కొత్తపట్నం
కొత్తపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిప్రకాశం జిల్లాకు చెందిన కొత్తపట్నం మండలానికి మండల కేంద్రం.
కొత్తపట్నం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°26′49″N 80°9′50″E / 15.44694°N 80.16389°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొత్తపట్నం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08623 ) |
గ్రామనామ వివరణ
[మార్చు]కొత్తపట్నం అన్న గ్రామనామం కొత్త అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో కొత్త అన్న పదం పౌర్వాపర్యసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.[1] సముద్రతీరప్రాంతం కావడంతో ఈ గ్రామంపేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం స్వీకరించవచ్చు.
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రతీరం కేవలం 2కి.మీ దూరం.
సమీప గ్రామాలు
[మార్చు]ఈతముక్కల 8 కి.మీ, అల్లూరు 8 కి.మీ, మదనూరు 9 కి.మీ, ఆలకూరపాడు 11 కి.మీ, సంకువానిగుంట 10 కి.మీ.
విద్యా సౌకర్యాలు
[మార్చు]బొమ్మిశెట్టి సీతమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]ఈ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను, 2017, జూలై-5న ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీకి 2014, జనవరి-18న జరిగిన ఎన్నికలలో మూగా ధనమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
గ్రామ ప్రముఖులు
[మార్చు]ఇమ్మానేని హనుమంతరావు నాయుడు: నటుడు, ప్రయోక్త, నాటక సమాజ నిర్వాహకుడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ రాజగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయం గ్రామంలోని మోటమాల రహదారిలో ఉంది.
- శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం.
- శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి పంచాహ్నిక మహోత్సవాలు, 2014, జూలై-2వ నుండి 6వ తేదీ వరకు నిర్వహించారు. 2వ తేదీన కలశస్థాపన, కుంకుమపూజ, రాత్రికి పులివాహన ఉత్సవం, 3వ తేదీన సింహ, గజవాహన సేవలు, 4వ తేదీన చిన్న గజవాహన, అశ్వవాహన సేవలు, 5వ తేదీన వ్యాళీ, పెద్ద గజవాహనసేవ, 6వ తేదీన పొంగళ్ళు, పసుపు బండ్లు, శిడిమాను ఉత్సవం నిర్వహించారు. 7వ తేదీన గంగానమ్మ తల్లికి కల్లిపాటు నిర్వహించారు. ఈ తిరునాళ్ళలో ప్రతి రోజూ, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించారు.
- శ్రీ ఆదికేశవస్వామివారి ఆలయం.
- శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి పంచాహ్నిక ద్వితీయ బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఐదవరోజైన 2015, మే-24వ తేదీ ఆదివారంఉదయం, రేణుకా యుద్ధ ఘట్టం అంగరంగవైభవంగా సాగినది. అమ్మవారికి గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తజన సందోహంతో ఆలయప్రాంగణం క్రిక్కిరిసినది. ఈ సందర్భంగా వివిధ అలంకరణలతో ఏర్పాటుచేసిన కుంకుమబండ్ల ప్రదర్శన నేత్రపర్వంగా సాగినది.
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2016, ఏప్రిల్-3వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు.
గ్రామ విశేషాలు
[మార్చు]- కొత్తపట్నం గ్రామం ఇటీవల కాలంలో ఒక పర్యాటక కేంద్రంగా పేరుగాంచుచున్నది. సముద్రతీరం కేవలం 2కి.మీ దూరం, పచ్చటి పంట పొలాలు, పూల తోటలు, గ్రామ వాతావరణం ఈ గ్రామానికి వన్నె తెచ్చుచున్నాయి.
- కొత్తపట్నం సముద్రతీరంలో, 2015, జూన్-11,12 తేదీలలో, బీచ్ ఫెస్టివల్ (తీర ఉత్సవాలు) నిర్వహించెదరు.
మూలాలు
[మార్చు]- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 240. Retrieved 10 March 2015.