిమా)

వికీపీడియా నుండి
క‌ర్త‌వ్యం
దర్శకత్వంగోపి నైనర్‌
నిర్మాతశ‌ర‌త్ మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్‌
తారాగణంనయనతార
విఘ్నేష్
సును లక్ష్మి
వినోదిని వైద్యనాథన్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్‌ ట్రైడెంట్ ఆర్ట్స్
దేశంభారతదేశం
భాషతెలుగు

క‌ర్త‌వ్యం 2018లో విడుదలైన తెలుగు అనువాద సినిమా. తమిళ చిత్రం ఆఱమ్ దీనికి మాతృక.[1]

నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకొంటుంది యువ ఐఏఎస్ అధికారిణి మ‌ధువ‌ర్షిణి (న‌య‌న‌తార‌). ప‌క్క‌నే స‌ముద్రంతో పాటు.. అంత‌రిక్ష ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన ఆ ప్రాంతంలోని నీటి కరవుని చూసి చ‌లించిపోతుంది. ఎలాగైనా గ్రామాల‌కి తాగునీరు అందేలా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంటుంది. ఇంత‌లోనే ఓ ఊళ్లో నిరుపేద దంప‌తుల కూతురైన ధ‌న్సిక బోరు బావిలో ప‌డిపోతుంది. విష‌యం తెలుసుకొన్న ఆమె త‌న యంత్రాంగంతో క‌లిసి ఆగ‌మేఘాల మీద ర‌క్ష‌ణ చ‌ర్య‌లకి పూనుకుంటుంది. ఆరంభంలోనే ర‌క‌ర‌కాల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆ త‌ర్వాత కూడా పాప‌ని ర‌క్షించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌లేవీ ఫ‌లితాన్నివ్వ‌క‌పోవడంతో అధికారులంతా నిస్సహాయ‌త ప్ర‌ద‌ర్శిస్తారు. మ‌రికొన్ని గంట‌లు గ‌డిస్తే ధ‌న్సిక ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు తెలిపాక క‌లెక్ట‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంది? ఆమె నిర్ణ‌యం వ‌ల్ల బోరు బావిలో ప‌డిన పాప ప్రాణాల‌తో బ‌య‌టికొచ్చిందా లేదా? ఆ ఆప‌రేష‌న్ త‌ర్వాత క‌లెక్ట‌ర్‌గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? త‌దిత‌ర విషయాలు కథలో భాగం.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • ఛాయాగ్ర‌హణం: ఓం ప్రకాష్
  • సంగీతం: జిబ్రాన్
  • కూర్పు: గోపి కృష్ణ
  • నిర్మాత‌లు: శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్‌
  • కథ దర్శకత్వం : గోపి నైనర్‌
  • నిర్మాణ సంస్థ‌: నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్‌ ట్రైడెంట్ ఆర్ట్స్

మూలాలు

[మార్చు]
  1. "Nayantara's Karthavyam Movie Review & Rating". thehansindia.com. 2018-03-13. Retrieved 2018-03-16.
  2. "Karthavyam Movie Review". www.chitramala.in. 2018-03-14. Archived from the original on 2018-03-16. Retrieved 2018-03-16.

బయటి లంకెలు

[మార్చు]