కొండబోలు బసవ పున్నయ్య
స్వరూపం
![](http://upload.wikimedia.org/wikipedia/te/f/fd/%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81_%E0%B0%AC%E0%B0%B8%E0%B0%B5_%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF1.jpg)
కొండబోలు బసవ పున్నయ్య ప్రముఖ వైద్యులు, విద్యాదాత, అనేక ధార్మిక సంస్థలకు ముఖ్యంగా పుస్తక సంస్థలకు పలు రకాలుగా విరాళాలు ఇస్తూ పోషిస్తున్నారు.
జననం, విద్య
[మార్చు]కొండబోలు బసవ పున్నయ్య గారు గుంటూరు జిల్లా చుండూరు మండలం వేట పాలెం గ్రామంలో రాజారావు, వరలక్ష్మమ్మ దంపతలకు 1933 మే 6 న జన్మించారు. ప్రాథమిక విద్య చేబ్రోలు, గూడవల్లి లోనూ,, గుంటూరులో చదివారు. గుంటూరు వైద్య కళాశాల నుండి వైద్య విద్యలో పట్టబద్రుడైనాడు. వీరి ధర్మ పత్ని శ్రీమతి వెంకట సుబ్బమ్మ. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.
పదవులు
[మార్చు]- 1969 నుండి 1995 వరకూ ఇండియన్ మెడీకల్ అసోషియేషన్ గుంటూరు శాఖకు కార్యదర్శిగా పనిచేసారు.
- 1998 నుండి 2001 వరకూ మరలా అదేపదవి కొనసాగించారు.
- నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీకి వ్యవస్థాక సభ్యునిగా చేరి ప్రస్తుతం అద్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సామాజిక సేవలో
[మార్చు]- గుంటూరులో 70 పడకల ఆసుపత్రి నడిపారు, దాని ద్వారా పేదలకు సేవలు చేసారు.
- గుంటూరు అరండల్ పేటలో ఉన్న కమ్మ జన విద్యార్థి వసతి గృహానికి విశేషమైన సేవలు చేసారు.
- గుంటూరు అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాలా కొరకు లక్ష రూపాయలు విరాళం అందించారు. దీనితో పాటు పలు గ్రంథాలయాలకు విరాళాలు ఇచ్చారు
- హిందూ శ్మశాన వాటికల పునరుద్దరణకు సేవలందిస్తున్నారు.
- భారతీయ మాసపత్రికను ప్రోత్సహిస్తున్నారు.
- వృద్దుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు.
- పేద బాల బాలికల కొరకు వసతి గృహం నిర్వహిస్తున్నారు.
నడిపిస్తున్న సంస్థలు
[మార్చు]- చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల
- కొండబోలు లక్ష్మీప్రసాద్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు. జనశిక్షణ సంస్థ
- తుమ్మల కళాపీఠం
- జె.కె.సి.ఆర్.వి.అర్
- మాదల శకుంతల నర్సింగ్ కళాశాల
పురస్కారాలు
[మార్చు]- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[1][2]
మూలాలు, బయటి లింకులు
[మార్చు]- కమ్మజన సేవా సమితి -పదేళ్ల ప్రగతి సంచిక నుండి
మూలాలు
[మార్చు]- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-17.