క్రిషన్ కుమార్ బేడీ
క్రిషన్ కుమార్ బేడీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | రామ్ నివాస్ సుర్జాఖేరా | ||
నియోజకవర్గం | నర్వానా | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 నుండి 2019 | |||
గవర్నరు | కప్తాన్ సింగ్ సోలంకి సత్యదేవ్ నారాయణ్ ఆర్య | ||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | అనిల్ ధంతోరి | ||
తరువాత | రామ్ కరణ్ | ||
నియోజకవర్గం | షహబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
క్రిషన్ కుమార్ బేడీ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 17 అక్టోబర్ 2024న ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో సామాజిక న్యాయ, సాధికారత & ఎస్సీ, బీసీ సంక్షేమ & అంత్యోదయ (SEWA) హాస్పిటాలిటీ ఆర్కిటెక్చర్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]క్రిషన్ కుమార్ బేడీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో షహబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి రామ్ కరణ్ పై 562 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై,[2] 2014 నుండి 2019 వరకు మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో సామాజిక న్యాయ & సాధికారత, ఎస్సీ & బీసీ సంక్షేమ, స్త్రీ & శిశు అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశాడు.[3]
క్రిషన్ కుమార్ బేడీ 2019 ఎన్నికలలో షహబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి రామ్ కరణ్ చేతిలో 37,127 ఓట్ల తేడాతో ఓడిపోయి అనంతరం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజకీయ కార్యదర్శిగా పని చేశాడు.[4]
క్రిషన్ కుమార్ బేడీ 2024 శాసనసభ ఎన్నికలలో నర్వానా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సత్బీర్ డబ్లైన్ పై 11499 ఓట్ల మెజారిటీతో రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికై,[5] 17 అక్టోబర్ 2024న ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో సామాజిక న్యాయ, సాధికారత & ఎస్సీ, బీసీ సంక్షేమ & అంత్యోదయ (SEWA) హాస్పిటాలిటీ ఆర్కిటెక్చర్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (22 October 2024). "Saini takes most portfolios, Vij gets transport". Retrieved 1 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Indian Panorama (31 October 2014). "Haryana Cabinet announced, CM keeps Home and Power". Retrieved 1 November 2024.
- ↑ The Indian Express (3 May 2023). "Khattar's political secretary resigns, says need to 'spend more time among people' for 2024 polls" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Narwana". Retrieved 1 November 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Retrieved 26 October 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.