Jump to content

హర్ష్ మల్హోత్రా

వికీపీడియా నుండి

హర్ష్ మల్హోత్రా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

హర్ష్ మల్హోత్రా ఏప్రిల్ 24, 1964న ఢిల్లీలో రాజ్, విజయ్ కిషన్ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని హన్సరాజ్ కళాశాల నుండి బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి 1987లో అదే విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

హర్ష్ మల్హోత్రా 1986లో ప్రింటింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, 6,000 మంది సభ్యులతో ఢిల్లీలోని ప్రింటర్ల అతిపెద్ద సంఘమైన ఢిల్లీ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రింటింగ్ కమ్యూనిటీ సంక్షేమం కోసం కృషి చేశాడు. ఆయన భారతదేశంలోని ప్రింటర్ల అపెక్స్ బాడీ అయిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ (AIFMP)కి జాయింట్ సెక్రటరీగా పని చేశాడు. 1996లో ఢిల్లీలో పరిశ్రమల తరలింపు సమయంలో, బవానా పారిశ్రామిక ప్రాంతానికి ప్రింటర్లను సజావుగా తరలించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హర్ష్ మల్హోత్రా 1984లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) యువజన విభాగంలో చేరి యువమోర్చా మండల అధ్యక్షుడిగా, జిల్లా యువమోర్చా కార్యదర్శిగా ఆ తరువాత 2005లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2007లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి 2012లో తూర్పు ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై 2015లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశాడు.

హర్ష్ మల్హోత్రా 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై 93663 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (9 June 2024). "First-time MP Harsh Malhotra joins Modi government as Minister of State" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. The Week (10 June 2024). "First-time MP Harsh Malhotra sworn in as MoS in Modi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. NDTV (9 June 2024). "BJP's 1st-Time MP Harsh Malhotra Joins Modi 3.0 Cabinet". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. The Indian Express (10 June 2024). "First-time MP Harsh Malhotra sworn in as MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.