కిషోర్ కుమార్ పార్థాసాని
స్వరూపం
కిషోర్ కుమార్ పార్థాసాని | |
---|---|
జననం | |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు |
కిషోర్ కుమార్ పార్థాసాని (డాలీ) తెలుగు సినిమా దర్శకుడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, తడాఖా, గోపాల గోపాల, కాటమరాయుడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]కిషోర్, విజయవాడలో జన్మించాడు. విజయనగరంలో పెరిగాడు. విజయనగరంలోని మహారాజా కాలేజీలో న్యాయవాద విద్యను చదివిన కిషోర్, హైదరాబాదుకు వెళ్ళి సినిమా పరిశ్రమలో చేరి శ్రీను వైట్ల, వి. వి. వినాయక్ లకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[1]
2009లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమా మంచి సమీక్షలను అందుకుంది.[2]
సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | నటవర్గం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | 2009 | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | సిద్ధార్థ్, తమన్నా | దర్శకుడిగా తొలి సినిమా |
2 | 2013 | తడాఖా | నాగ చైతన్య, తమన్నా, సునీల్ | వెట్టై సినిమా రీమేక్ |
3 | 2015 | గోపాల గోపాల | పవన్ కళ్యాణ్, దగ్గుబాటి వెంకటేష్ | ఓహ్ మై గాడ్! సినిమా రీమేక్ |
4 | 2017 | కాటమరాయుడు | పవన్ కళ్యాణ్, శృతి హసన్ | వీరం రీమేక్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Kishore Kumar interview - Telugu Cinema interview - Telugu film director". idlebrain.com. Retrieved 2017-03-26.
- ↑ "Konchem Istam Konchem Kastam review - Telugu cinema Review - Siddhardh & Tamanna". idlebrain.com. Retrieved 2017-03-26.