Jump to content

క్లెమెంట్ జాన్సన్

వికీపీడియా నుండి
క్లెమెంట్ జాన్సన్
1894లో దక్షిణాఫ్రికా జట్టులోని మధ్య వరుసలో, కుడివైపు నుండి రెండవ స్థానంలో క్లెమెంట్ జాన్సన్ ఉన్నాడు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్లెమెంట్ లెకీ జాన్సన్
పుట్టిన తేదీ(1871-03-31)1871 మార్చి 31
కార్బరీ, ఐర్లాండ్
మరణించిన తేదీ1908 మే 31(1908-05-31) (వయసు 37)
రూడ్‌పూర్ట్, సౌత్ ఆఫ్రికన్ రిపబ్లిక్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 32)1896 2 March - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1893–94Transvaal
కెరీర్ గణాంకాలు
పోటీ Tests First-class
మ్యాచ్‌లు 1 4
చేసిన పరుగులు 10 117
బ్యాటింగు సగటు 5.00 16.71
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 7 52
వేసిన బంతులు 140 470
వికెట్లు 3
బౌలింగు సగటు 65.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/27
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 2/-
మూలం: CricketArchive, 12 August 2017

క్లెమెంట్ లెకీ జాన్సన్ (1871, మార్చి 31 - 1908, మే 31) ఐరిష్ మాజీ క్రికెటర్. 1896లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున ఒక టెస్ట్ మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

క్లెమెంట్ జాన్సన్ 1871 మార్చి 31న ఐర్లాండ్‌లోని కౌంటీ కిల్డేర్‌లోని కార్బరీలో జన్మించాడు. డబ్లిన్‌లోని ట్రినిటీ కళాశాలలో చదువుకున్నాడు. అక్కడ 1889 నుండి 1893 వరకు డబ్లిన్ యూనివర్సిటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1890 - 1893 మధ్యకాలంలో చిన్న మ్యాచ్‌లలో ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[1] 1892 లో జెంటిల్‌మెన్ ఆఫ్ ఐర్లాండ్ జట్టుతో ఉత్తర అమెరికాలో పర్యటించాడు.1893లో ఆరోగ్య కారణాల రీత్యా ఐర్లాండ్‌ను విడిచిపెట్టి, ట్రాన్స్‌వాల్‌లో స్థిరపడ్డాడు. అక్కడ 1893-94 సీజన్‌లో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. క్యూరీ కప్‌లో ట్రాన్స్‌వాల్ జట్టు తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు. కొంతకాలం తర్వాత, 1894లో ఇంగ్లాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో 24 మ్యాచ్‌లు ఆడబడ్డాయి, వాటిలో ఏదీ ఫస్ట్ క్లాస్ కాదు. జాన్సన్ 14.32 సగటుతో 508 పరుగులు చేసి 17.27 సగటుతో 50 వికెట్లు తీశాడు. లివర్‌పూల్, డిస్ట్రిక్ట్‌పై 112, జెంటిల్‌మెన్ ఆఫ్ ఐర్లాండ్‌పై 79 పరుగులతో అత్యుత్తమ స్కోర్లు సాధించాడు.[1]

జాన్సన్ 1896 మార్చిలో దక్షిణాఫ్రికా తరపున ఇంగ్లాండ్‌తో జొహన్నెస్‌బర్గ్‌లోని ఓల్డ్ వాండరర్స్ మైదానంలో తన ఏకైక టెస్ట్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 0/57 తీసుకున్నాడు. తర్వాత 3, 7 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.[2]

మరణం

[మార్చు]

జాన్సన్ తన 37 సంవత్సరాల వయస్సులో 1908, మే 31న మారైస్‌బర్గ్, రూడ్‌పోర్ట్, ట్రాన్స్‌వాల్‌లో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 (9 July 1908). "Obituary".
  2. "2nd Test, England tour of South Africa at Johannesburg, Mar 2-4 1896". Cricinfo. Retrieved 10 February 2020.
  3. "Clement Johnson". ESPN Cricinfo. Retrieved 24 March 2014.

బాహ్య లింకులు

[మార్చు]