కె. గోపినాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. గోపినాథ్
శాసనసభ సభ్యుడు, (తమిళనాడు శాసనసభ)
In office
2001–2016
అంతకు ముందు వారుబి. వెంకటస్వామి
తరువాత వారుపి. బాలకృష్ణ రెడ్డి
నియోజకవర్గంహోసూర్ నియోజకవర్గం

కె. గోపినాథ్ (జననం 1962 నవంబరు 19) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2001, 2006, 2011 ఎన్నికలలో హోసూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన ఆయన, 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మాతృభాష పట్ల ఎనలేని మమకారమున్న ఆయన గతంలో తమిళనాడు అసెంబ్లీలో పలుమార్లు తెలుగులోనే ప్రసంగించాడు. అంతేకాకుండా, జూన్ 2024లో భారత పార్లమెంట్లో కూడా ఆయన తెలుగులోనే ప్రమాణస్వీకారం చేసాడు. తమిళనాడులో తెలుగు వారి కోసం, తెలుగు భాషా సమస్యల కోసం నిరంతరం పోరాడే యోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.

రాజకీయ జీవితం

[మార్చు]

2011లో హోసూర్ నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆయన గతంలోనూ 2001, 2006 ఎన్నికలలో హోసూర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

అయితే, ఆయన 2016 ఎన్నికలలో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం కు చెందిన పి. బాలకృష్ణ రెడ్డి చేతిలో హోసూర్ సీటు నుండి ఓడిపోయాడు.[5]

బాల్యం

[మార్చు]

గోపినాథ్ మిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో 1962 నవంబరు 19న తెలుగు కుటుంబంలో జన్మించాడు.[6] ఆయన విద్యాభ్యాసం తెలుగు మాధ్యమంలోనే కొనసాగింది.

మూలాలు

[మార్చు]
  1. "తమిళ ఎంపీ గోపీనాథ్‌ తెలుగులో ప్రమాణ స్వీకారం | Tamil MP Gopinath". web.archive.org. 2024-06-26. Retrieved 2024-06-26.
  2. "List of MLAs from Tamil Nadu 2011" (PDF). Government of Tamil Nadu. Retrieved 2017-04-26.
  3. 2001 Tamil Nadu Election Results, Election Commission of India
  4. 2006 Tamil Nadu Election Results, Election Commission of India
  5. "Hosur (Tamil Nadu) Election Results". Infobase. Retrieved 2017-05-02.
  6. "Thiru. K. Gopinath (INC)". Legislative Assembly of Tamil Nadu. Retrieved 2017-05-02.