కృష్ణగిరి జిల్లా
Krishnagiri District
க்ரிஷ்ணகிரி மாவட்டம் Krishnagiri Mavattam | |
---|---|
District | |
దేశం | India |
రాష్ట్రం | తమిళనాడు |
Division | krishnagiri |
Municipal Corporations | Krishnagiri |
ప్రధాన కార్యాలయం | krishnagiri |
Boroughs | Krishnagiri |
Government | |
• Collector | T. P. Rajesh IAS |
భాషలు | |
• అధికార | తమిళం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 635xxx |
టెలిఫోన్ కోడ్ | 04343 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | TN-24,TN-70[1] |
Largest city | Hosur |
Largest metro | Hosur |
Central location: | 12°31′N 78°12′E / 12.517°N 78.200°E |
కృష్ణగిరి జిల్లా, భారతదేశం తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో వాయువ్య భాగంలో ఒక జిల్లా. ఈ జిల్లా ధర్మపురి జిల్లా నుండి 2004 నాటికి వేరు చేయబడింది. కృష్ణగిరి మునిసిపల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. తమిళనాడులో రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖలలో పైలట్ ప్రాతిపదికన నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ (NEGP) కింద ఈ జిల్లాలో ఇ-గవర్నెన్స్ మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది.[2][3] భారతదేశంలో మామిడిని అత్యధికంగా ఉత్పత్తి చేసే జిల్లాలలో ఈ జిల్లా ఒకటి[4] 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో ప్రతి 1,000 మంది పురుషులకు 958 స్త్రీల లింగ నిష్పత్తితో 1,879,809 మొత్తం జనాభాను ఉంది. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన ప.ట్టణం హోసూర్.
పేరు వెనుక చరిత్ర
[మార్చు]క్రిష్ణ అనేది నలుపు అనే మాటకు పర్యాయపదం. నల్లటి గిరులు ఉన్నాయి కనుక ఇది క్రిష్ణగిరి అయింది. క్రిష్ణగిరిలో నల్లని గ్రానైటు గనులు అత్యధికంగా ఉన్నాయి. అంతేగాక ఈ ఉరు క్రిష్ణదేవరాయలు పాలనలో భాగంగా ఉంటూ వచ్చింది. కృష్ణదేవరాయలు మరణానంతరం ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.[5]
భౌగోళికం, వాతావరణం
[మార్చు]క్రిష్ణగిరి జిల్లా వైశాల్యం 5143 చదరపు మైళ్ళు. క్రిష్ణగిరి జిల్లా తూర్పు సరిహద్దులో వేల్లూరు, తిరువణ్ణామలై జిల్లాలు, పడమర సరిహద్దులో కర్నాటక రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్, రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో ధర్మపురి జిల్లాలు ఉన్నాయి. క్రిష్ణగిరి జిల్లా సముద్రమట్టానికి 300-1400 మీటర్ల ఎత్తులో ఉపస్థితమై ఉంది. ఇది ఉత్తరంగా 11°12' -12° 49' అక్షాశం, తూర్పుగా 77° 27' E -78° 38' రేఖంశంలో ఉపస్థితమై ఉంది.
జిల్లా పరిపాలన
[మార్చు]క్రిష్ణగిరి జిల్లా 2004 ఫిబ్రవరి 9న తమిళనాడు రాష్టంలో 30వ జిల్లాగా ఏర్పడింది. ఇది పూర్వపు ధర్మపురి జిల్లాలోని ఐదు తాలూకాలు, పది పంచాయితీ సముతులను విభజించి ఏర్పాటు చేయబడింది. కృష్ణగిరి జిల్లా మొదటి కలెక్టర్ మంగత్ రామ్ శర్మ.
జిల్లా పరిపాలనకు జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తాడు. రెవెన్యూ పరిపాలన నిమిత్తం కృష్ణగిరి జిల్లా రెండు డివిజన్లు, ఏడు తాలూకాలుగా విభజించబడింది. ప్రతి డివిజన్‌కు ఒక రెవెన్యూ డివిజనల్ అధికారి నాయకత్వం వహిస్తాడు. తాలూకా స్థాయి పరిపాలనకు ఒక తహశీల్దార్‌లు బాధ్యత వహిస్తాడు. ఈ జిల్లాలో అభివృద్ధి పరిపాలన గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయితీలు (లేదా బ్లాక్‌లు) ద్వారా సమన్వయం చేయబడుతుంది. ఈ జిల్లాలో ఏడు పట్టణ పంచాయతీలు, 352 గ్రామ పంచాయతీలు, 874 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కృష్ణగిరి, హోసూరు రెండు రెవెన్యూ డివిజన్లు, కృష్ణగిరి, హోసూర్, పోచంపల్లి, ఉత్తంగరై, శూలగిరి, బర్గూర్, అంశెట్టి డెంకనికోట్టై ఎనిమిది తాలూకాలు ఉన్నాయి. కెలమంగళం, తల్లి, , కృష్ణగిరి, శూలగిరి, వేప్పనపల్లి, హోసూర్, కావేరిపట్టణం, పోచంపల్లి, మాథుర్, ఉత్తంగరై 12 పంచాయతీ యూనియన్లు ఉన్నాయి.[6]
జనాభా గణాంకాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 3,89,745 | — |
1911 | 4,07,883 | +0.46% |
1921 | 3,89,723 | −0.45% |
1931 | 4,54,928 | +1.56% |
1941 | 5,26,107 | +1.46% |
1951 | 5,92,009 | +1.19% |
1961 | 7,16,442 | +1.93% |
1971 | 8,81,371 | +2.09% |
1981 | 10,56,885 | +1.83% |
1991 | 13,05,013 | +2.13% |
2001 | 15,61,118 | +1.81% |
2011 | 18,79,809 | +1.88% |
ఆధారం: [7] |
2011 జనాభా లెక్కల ప్రకారం, కృష్ణగిరి జిల్లాలో 1,879,809 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 963 స్త్రీల లింగ నిష్పత్తి, జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ. మొత్తం జనాభాలో 217,323 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
వారిలో 112,832 మంది పురుషులు ఉండగా, 104,491 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 14.22% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు వారు 1.19% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 63.2%, జాతీయ సగటు 72.99% కంటే తక్కువ. [8]
జిల్లాలో మొత్తం 448,053 గృహాలు ఉన్నాయి. మొత్తం 877,779 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 218,600 మంది సాగుదారులు, 197,369 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 15,237 మంది గృహ పరిశ్రమలు, 310,795 ఇతర కార్మికులు, 135,778 ఉపాంత కార్మికులు, 17,430 మార్జినల్ కార్మికులు ఉన్నారు. మొత్తం జనాభాలో 22.79% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[9]
హిందూ మతం ప్రధాన మతం. మొత్తం జనాభాలో 91.7% మంది ఆచరిస్తున్నారు, ముస్లిం, క్రైస్తవ మైనారిటీలు 6.13%, 1.91% ఉన్నారు.[10]
వర్షపాతం
[మార్చు]క్రిష్ణగిరి పర్వతాలతో నిండిన భూభాగం కలిగిన జిల్లా. మైదానభూభాగంలో దక్షిణ పెన్నా నది జాలాలతో పంటలు పండిస్తున్నారు. జిల్లాలోని తూర్పు భూభాభాగం వేడివాతావరణం, పడమర భూభాభాగం విభిన్నంగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిఉంది. వార్షిక వర్షపాతం 830 మిల్లీమీటర్లు ఉంటుంది. జూన్ మాసంలో వేసవి, జూలై మాసలో వర్షాలు, డిసెనర్- ఫిబ్రవరి వరకు చలిఉంటుంది.
భూవివరణ
[మార్చు]మొత్తం పంటభూమి, నీటిపారుదల, వైవిధ్యమైన పంటలు పండిస్తున్న భూమి, సారవంతమైన భూమి, చిత్తడినేలలు, అరణ్యం.
వర్గీకరణ | భూభాగం. | శాతం |
---|---|---|
అరణ్యం | 202409 | 39% |
బీడు | 24194 | 5% |
వ్యవసాయేతర ఉపయోగం | 21466 | 4% |
సారవంతమైన భూమి | 6341 | 1% |
సతతహరిత భూమి | 7378 | 1% |
విద్యారంగం
[మార్చు]క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వనిర్వహణలో నడుస్తున్న కమ్యూనిటీ పాలిటెక్నిక్ ఉంది. అంతేకాక తమిళనాడు ఆది ద్రావిడర్ హౌసింగ్ డెవలెప్మెంటు కార్పొరేషన్ నర్సింగ్, కేటరింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ కోర్సులను చదవడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ కోర్సులను ప్రైవేట్ శిక్షణా సంస్థద్వారా షెడ్యూల్డ్ జాతి, షేడ్యూల్డ్ తెగల ప్రజలకు శిక్షణ అందిస్తుంది.అలాగే పారిశుధ్యకార్మికులకు కూడా ఈ శిక్షణకు అవకాశం ఇస్తుంది.
అలాగే క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వం ఈ క్రింది విద్యా సంస్థలను నిర్వహిస్తుంది.
సంఖ్య. | |
---|---|
ప్రాథమిక పాఠశాలలు | 988 |
మాధ్యమిక పాఠశాలలు | 107 |
ఉన్నత పాఠశాలలు | 113 |
హయ్యర్ సెకండరీ పాఠశాలలు | 72 |
వృత్తివిద్యా శిక్షణా సంస్థలు | 5 |
సంగీత పాఠశాలలు | 1 |
ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలు | 2 |
పాలిటెక్నిక్ | 4 |
ఇంజనీరింగ్ కాలేజ్ | 5 |
ఆర్ట్స్& సైన్సు కాలేజ్ | 8 |
ఆర్ధికరంగం
[మార్చు]- క్రిష్ణగిరి జిల్లా మామిడికాయలకు ప్రసిద్ధిచెందింది. అలాగే క్రిష్ణగిరి జిల్లా గ్రానైట్ పరిశ్రమకు కూడా ప్రసిద్ధిచెందినది. జిల్లా అంతటా క్వారీలు, ప్రొసెసింగ్ యూనిట్లు విస్తరించి ఉన్నాయి. హోసూరు జిల్లాలో అత్యధికంగా పారిశ్రమికంగా అభివృద్ధిచేయబడింది.
- తమిళనాడు రాగి పంటలో 40% క్రిష్ణగిరి జిల్లాలో ఉత్పత్తి చేయబడడం ప్రత్యేకత.[11]
వ్యవసాయం
[మార్చు]క్రిష్ణగిరి జిల్లాలో ప్రధాన పంట వ్యవసాయం వరి, మొక్కజొన్నలు, బనానా, చెరకు, కాటన్, చింతపండు, కొబ్బరి, మామిడి, వేరుశనగ, కూరగాయలు, పూలతోటలు. వ్యవసాయ వాణిజ్యానికి క్రిష్ణగిరి అనుకూలమైనది. " రిఒజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ " 18.5 హెక్టార్ల వైశాల్యంలో 1973 నుండి కావేరిపట్నం యూనియన్‌లో శక్తివంతంగా నిర్వహించబడుతుంది. ఆధునిక వ్యవసాయంలో రైతులకు సహకరించడానికి ఈ సంస్థ కృషిచేస్తుంది. ఈ సంస్థ పరిశోధనల ద్వారా హైబ్రీడు విత్తనాలను ఉత్పత్తిచేస్తుంది. ఈ విత్తనాలు నాణ్యమైన పంటను అత్యధికమైన పంటను అందిస్తుంది.
ఉత్పత్తి | వైశాల్యం (ఎకరాలు) |
---|---|
వడ్లు | 20,687 |
రాగి | 48,944 |
ఇతర చిరు ధాన్యాలు | 11,937 |
పప్పులు | 48,749 |
చెరకు | 50,000 |
మామిడిపండ్లు | 30,017 |
కొబ్బరి | 13,192 |
చింతపండు | 1,362 |
ఇతరపంటలు | 43,199 |
పశుపోషణ , చేపల పెంపకం
[మార్చు] చేపల పెంపకం
2007 జూలై 15 గణాంకాలను అనుసరించి చేపల పెంపకం వివరణ.
రిజర్వాయర్ పేరు | టార్గెట్ (ఎం.టి) | సాధన | ఆదాయం | లాభపడిన
మత్స్యకారులు |
---|---|---|---|---|
క్రిష్ణగిరి ఆనకట్ట | 51.0 | 6.810 | 4844 | 23/4844 |
పాంబరు ఆనకట్ట | 30 | 2.018 | 13570 | 16/13570 |
కేలవర్‌పళ్ళి ఆనకట్ట | 29.0 | 15.110 | 95387 | 30/95387 |
బారూరు సరసు | 284.0 | 17.600 | 124600 | 37/124600 |
చిన్నారు ఆనకట్ట | 6.8 | 0.931 | 10410 | 5/10410 |
మైలు రావణన్ సరసు | 3.0 | 0.164 | 820 | 1/820 |
రామనాయకన్ సరసు | 4.0 | 0.273 | 2305 | 1/2305 |
పశుపోషణ
[మార్చు]2006-2007 గణాంకాలను అనుసరించి క్రిష్ణగిరి జిల్లా పశుపోషణ ఆదాయవివరణ.
వర్గీకరణ | అందుకున్న
ఆదాయం |
---|---|
పాలు | 24,94,926 |
గుడ్లు | 3,88,192 |
పోర్క్ | 1,54,496 |
పశువుల అమ్మకం | 4,21,578 |
మిగిలినవి | 13,55,244 |
కృత్రిమ గర్భధారణ | 5,79,898 |
ఎల్.ఎన్ 2 (నత్రజని ద్రావణం) | 1,27,819 |
మొత్తం ఆదాయం | 55,22,153 |
ప్రయాణసౌకర్యాలు
[మార్చు]కింది ప్రధాన రహదారులు కృష్ణగిరి గుండా వెళుతున్నాయి
రహదారులు
[మార్చు]ఆరంభం/ముగింపు | జాతీయ
రహదారి సంఖ్య. |
కిలోమీటర్లు |
---|---|---|
కన్యాకుమారి- వారణాసి | 7 | 2460 |
క్రిష్ణగిరి-రాణిపేట | 46 | 144 |
పాండిచ్చేరి-క్రిష్ణగిరి | 66 | 214 |
క్రిష్ణగిరి-మదనపల్లి | 219 | 175 |
సర్జాపూర్–బగలూర్–హోసూర్ | 207 | 40 |
రైలుమార్గాలు
[మార్చు]సేలం, బెంగుళూరు బ్రాడ్‌గేజి మార్గం హోసూరు గుండా నిర్మించబడింది. హోసూరు, జోలార్‌పేట రైలు మార్గం క్రిష్ణగిరి మార్గం మీదుగా నిర్మితమై ఉంది. హోసూరు లోని పారిశ్రామిక అభివృద్ధికి సహకరించేలా ఈ మార్గం మరింతగా అభివృద్ధిపనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గం క్రిష్ణగిరిని చెన్నై, దాని నౌకాశ్రయాలతో చక్కగా అనుసంధానిస్తుంది.సరికొత్త ఆర్థికప్రణాళికా నివేదికలు ఈ రైలు మార్గ నిర్మాణం జోలార్‌పేట, తిరుపత్తూరు మద్య ఈ మార్గ నిర్మాణపు పనులు మొదలైయ్యాయని తెలుస్తుంది. ఒది కందిలి, క్రిష్ణగిరి చోళగిరిరి లను అనుసంధానిస్తూ నిర్మించబడుతూ ఉంది. 104 కిలోమీటర్ల పొడవున నిర్మించబడిన ఈ మార్గం రాయకోట్టై మార్గంలో కలుపబడుతుంది.
చిత్రమాలిక
[మార్చు]-
అలెగ్జాండర్ అల్లన్ "కిస్ట్నాగెర్రీ" కోట పెయింటింగ్
-
"హోసూర్ పాత ఫోటో"
-
అలెగ్జాండర్ అలన్ చిత్రించిన ”అంచెట్టిదుర్గం” పెయింటింగ్
-
థామస్ డానియెల్ చిత్రించిన ”రాయకోట్టై కోట” పెయింటింగ్
మూలాలు
[మార్చు]- ↑ www.tn.gov.in
- ↑ "e-Governance in Pilot Basis". TNeGA. Archived from the original on 2011-08-08. Retrieved 2023-01-21.
- ↑ "CM to inaugurate e-Governance scheme in Krishnagiri". The Hindu. 23 September 2010. Archived from the original on 27 September 2010.
- ↑ "Arab political world's uncertainty shakes Mango export of India". BBC. 13 November 2011. Retrieved 14 November 2011.
- ↑ "Krishnagiri Etymology". District Admin., Krishnagiri. Archived from the original on 2014-12-16. Retrieved 2014-03-26.
- ↑ "Krishnagiri District Map". krishnagiri.nic.in. 2021-01-21. Retrieved 2021-01-28.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Census Info 2011 Final population totals - Krishnagiri district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original on 24 September 2015. Retrieved 26 January 2014.
- ↑ 10.0 10.1 "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ http://www.tn.gov.in/deptst/agriculture.pdf