Jump to content

కర్ట్‌లీ ఆంబ్రోస్

వికీపీడియా నుండి
కర్ట్‌లీ ఆంబ్రోస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Curtly Elconn Lynwall Ambrose
పుట్టిన తేదీ (1963-09-21) 1963 సెప్టెంబరు 21 (వయసు 61)
స్వెటెస్, ఆంటిగ్వా అండ్ బార్బురా
ఎత్తు6 అ. 7 అం. (2.01 మీ.)
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుకుడి చేయి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 192)1988 ఏప్రిల్ 2 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2000 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 53)1988 మార్చి 12 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2000 ఏప్రిల్ 23 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985–2000లీవార్డ్ ఐలాండ్స్
1998–1999ఆంటిగ్వా అండ్ బార్బురా
1989–1996నార్తాంప్టన్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్డేలు FC List A
మ్యాచ్‌లు 98 176 239 329
చేసిన పరుగులు 1439 639 3448 1282
బ్యాటింగు సగటు 12.40 10.65 13.95 11.98
100లు/50లు 0/1 0/0 0/4 0/0
అత్యుత్తమ స్కోరు 53 31* 78 48
వేసిన బంతులు 22103 9353 48798 17143
వికెట్లు 405 225 941 401
బౌలింగు సగటు 20.99 24.12 20.24 23.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 22 4 50 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3 n/a 8 n/a
అత్యుత్తమ బౌలింగు 8/45 5/17 8/45 5/17
క్యాచ్‌లు/స్టంపింగులు 18/0 45/0 88/0 82/0
మూలం: క్రిక్‌ఇన్ఫో, 2012 అక్టోబరు 24

1963, సెప్టెంబర్ 21న జన్మించిన కర్ట్‌లీ ఆంబ్రోస్ (Curtly Elconn Lynwall Ambrose) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడికి లిటిల్ బర్డ్ అనే ముద్దుపేరు ఉంది. కోర్ట్‌నీ వాల్ష్కు జతగా ఫాస్ట్ బౌలర్‌గా వెస్టీండీస్ జట్టులో కొనసాగినాడు. ఆంబ్రోస్ తన తొలి టెస్టును 1988లో పాకిస్తాన్ పై ఆడి 12 సంవత్సరాలు జట్టుకు సేవలందించి 2000, ఏప్రిల్లో ఇంగ్లాండు సీరీర్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.

ఆంబ్రోస్ టెస్ట్ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 405 వికెట్లు సాధించాడు. 400 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్లలో ఇతడు ఐదోవాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 45 పరుగులకు 8 వికెట్లు. ఇది 1990లో బార్బడస్లో ఇంగ్లాండుపై సాధించాడు. వన్డేలలో 176 మ్యాచ్‌లు ఆడి 225 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 17 పరుగులకు 5 వికెట్లు.