కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)
Jump to navigation
Jump to search
కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం | |
---|---|
తెలంగాణ రెండవ మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 13 డిసెంబరు, 2018 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ |
ప్రభుత్వ నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
మంత్రుల సంఖ్య | 17 |
పార్టీలు | టిఆర్ఎస్ |
సభ స్థితి | మెజారిటీ |
ప్రతిపక్ష పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ప్రతిపక్ష నేత | మల్లు భట్టివిక్రమార్క |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2018 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
తదుపరి నేత | రేవంత్ రెడ్డి మంత్రివర్గం |
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా 2018, డిసెంబరు 13న ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2019, ఫిబ్రవరి 19న 12మంది మంత్రులతో తన రెండవ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.[1]
హైదరాబాదులోని రాజ్‌భవన్ గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్, 12మంది మంత్రులు పదవీ స్వీకారం చేశారు.[2][3]
మంత్రుల జాబితా
[మార్చు]తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత 2018, డిసెంబరు 13న కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2019, ఫిబ్రవరి 19న కొత్తగా మరో 10మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.[4][5][6] మంత్రివర్గ విస్తరణ భాగంగా 2019, సెప్టెంబరు 8న మరో ఆరుగురికి మంత్రి పదవులు వచ్చాయి.[7][8]
క్రమసంఖ్య | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|---|
1. |
కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి |
గజ్వెల్, మెదక్ | మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు | టిఆర్ఎస్ | |
2. |
మహ్మద్ మహమూద్ అలీ |
ఎమ్మెల్సీ | హోం మంత్రి[9] | టిఆర్ఎస్ | |
3. |
టి. హరీశ్ రావు |
సిద్ధిపేట | ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖ (2021, నవంబరు 9 నుండి) |
టిఆర్ఎస్ | |
4. |
కల్వకుంట్ల తారక రామారావు |
సిరిసిల్ల | ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ | టిఆర్ఎస్ | |
5. |
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి |
నిర్మల్ | దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ, అటవీశాఖ | టిఆర్ఎస్ | |
6. | తలసాని శ్రీనివాస్ యాదవ్ | సనత్ నగర్ | పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ | టిఆర్ఎస్ | |
7. |
గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి |
సూర్యాపేట | విద్యుత్‌శాఖ | టిఆర్ఎస్ | |
8. |
వి. శ్రీనివాస్ గౌడ్ |
మహబూబ్‌నగర్ | ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ | టిఆర్ఎస్ | |
9. |
సి.హెచ్. మల్లారెడ్డి |
మేడ్చల్ | కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖ | టిఆర్ఎస్ | |
10. |
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి |
వనపర్తి | వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖ | టిఆర్ఎస్ | |
11. | ఎర్రబెల్లి దయాకర్ రావు | పాలకుర్తి | పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ | టిఆర్ఎస్ | |
12. | వేముల ప్రశాంత్ రెడ్డి | బాల్కొండ | రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖ | టిఆర్ఎస్ | |
13. | కొప్పుల ఈశ్వర్ | ధర్మపురి | ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ | టిఆర్ఎస్ | |
14. |
సబితా ఇంద్రారెడ్డి |
మహేశ్వరం | విద్యాశాఖ | టిఆర్ఎస్ | |
15. | గంగుల కమలాకర్ | కరీంనగర్ | బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ | టిఆర్ఎస్ | |
16. |
సత్యవతి రాథోడ్ |
డోర్నకల్ | గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ | టిఆర్ఎస్ | |
17. |
పువ్వాడ అజయ్ కుమార్ |
ఖమ్మం | రవాణ శాఖ | టిఆర్ఎస్ |
మాజీ మంత్రులు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | ఈటెల రాజేందర్ | హుజురాబాద్ | వైద్య ఆరోగ్య శాఖ | టిఆర్ఎస్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (13 December 2018). "తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ "KCR Takes Oath as Telangana CM at Exactly 1:25 pm as Per Astrologers' Advice". News18.
- ↑ "Election Results 2018 Highlights: CM race continues in Chhattisgarh, decision to be taken tomorrow". 15 December 2018.[permanent dead link]
- ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 17 September 2019.
- ↑ సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 17 September 2019.
- ↑ ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (13 December 2018). "అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ". Archived from the original on 24 జూలై 2019. Retrieved 24 July 2019.