కుల్‌దీప్ కుమార్
కుల్‌దీప్ కుమార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 ఫిబ్రవరి 11 | |||
ముందు | మనోజ్ కుమార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొండ్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | ఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కుల్‌దీప్ కుమార్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు కొండ్లి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కుల్‌దీప్ కుమార్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2017లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికై తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నాయకుడిగా, ఆప్ ఢిల్లీ యూనిట్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కొండ్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ పై 17,907 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా చేతిలో 93,663 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
కుల్‌దీప్ కుమార్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కొండ్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్ పై 6293 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Lok Sabha 2024 Election results: East Delhi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Kondli". 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.