కేకి తారాపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేకి తారాపూర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేకి ఖుర్షెడ్జీ తారాపూర్
పుట్టిన తేదీ(1910-12-17)1910 డిసెంబరు 17
బొంబాయి, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1986 జూన్ 15(1986-06-15) (వయసు 75)
పూణే, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 46)1948 నవంబరు 10 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 40
చేసిన పరుగులు 2 441
బ్యాటింగు సగటు 2.00 11.30
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 2 42
వేసిన బంతులు 114 10,847
వికెట్లు 0 148
బౌలింగు సగటు 28.77
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 8/91
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 16/–
మూలం: CricInfo, 2022 నవంబరు 20

కేకీ ఖుర్షెడ్జీ తారాపూర్ (1910 డిసెంబరు 17 - 1986 జూన్ 15) 1948లో ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడిన భారతీయ క్రికెటరు, క్రికెట్ నిర్వాహకుడు.

తారాపూర్ బొంబాయిలోని హార్దా న్యూ హైస్కూల్, ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో చదువుకున్నాడు. రెండు చోట్లా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను BA డిగ్రీ పూర్తి చేసాడు. 1937 లో పార్సీల జట్టు, బొంబాయి జట్టు లతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ ప్రారంభించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరైన కేకి, ఖచ్చితత్వానికి ప్రసిద్ది చెందాడు. సీకే నాయుడును కూడా కట్టడి చెయ్యగలడనే పేరుంది. [1]

తారాపూర్ 1948-49లో వెస్టిండీస్‌పై వినూ మన్కడ్‌కు అండర్ స్టడీగా ఆడిన ముగ్గురు నలుగురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో మొదటి వాడు.

ఆ సీరీస్‌లో ఢిల్లీ టెస్టులో రెండో రోజు డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, వినూ మన్కడ్ బౌలింగులో రాబర్ట్ క్రిస్టియాని కొట్టిన ఫోర్‌ను ఆపడంలో తారాపూర్ వేళ్లకు గాయమైంది. అతను మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. అతను తిరిగి వచ్చినప్పుడు, అతను బంతిని తాకిన ప్రతిసారీ ప్రేక్షకులు ఎగతాళి చేసారు.[2]

తన ఏకైక టెస్టు ఆడిన నాలుగు నెలల తర్వాత తారాపూర్, తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. బాంబే, బరోడాల మధ్య జరిగిన ఆ రంజీ ఫైనల్లో అతను 99 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

తారాపూర్ తర్వాత క్రికెట్ పరిపాలనలోకి వెళ్లాడు. అతను 1967లో ఇంగ్లండ్‌కు, 1970-71లో వెస్టిండీస్‌కు వెళ్ళిన భారత జట్లకు మేనేజరుగా పనిచేసాడు. అతను 1954 నుండి 1982 వరకు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా పనిచేశాడు. 1974లో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అతన్ని గౌరవ సభ్యునిగా ఎన్నుకుంది.[1]

యుక్తవయసులో అండర్-19 కోచింగ్ క్యాంప్‌కు హాజరైనప్పుడు తారాపూర్‌ చేసిన ఒక వ్యాఖ్యతో ప్రేరణ పొందానని కపిల్ దేవ్ చెప్పాడు. తాను ఫాస్ట్ బౌలర్ అయినందున లంచ్‌కు ఇచ్చిన రెండు చపాతీలు సరిపోవడం లేదని కపిల్ ఫిర్యాదు చేయగా, తారాపూర్ అతడిని చూసి నవ్వుతూ భారత్‌లో ఫాస్ట్ బౌలర్లు లేరని చెప్పాడు. అతను విజయవంతమైన టెస్ట్ క్రికెటర్ అయిన తర్వాత కపిల్, ఒక ఫంక్షన్‌లో "వేగంగా బౌలింగ్ చేయమని నన్ను దాదాపు సవాలు చేయడం ద్వారా జీవితంలో ఒక లక్ష్యాన్ని" అందించాడని తారాపూర్‌ గురించి చెప్పాడు.[3] [4]


తారాపూర్ మోపెడ్ ఢీకొనడంతో పూణెలోని రూబీ నర్సింగ్ హోమ్‌లో మరణించాడు. [1] [5]

గమనికలు

[మార్చు]
  • భారత క్రికెట్‌లో ఇద్దరు కేకీ తారాపోర్‌లు ఉన్నారు. మరో తారాపూర్ (1922–2001) కోచ్‌గా మంచి గుర్తింపు పొందాడు. అతను బెంగుళూరులో ఉంటూ అనేక మంది కర్ణాటక జూనియర్లకు మార్గదర్శకత్వం వహించాడు. వారిలో కొందరు భారతదేశం కోసం ఆడారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Obituaries, Indian Cricket 1986, pp 686-687
  2. Indian Express, 12 November 1948
  3. Rajdeep Sardesai, Democracy's XI, p.130
  4. Ashish Magotra, The making of an all-rounder, Scroll, 26 August 2018
  5. Christopher Martin-Jenkins, Who's who of Test cricketers (1986)