Jump to content

కొత్తపల్లి శామ్యూల్ జవహర్

వికీపీడియా నుండి
కొత్తపల్లి శామ్యూల్ జవహర్
కొత్తపల్లి శామ్యూల్ జవహర్


మాజీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 - 2019
నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 26 జనవరి 1965
తిరువూరు, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు అమృతం, దానమ్మ
నివాసం కొవ్వూరు

కొత్తపల్లి శామ్యూల్ జవహర్ (కె.ఎస్. జవహర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 నుండి 2019 వరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కె.ఎస్. జవహర్ 26 జనవరి 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, తిరువూరు గ్రామంలో అమృతం, దానమ్మ దంపతులకు జన్మించాడు.[2] ఆయన బిఎ బిఇడి, పిజిడిటిటి పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా పని చేశాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కె.ఎస్. జవహర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2014లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తానేటి వ‌నిత పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]

కె.ఎస్. జవహర్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎస్‌సి హౌస్ కమిటీ సభ్యుడిగా, ఎన్‌జి రంగా వ్యవసాయ కమిటీ బోర్డ్ సభ్యుడిగా పనిచేసి, 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 ఏప్రిల్ 2017న ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి చేతిలో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. Hmtv (11 May 2018). "మంత్రి జవహర్ ఇంట విషాదం." Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  3. Andrabhoomi (3 April 2017). "కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  4. Suryaa (3 April 2017). "ఏపీ మంత్రివర్గంలో కొత్త వారి వ్యక్తిగత వివరాలు". Archived from the original on 2017-04-05. Retrieved 10 December 2021.
  5. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  6. Asianet News (2 April 2017). "ఇవీ ఆంధ్రా కొత్త మంత్రుల శాఖలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.