Jump to content

కె.ఎస్. చంద్రశేఖర్

వికీపీడియా నుండి
కె.ఎస్. చంద్రశేఖర్
జననం
మరణం12 మే 2021
జాతీయత భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం
పిల్లలుముగ్గురు కుమార్తెలు

కె.ఎస్. చంద్రశేఖర్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.[1] నేపథ్య గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన చంద్రశేఖర్‌, దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు.

జీవిత విషయాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, రాయలం గ్రామంలో చంద్రశేఖర్ జన్మించాడు.[2]

సినీ జీవితం

[మార్చు]

కె.ఎస్. చంద్రశేఖర్ 1974లో బంట్రోతు భార్య చిత్రంతో నేపథ్యగాయకునిగా సినీరంగ ప్రవేశం చేశాడు. సంగీత దర్శకుడు కె. చక్రవర్తి దగ్గర 70 కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా, రమేష్ నాయుడు దగ్గర 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ దగ్గర సహాయకునిగా పనిచేశాడు. చంద్రశేఖర్ 1982లో గీతా ఆర్ట్స్ నిర్మించిన యమకింకరుడు సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఆయన సంగీత దర్శకుడిగా రజని తొలిచిత్రం బ్రహ్మముడి, భానుచందర్ నటించిన హంతకుడి వేట, రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆణిముత్యం, కోడి రామకృష్ణ తీసిన ఉదయం, అదిగో అల్లదిగో, దాసరి నారాయణరావు తీసిన భోళా శంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ, హిందీ) వంటి 30 పైగా చిత్రకాలు పని చేశాడు. సంగీత దర్శకులైన కీరవాణి, కోటి, మణిశర్మ ఇతని దగ్గర కొంతకాలం శిష్యరికం చేశారు. చంద్రశేఖర్ సినీరంగంతో సంబంధాలు కొనసాగిస్తూనే విశాఖపట్నం అల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందాడు.[3]

మరణం

[మార్చు]

ఆయన కోవిడ్‌తో చికిత్స పొందుతూ 2021, మే 13న మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (12 May 2021). "రేడియో, సినీ సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్రశేఖర్ కరోనాతో మృతి". NTV Telugu. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  2. Andhrajyothy (12 May 2021). "ముగ్గురు సినీ ప్రముఖులు మరణం!". Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  3. Andhrajyothy (13 May 2021). "కొవిడ్‌తో సంగీత దర్శకుడు చంద్రశేఖర్‌ మరణం". Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  4. 10TV (12 May 2021). "K.S. Chandra Sekhar : కరోనాతో కె.ఎస్. చంద్రశేఖర్ కన్నుమూత | Chandra Sekhar" (in telugu). Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)