అక్షాంశ రేఖాంశాలు: 19°08′40″N 78°05′19″E / 19.14452°N 78.088646°E / 19.14452; 78.088646

కుంటాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంటాల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుంటాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుంటాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుంటాల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°08′40″N 78°05′19″E / 19.14452°N 78.088646°E / 19.14452; 78.088646
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం కుంటాల
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,190
 - పురుషులు 16,674
 - స్త్రీలు 17,516
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.37%
 - పురుషులు 60.80%
 - స్త్రీలు 28.94%
పిన్‌కోడ్ 504109

కుంటాల మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] కుంటాల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

అదిలాబాదు నుండి నిర్మల్ జిల్లాకు మార్పు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

ఇంతకుముందు కుంటాల మండలం,అదిలాబాదు జిల్లా,నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు,మండలాల ఏర్పాటులో భాగంగా కుంటాల మండలాన్ని (1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, భైంసా రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,190 - పురుషులు 16,674 - స్త్రీలు 17,516. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 140 చ.కి.మీ. కాగా, జనాభా 23,388. జనాభాలో పురుషులు 11,454 కాగా, స్త్రీల సంఖ్య 11,934. మండలంలో 5,569 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. లింబ (బుజుర్గ్)
  2. మేదన్‌పూర్
  3. అంబాగావ్
  4. సూర్యాపూర్
  5. రాజాపూర్
  6. దౌనెల్లి
  7. రాయిపహాడ్
  8. అంబకంటి
  9. కుంటాల
  10. ఓల
  11. లింబ (ఖుర్ద్)
  12. విట్టాపూర్
  13. వెంకూర్
  14. పెంచికల్‌పహాడ్
  15. అంద్కూర్
  16. కల్లూర్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.