కొలిపాక శోభారాణి
కొలిపాక శోభారాణి | |
---|---|
ప్రసిద్ధి | కవయిత్రి, రచయిత్రి |
కొలిపాక శోభారాణి రచయిత్రి
విశేషాలు
[మార్చు]ఈమె సిరిసిల్లకు చెందిన విశ్రాంత సెస్ ఉద్యోగి. ఈమెకు చిన్నతనం నుంచే సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. చేయూత, సంద్రం, వెన్నెల సోన, స్మృతి, చలనం, అంచు, ఉగ్గం, ఖాయిలా వంటి అనేక కవిత్వాలు రచించింది. అనేక కథలు వ్రాసింది. బలహీనవర్గాల ప్రజల సమస్యలను, దళితుల వెతలను తన కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసింది. తన కవితాసంపుటి 'చలనం' పుస్తకానికి అనేక పురస్కారాలు వచ్చాయి. రంగినేని ఎల్లమ్మ సాహిత్య, రుద్ర రవి స్మారక, సోమెపల్లి వెంకట సుబ్బయ్య, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి ఉత్తమ కవయిత్రి, మల్లినాథ సూరి కళాపీఠం, గురజాడ అప్పారావు జిల్లాస్థాయి పురస్కారాలు అందుకున్నది. జ్యోతిబా పులే, అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందింది. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రచించిన చింగారి, ఆమె పదం, చిగురుకొమ్మ పుస్తకాలలో కవితలు రచించింది.[1] ఈమె కవితలు తంగేడువనం, తొలిపొద్దు, ఉద్విగ్న మొదలైన కవితా సంకలనాలలో చోటు చేసుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ న్యూస్ టుడే (8 April 2023). "అతివ సాహిత్యం సమాజ హితం". ఈనాడు దినపత్రిక. Retrieved 2 November 2024.