కల్లు
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |

కల్లు ఒక ఆల్కహాలు కలిగిన పానీయము. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు భంగు, సారాయి. దీనిని వారుణి అని కూడా పిలుస్తారు.
ఈత కల్లు
[మార్చు]
ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు. వారం రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది.
తాటి కల్లు
[మార్చు]


తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి కల్లు కొబ్బరి చెట్లకున్న మువ్వలకు కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండను కడతారు: ఈత, తాటి మొదలైన చెట్లకు ఒక కుండనే కడ్తారు. కాని కొబ్బరి చెట్లకు ఎన్ని మువ్వలు వుంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత: ఇది చాల రుచిగాను నిషా తక్కువగను వుంటుంది. తాజా కొబ్బరి కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజా కొబ్బరి కల్లును నీరా అంటారు. అత్తి కల్లు అత్తి చెట్ల నుండి దీనిని సేకరిస్తారు: విప్ప చెట్టు సమీపంలో ఒక గొయ్యి త్రవ్వి అక్కడ కనిపించిన విప్ప చెట్టు వేరును కొంత మేర కోసి దానికింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు. ఆ వేరులో నుండి కారిన రసాన్ని సేకరిస్తారు. ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు: ఇది ఆరోగ్యానికి చాల మంచిది.
పౌడర్ కల్లు
[మార్చు]ఇది సర్వసాధారణంగా ఈత, తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాలలో తయారు చేస్తారు. ఒకరకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. ఇటువంటి కల్లు పట్టణాల మధ్య ప్రధాన రహదారులలో బాటిళ్ళలో నింపి, బల్లలపై ఉంచి అమ్మడం చూడవచ్చు. File:కల్లు గీత కార్మికుడు/Toddy drawer at Mangal palle village.jpg
జలిగ కల్లు ఇది అడవి ప్రాంతంలో దొరుకుతుంది
వివిధ దేశాలలో కల్లు
[మార్చు]ఫిలిప్పీన్స్ లో దీనిని 'టూబా' అని వ్యవహరిస్తారు.
పేర్లు
[మార్చు]దేశం / ప్రాంతం | వాడుక పేరు |
---|---|
![]() |
మింబో [1] |
![]() |
malafu, panam culloo [2] |
![]() |
toutou |
![]() |
doka, nsafufuo, palm wine, yabra, akpeteshi |
![]() |
కల్లు (கள்ளு) (കള്ള്) a, Tamil tadib, toddy |
![]() |
కల్లు (கள்ளு), నీర, tuak, toddy |
![]() |
htan yay |
![]() |
emu, ogogoro, palm wine, tombo liquor, Nnmaya ngwo |
![]() |
segero, tuak |
![]() |
టూబా, lambanog |
![]() |
ubusulu |
![]() |
poyo |
![]() |
కల్లు (கள்ளு), రా (රා) |
మూలాలు
[మార్చు]- ↑ http://iteslj.org/Articles/Anchimbe-CameroonEnglish.html[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-13. Retrieved 2008-01-05.