Jump to content

కరిబియన్

వికీపీడియా నుండి

కరిబియన్ అనేది కరిబియన్ సముద్రం, దాని ద్వీపాలు (కొన్ని కరిబియన్ సముద్రం చుట్టూ ఉన్నాయి, మరి కొన్ని కరిబియన్ సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం రెండింటికి సరిహద్దులుగా ఉన్నాయి), చుట్టుపక్కల తీరాలను కలిగి ఉన్న అమెరికాలోని ప్రాంతం. ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఉత్తర అమెరికా ప్రధాన భూభాగానికి ఆగ్నేయంగా ఉంది. మధ్య అమెరికాకు తూర్పున, దక్షిణ అమెరికా ద్వీపాలు, దిబ్బలు, కేస్‌లకు ఉత్తరాన ఉంది.[1] ఈ ప్రాంతంలో 700 కు పైగా దీవులు, లంకలు, ప్రవాళాలూ ఉన్నాయి. గ్రేటర్ ఆంటిల్లీస్, ఉత్తరాన లూకాయన్ ద్వీపసమూహం, దక్షిణం తూర్పుల్లో ఉన్న లెస్సర్ యాంటిల్లెస్ (దీనిలో లీవార్డ్ ఆంటిల్లీస్ కూడా ఉన్నాయి) వంటి ద్వీపాల వక్రతలు కరిబియన్ సముద్రపు తూర్పు ఉత్తర అంచులను నిర్వచిస్తాయి. సమీపంలోని లూకాయన్ ద్వీపసమూహంతో (బహామాస్, టర్క్స్ అండ్ కైకోస్ దీవులు) కలిసి అవి వెస్ట్ ఇండీస్‌ను ఏర్పరుస్తాయి. ఇవి కరిబియన్ సముద్రం సరిహద్దులో లేనప్పటికీ కరిబియన్‌లో భాగంగానే పరిగణించబడతాయి. ప్రధాన భూభాగంలో ఉన్న బెలిజ్, నికరాగ్వా, కొలంబియాలోని కరిబియన్ ప్రాంతం, కోజుమెల్, యుకాటాన్ ద్వీపకల్పం, మార్గరీటా ద్వీపం, గయానాస్ (గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా, వెనిజులాలోని గయానా ప్రాంతం, బ్రెజిల్ లోని అమాపా) లకు ఉన్న రాజకీయ, సాంస్కృతిక సంబంధాల కారణంగా వీటిని కూడా కరిబియన్‌లో భాగం గానే పరిగణిస్తారు.

భౌగోళికంగా, కరిబియన్ లోని ద్వీపాలను (వెస్ట్ ఇండీస్) ఉత్తర అమెరికాలో భాగంగా పరిగణిస్తారు. కొన్నిసార్ల మధ్య అమెరికాలో భాగంగా లేదా వారి స్వంత ప్రాంతంగా కూడా పరిగణిస్తారు.[2][3] అవన్నీ 30 సార్వభౌమ రాష్ట్రాలు, విదేశీ విభాగాలు, డిపెండెన్సీలుగా ఉన్నాయి. 1954 డిసెంబరు 15 నుండి 2010 అక్టోబరు 10 వరకు, ఐదు రాష్ట్రాలతో కూడిన నెదర్లాండ్స్ యాంటిలిస్ అని పిలువబడే ఒక దేశం ఉండేది. ఇవన్నీ డచ్ డిపెండెన్సీలు.[4] 1958 జనవరి 3 నుండి 1962 మే 31 వరకు, వెస్టిండీస్ ఫెడరేషన్ అని పిలువబడే స్వల్పకాలిక రాజకీయ యూనియన్ కూడా ఉండేది. ఇది ఇంగ్లీష్ మాట్లాడే 10 కరిబియన్ భూభాగాలతో కూడుకుని ఉండేది. అవన్నీ అప్పటి బ్రిటిష్ డిపెండెన్సీలు.

లెస్సర్ యాంటిల్లెస్

కరిబియన్ దేశాలు, భూభాగాలు

[మార్చు]
కరిబియన్‌లోను, సమీపంలోనూ ఉన్న దీవులు
కరిబియన్ (ద్వీపం) దేశాల మధ్య సముద్ర సరిహద్దులు
పతాకం దేశం/ప్రాంతం[5][6][7] సార్వభౌమత్వం స్థితి Area
(km2)[8]
Population (2016 est.)[9] జనసాంద్రత (/km2) రాజధాని
Anguilla యాంగిల్లా యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ &&&&&&&&&&&&&091.&&&&&091 14,764 164.8 ది వ్యాలీ
ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగ్వా అండ్ బార్బుడా స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&&&0442.&&&&&0442 1,00,963 199.1 St. జాన్ యొక్క
అరూబా అరూబా నెదర్లాండ్స్ రాజ్యం Constituent kingdom &&&&&&&&&&&&0180.&&&&&0180 1,04,822 594.4 ఒరంజెస్టాడ్
బహామాస్ బహామాస్ స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&013943.&&&&&013,943 3,91,232 24.5 నసౌ
బార్బడోస్ బార్బడోస్ స్వతంత్ర దేశం రిపబ్లిక్ &&&&&&&&&&&&0430.&&&&&0430 2,87,025 595.3 బ్రిడ్జ్‌టౌన్
Bonaire బోనైర్ నెదర్లాండ్స్ రాజ్యం Special Municipality &&&&&&&&&&&&0294.&&&&&0294 20,104 41.1 క్రాలెండిజ్క్
British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ &&&&&&&&&&&&0151.&&&&&0151 30,661 152.3 రోడ్ టౌన్
కేమన్ ఐలాండ్స్ కేమాన్ దీవులు యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ &&&&&&&&&&&&0264.&&&&&0264 60,765 212.1 జార్జ్ టౌన్
Cuba క్యూబా స్వతంత్ర దేశం రిపబ్లిక్ &&&&&&&&&0109886.&&&&&01,09,886 1,14,75,982 102.0 హవానా
Curaçao కురాకో నెదర్లాండ్స్ రాజ్యం Constituent kingdom &&&&&&&&&&&&0444.&&&&&0444 1,59,371 317.1 విల్లెంస్టాడ్
డొమినికా డొమినికా స్వతంత్ర దేశం రిపబ్లిక్ &&&&&&&&&&&&0751.&&&&&0751 73,543 89.2 రోసో
డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ స్వతంత్ర దేశం రిపబ్లిక్ &&&&&&&&&&048671.&&&&&048,671 1,06,48,791 207.3 శాంటో డొమింగో
Federal Dependencies of Venezuela వెనిజులా యొక్క ఫెడరల్ డిపెండెన్సీస్ Venezuela Territories &&&&&&&&&&&&0342.&&&&&0342 2,155 6.3 గ్రాన్ రోక్
గ్రెనడా గ్రెనడా స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&&&0344.&&&&&0344 1,07,317 302.3 St. జార్జ్ యొక్క
Guadeloupe గ్వాడెలోప్ ఫ్రాన్స్ Overseas department and region of ఫ్రాన్స్ &&&&&&&&&&&01628.&&&&&01,628 4,49,975 246.7 బేస్-టెర్రే
హైతి హైతీ స్వతంత్ర దేశం రిపబ్లిక్ &&&&&&&&&&027750.&&&&&027,750 1,08,47,334 361.5 పోర్ట్-ఓ-ప్రిన్స్
జమైకా జమైకా స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&010991.&&&&&010,991 28,81,355 247.4 కింగ్స్టన్
Martinique మార్టినిక్ ఫ్రాన్స్ Overseas department &&&&&&&&&&&01128.&&&&&01,128 3,85,103 352.6 ఫోర్ట్-డి-ఫ్రాన్స్
Montserrat మోంట్‌సెర్రట్ యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ &&&&&&&&&&&&0102.&&&&&0102 5,152 58.8 ప్లైమౌత్ (బ్రేడ్స్)
నవాస్సా ద్వీపం అమెరికా సంయుక్త రాష్ట్రాలు/Haiti నిర్జన ప్రాంతం &&&&&&&&&&&&&&05.&&&&&05 0 0.0 n/a
Nueva Esparta న్యూవా ఎస్పార్టా Venezuela State &&&&&&&&&&&01151.&&&&&01,151 4,91,610 లా అసున్సియోన్
Puerto Rico ప్యూర్టో రికో అమెరికా సంయుక్త రాష్ట్రాలు Commonwealth &&&&&&&&&&&08870.&&&&&08,870 36,67,903 448.9 శాన్ జువాన్
Saba (island) సబా నెదర్లాండ్స్ రాజ్యం Special municipality &&&&&&&&&&&&&013.&&&&&013 1,537 118.2 కింద
Archipelago of San Andrés, Providencia and Santa Catalina శాన్ ఆండ్రెస్ అండ్ ప్రొవిడెన్సియా Colombia Department &&&&&&&&&&&&&052.50000052.5 75,167 1431 శాన్ ఆండ్రెస్
Saint Barthélemy సెయింట్ బార్తెలెమీ ఫ్రాన్స్ ఓవర్సీస్ కలెక్టివిటీ &&&&&&&&&&&&&021.&&&&&021 7,448 354.7 గుస్తావియా
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&&&0261.&&&&&0261 54,821 199.2 బస్సెటెర్రే
సెయింట్ లూసియా సెయింట్ లూసియా స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&&&0539.&&&&&0539 1,78,015 319.1 కాస్ట్రీస్
Collectivity of Saint Martin సెయింట్ మార్టిన్ ఫ్రాన్స్ ఓవర్సీస్ కలెక్టివిటీ &&&&&&&&&&&&&054.&&&&&054 29,820 552.2 మేరిగోట్
సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ స్వతంత్ర దేశం రాజ్యాంగ రాచరికం &&&&&&&&&&&&0389.&&&&&0389 1,09,643 280.2 కింగ్స్టౌన్
సింట్ యూస్టేషియస్ సింట్ యుస్టాటియస్ నెదర్లాండ్స్ రాజ్యం Special municipality &&&&&&&&&&&&&021.&&&&&021 2,739 130.4 ఒరంజెస్టాడ్
Sint Maarten సింట్ మార్టెన్ నెదర్లాండ్స్ రాజ్యం Constituent kingdom &&&&&&&&&&&&&034.&&&&&034 39,537 1176.7 ఫిలిప్స్‌బర్గ్
ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్, టొబాగో స్వతంత్ర దేశం రిపబ్లిక్ &&&&&&&&&&&05130.&&&&&05,130 13,64,962 261.0 పోర్ట్ ఆఫ్ స్పెయిన్
Turks and Caicos Islands టర్క్స్ అండ్ కైకోస్ దీవులు యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ &&&&&&&&&&&&0948.&&&&&0948 34,900 34.8 కాక్‌బర్న్ టౌన్
United States Virgin Islands యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలు Territory &&&&&&&&&&&&0347.&&&&&0347 1,04,913 317.0 షార్లెట్ అమాలీ
Total &&&&&&&&&0235667.&&&&&02,35,667 4,46,36,789 189.4

భౌగోళికం

[మార్చు]

ద్వీప సమూహాలు

[మార్చు]

లూకాయన్ ద్వీపసమూహం [a]

చారిత్రికంగా ఉన్న వివిధ సమూహాలు

[మార్చు]
అమెరికన్ వైస్రాయల్టీస్ 1600లో స్పానిష్ కరిబియన్ దీవులు
1700 నుండి ఇప్పటి వరకు మధ్య అమెరికా, కరిబియన్ రాజకీయ పరిణామం
18వ శతాబ్దంలో ఎక్కువగా స్పానిష్-నియంత్రిత కరిబియన్
16వ శతాబ్దంలో ఎక్కువగా స్పానిష్-నియంత్రిత కరిబియన్

కరిబియన్‌ లోని ద్వీపాలన్నీ ఏదో ఒక సమయంలో ఐరోపా దేశాలకు వలస రాజ్యాలుగా ఉండేవి. కొన్ని ఇప్పటికీ వలసలుగానే ఉన్నాయి. వీటిలో కొన్ని ఆయా దేశాలకు చెందినవిదేశీ భూభాగాలు లేదా ఆధారిత భూభాగాలు :

బ్రిటీష్ వెస్టిండీస్‌ను యునైటెడ్ కింగ్‌డమ్ 1958, 1962 మధ్య వెస్టిండీస్ ఫెడరేషన్‌గా ఏకం చేసింది. గతంలో BWIలో భాగమైన స్వతంత్ర దేశాలకు ఇప్పటికీ ఉమ్మడిగా టెస్ట్ మ్యాచ్‌లు, వన్ డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో పోటీపడే క్రికెట్ జట్టు ఉంది. వెస్టిండియన్ క్రికెట్ జట్టులో దక్షిణ అమెరికా దేశం గయానా కూడా భాగం. ఆ ఖండంలోని ప్రధాన భూభాగంలో ఉన్న ఏకైక మాజీ బ్రిటిష్ వలస ఇది.

అదనంగా, ఈ దేశాలు వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయాన్ని ప్రాంతీయ సంస్థగా పంచుకుంటున్నాయి. విశ్వవిద్యాలయానికి జమైకా, బార్బడోస్, ట్రినిడాడ్ అండ్‌ టొబాగోలో మూడు ప్రధాన క్యాంపస్‌ లున్నాయి. బహామాస్‌లో ఒక చిన్న క్యాంపస్, ట్రినిడాడ్ వంటి ఇతర సహకార ప్రాంతాలలో రెసిడెంట్ ట్యూటర్‌లు ఉన్నాయి.

కరిబియన్ తీరప్రాంతాలు, ద్వీపాలు కలిగిన ఖండస్థిత దేశాలు

[మార్చు]


జనాభా

[మార్చు]

స్థానిక సమూహాలు

[మార్చు]
  • అరవాక్ ప్రజలు
    • ఇగ్నేరి
    • టైనో
  • Caquetio ప్రజలు
  • సిబోనీ
  • సిగువాయో
  • గరీఫునా
  • కాలినా
  • కాలినాగో
  • లుకాయన్
  • మాకోరిక్స్
  • రైజల్

ఐరోపా వాళ్ళు వచ్చే సమయానికి కరిబియన్‌లో నివసిస్తున్న ఆధిపత్య జాతులలో గ్రేటర్ ఆంటిల్లెస్ లోని టైనో, ఉత్తర లెస్సర్ ఆంటిల్లెస్, దక్షిణ లెస్సర్ ఆంటిల్లెస్ లోని ద్వీప కారిబ్‌లు, పశ్చిమ క్యూబాలోని గ్వానాజాటాబే, తూర్పు హిస్పానియోలాకు చెందిన సిగువాయో వంటి చిన్న విభిన్న సమూహాలు ఉండేవి. కరిబియన్ జనాభా ఐరోపావాళ్ళు రాకముందు దాదాపు 7,50,000 ఉండేదని అంచనా వేసారు. దీనికంటే ఎక్కువ, తక్కువ ఉండే అంచనాలు కూడా ఉన్నాయి. యూరోపియన్లు వచ్చాక, సామాజిక అంతరాయం, మశూచి, తట్టు వంటి అంటువ్యాధులు వ్యాపించడం వలన (అక్కడి ప్రజల్లో ఆ రోగాలకు సహజ రోగనిరోధక శక్తి లేదు) అమెరిండియన్ జనాభా క్షీణించింది.[10][11] వీరిలో కాంగో, ఇగ్బో, అకాన్, ఫోన్, యోరుబా అలాగే ఇంగ్లండ్‌లోని క్రోమ్‌వెల్లియన్ పాలనలో బహిష్కరించబడి ఐర్లాండ్ నుండి వచ్చిన సైనిక ఖైదీలు ఉన్నారు. అలాగే బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోర్చుగల్, డెన్మార్క్ నుండి వలస వచ్చినవారు కూడా ఇందులో ఉన్నారు. ఈ రెండు వర్గాల ప్రజల్లోనూ మరణాల రేటు ఎక్కువగా ఉంది.[12]

1800 నాటికి జనాభా 22 లక్షలకు చేరుకుందని అంచనా [13] 19వ శతాబ్దం మధ్యలో భారతదేశం, చైనా, ఇండోనేషియా తదితర దేశాల నుండి ప్రజలు ఒప్పంద సేవకులుగా వలస వచ్చారు.[14] అట్లాంటిక్ బానిస వాణిజ్యం ముగిసిన తరువాత, సహజంగానే జనాభా పెరిగింది.[15] 2000 నాటికి మొత్తం ప్రాంతీయ జనాభా 3.75 కోట్లని అంచనా వేసారు [16]

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కార్నివాల్

హైతీ లోను, చాలా వరకు ఫ్రెంచ్, ఆంగ్లోఫోన్, డచ్ కరిబియన్‌లలోనూ జనాభా ప్రధానంగా ఆఫ్రికన్ మూలానికి చెందినవారు; అనేక ద్వీపాలలో మిశ్రమ జాతి మూలాలున్నవారు (ములాట్టో - క్రియోల్, డగ్లా, మెస్టిజో, క్వాడ్రూన్, చోలో, కాస్టిజో, క్రియోల్లో, జాంబో, పార్డో, ఆసియన్ లాటిన్ అమెరికన్లు, చిండియన్, కోకో పాన్యోల్స్‌తో సహా ) గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అలాగే డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ వంటి ఐరోపా మూలాలున్న వారు కూడా ఉన్నారు. ఆసియన్లు, ముఖ్యంగా చైనీస్, భారతీయ సంతతి, జావానీస్ ఇండోనేషియన్లు, కొన్ని ప్రాంతాలలో గణనీయమైన మైనారిటీని ఏర్పరుచుకున్నారు. ట్రినిడాడ్ అండ్‌ టొబాగో, గయానా, సురినామ్‌లలో భారతీయులు బహుళ జనాభాగా ఉన్నారు. వారి పూర్వీకులు చాలా మంది 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా వచ్చారు.

స్పానిష్-మాట్లాడే కరిబియన్ జనాభా ప్రధానంగా యూరోపియన్లు, ఆఫ్రికన్లు లేదా జాతిపరంగా మిశ్రమ మూలాలున్నవారు. ప్యూర్టో రికోలో యూరోపియన్-ఆఫ్రికన్-నేటివ్ అమెరికన్ (త్రి-జాతి మిశ్రమం) మిశ్రమంతో యూరోపియన్లు మెజారిటీగా ఉన్నారు. ములాట్టోలు (యూరోపియన్-వెస్ట్ ఆఫ్రికన్) పెద్ద మైనారిటీగా, పశ్చిమ ఆఫ్రికన్లు మైనారిటీగా ఉన్నారు. క్యూబాలో ఆఫ్రికన్ మూలాలున్నవారి గణనీయమైన జనాభాతో పాటు యూరోపియన్ మెజారిటీ కూడా ఉంది. డొమినికన్ రిపబ్లిక్‌లో అతిపెద్ద మిశ్రమ-జాతి జనాభా ఉంది. వీరు ప్రధానంగా యూరోపియన్లు, పశ్చిమ ఆఫ్రికన్లు, అమెరిండియన్ల సంతతి.

జమైకాలో పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్ మెజారిటీ ఉంది, దీనితో పాటుగా మిశ్రమ జాతి నేపథ్యం ఉన్న జనాభా కూడా గణనీయంగా ఉంది. చైనీస్, యూరోపియన్లు, భారతీయులు, లాటినోలు, యూదులు, అరబ్బులు మైనారిటీ జనాభాలో ప్రముఖులు. బానిసలు, ఒప్పంద కార్మికుల దిగుమతి, వలసల ఫలితంగా జనాభాలో ఈ వైవిధ్యం ఏర్పడింది. చాలా మంది బహుళ-జాతి జమైకన్లు తమను తాము మిశ్రమ జాతి లేదా బ్రౌన్ అని పిలుచుకుంటారు. బెలిజ్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని కారికోమ్ రాష్ట్రాలలో ఇలాంటి జనాభాను చూడవచ్చు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆఫ్రికన్లు, భారతీయులు, చైనీస్, అరబ్బులు, యూదులు, లాటినోలు, యూరోపియన్లు స్థానిక అమెరిండియన్ల జనాభా ఉండడంతో బహుళ జాతి కాస్మోపాలిటన్ సమాజం ఏర్పడింది. కరిబియన్ యొక్క ఈ బహుళ-జాతి మిశ్రమం తరచుగా ప్రధాన జాతుల సరిహద్దులను దాటి ఉప-జాతులను సృష్టించింది. వీటిలో ములాట్టో - క్రియోల్, మెస్టిజో, పార్డో, జాంబో, డగ్లా, చిండియన్, ఆఫ్రో-ఆసియన్లు, యురేషియన్, కోకో పన్యోల్స్, ఆసియా లాటినోస్ ఉన్నాయి.

స్పానిష్ (64%), ఫ్రెంచ్ (25%), ఇంగ్లీషు (14%), డచ్, హైటియన్ క్రియోల్, పాపియమెంటో ఈ ప్రాంతంలోని వివిధ దేశాలలో చలామణీలో ఉన్న ప్రధానమైన అధికారిక భాషలు. అయితే ప్రతి కరిబియన్ దేశంలోనూ కొన్ని ప్రత్యేకమైన క్రియోల్ భాషలు లేదా మాండలికాలు కూడా ఉన్నాయి. కరిబియన్ హిందుస్తానీ, చైనీస్, జావానీస్, అరబిక్, మోంగ్, అమెరిండియన్ భాషలు, ఇతర ఆఫ్రికన్ భాషలు, ఇతర యూరోపియన్ భాషలు, ఇతర భారతీయ భాషలు వంటి ఇతర భాషలు కూడా చూడవచ్చు.

క్యూబాలోని హవానా కేథడ్రల్ (కాథలిక్) 1777లో పూర్తయింది
సముద్రంలో ఆలయం, ట్రినిడాడ్, టొబాగోలోని హిందూ మందిరం
ముహమ్మద్ అలీ జిన్నా మెమోరియల్ మసీదు, ట్రినిడాడ్, టొబాగోలోని ఒక ముస్లిం మసీదు

కరిబియన్‌లో క్రైస్తవం ప్రధానమైన మతం (84.7%).[17] ఈ ప్రాంతంలోని ఇతర మతాలు - హిందూ మతం, ఇస్లాం మతం, జుడాయిజం, రస్తాఫారి, బౌద్ధమతం, చైనీస్ జానపద మతం (ఇంకా. టావోయిజం, కన్ఫ్యూషియనిజం), బహాయి, జైనిజం, సిక్కు మతం, కెబాటినాన్, సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలు, యోరుబా (ఇంక్ల్. ట్రినిడాడ్ ఒరిషా), ఆఫ్రో-అమెరికన్ మతాలు, (ఇంక్ల్. శాంటెరియా, పాలో, ఉంబండా, బ్రూజేరియా, హూడూ, కాండోంబ్లే, క్వింబండా, ఒరిషా, క్సాంగో డి రెసిఫ్, క్సాంగో డో నార్డెస్టే, కాంఫా, ఎస్పిరిటిస్మో, శాంటో డైమ్, ఒబియా, కాండోంబ్లే, విన్టియన్, అబాన్, అబాన్, అబాన్, వూడూ, హైతియన్ వోడౌ, వోడున్).

వంటకాలు

[మార్చు]

ఇష్టమైన లేదా జాతీయ వంటకాలు

[మార్చు]
డబుల్స్, ట్రినిడాడ్, టొబాగో జాతీయ వంటకాలలో ఒకటి
  • యాంగిల్లా - బియ్యం, బఠానీలు, చేప
  • ఆంటిగ్వా అండ్ బార్బుడా - శిలీంధ్రాలు, పెప్పర్‌పాట్
  • బహామాస్ – జామ డఫ్, శంఖం సలాడ్, బఠానీలు, అన్నం, శంఖు వడలు
  • బార్బడోస్ - చ-చౌ, ఫ్లయింగ్ ఫిష్
  • బెలిజ్ - బియ్యం, బీన్స్, బంగాళాదుంప సలాడ్తో ఉడికించిన చికెన్; వైట్ రైస్, స్టూ బీన్స్, కోల్ స్లావ్‌తో వేయించిన చేపలు
  • బ్రిటిష్ వర్జిన్ దీవులు - చేపలు, శిలీంధ్రాలు
  • కేమాన్ దీవులు - తాబేలు వంటకం, తాబేలు స్టీక్, గ్రూపర్
  • కొలంబియన్ కరిబియన్ – కొబ్బరి పాలతో అన్నం, అర్రోజ్ కాన్ పోలో, సాంకోచో, అరబ్ వంటకాలు (అరబ్ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల)
  • క్యూబా - ప్లాటిల్లో మోరోస్ వై క్రిస్టియానోస్, రోపా వీజా, లెచోన్, మదురోస్, అజియాకో
  • డొమినికా - మౌంటెన్ చికెన్, రైస్, బఠానీలు, కుడుములు, సాల్ట్ ఫిష్, డాషిన్, బేక్స్ (వేయించిన కుడుములు), కొబ్బరి కాన్ఫిచర్, కూర మేక, కాసావా ఫారిన్, ఆక్సటైల్
  • డొమినికన్ రిపబ్లిక్ – ఉడికిన ఎర్రటి కిడ్నీ బీన్స్, పాన్ ఫ్రైడ్ లేదా బ్రైజ్డ్ బీఫ్, సలాడ్/ ఎన్సలాడా డి కోడిటోస్, ఎంపనాడాస్, మాంగు, సాంకోచోతో అరోజ్ కాన్ పోలో
  • గ్రెనడా - ఆయిల్ డౌన్, రోటీ, రైస్ & చికెన్
  • గయానా - రోటీ, కూర, పెప్పర్‌పాట్, కుకప్ రైస్, మెథెమ్, ఫోలోరీ
  • హైతీ - గ్రియోట్ (వేయించిన పంది మాంసం) డు రిజ్ ఎ పోయిస్ లేదా డిరి అక్ ప్వా (బియ్యం, బీన్స్)తో వడ్డిస్తారు
  • జమైకా - అకీ, సాల్ట్‌ఫిష్, కల్లాలూ, జెర్క్ చికెన్, కర్రీ చికెన్
  • మోంట్సెరాట్ - మేక నీరు
  • ప్యూర్టో రికో - పచ్చి పావురం బఠానీలతో పసుపు బియ్యం, సాల్ట్‌ఫిష్ కూర, కాల్చిన పంది భుజం, చికెన్ ఫ్రికాస్సీ, మోఫాంగో, ట్రిప్ సూప్, అల్కాపురియా, కొబ్బరి కస్టర్డ్, రైస్ పుడ్డింగ్, జామ టర్నోవర్‌లు, మల్లోర్కా బ్రెడ్
  • సెయింట్ కిట్స్, నెవిస్ - మేక నీరు, కొబ్బరి కుడుములు, మసాలా అరటి, సాల్ట్ ఫిష్, బ్రెడ్ ఫ్రూట్
  • సెయింట్ లూసియా - కాలాలూ, దాల్ రోటీ, ఎండిన, ఉప్పు కలిపిన వ్యర్థం, పచ్చి అరటిపండ్లు, బియ్యం, బీన్స్
  • సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ - కాల్చిన బ్రెడ్‌ఫ్రూట్, వేయించిన జాక్‌ఫిష్
  • సురినామ్ - బ్రౌన్ బీన్స్, అన్నం, రోటీ, కూర, వేరుశెనగ సూప్, వేరుశెనగ సాస్‌తో వేయించిన అరటిపండు, నాసి గోరెంగ్, మోక్సీ అలేసి, బారా, పోమ్
  • ట్రినిడాడ్, టొబాగో – డబుల్స్, రోటీ లేదా దాల్ భాట్ తో కూర, ఆలూ పై, ఫూలౌరీ, కాలాలూ, బేక్ అండ్ షార్క్, కర్రీ పీత, కుడుములు
  • యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ - ఉడికిన మేక, ఆక్సటైల్ లేదా గొడ్డు మాంసం, సీఫుడ్, కాల్లూ, ఫంగీ

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. The Lucayan Archipelago is excluded from some definitions of "Caribbean" and instead classified as Atlantic; this is primarily a geological rather than cultural or environmental distinction.

మూలాలు

[మార్చు]
  1. See the list of Caribbean islands.
  2. "North America".
  3. The World: Geographic Overview, The World Factbook, Central Intelligence Agency; "North America is commonly understood to include the island of Greenland, the isles of the Caribbean, and to extend south all the way to the Isthmus of Panama."
  4. The Netherlands Antilles: The joy of six, The Economist Magazine, April 29, 2010
  5. "SPP Background". CommerceConnect.gov. Security and Prosperity Partnership of North America. Archived from the original on 18 June 2008. Retrieved 14 November 2010.
  6. "Ecoregions of North America". United States Environmental Protection Agency. Retrieved 30 May 2011.
  7. "What's the difference between North, Latin, Central, Middle, South, Spanish and Anglo America?". About.com. Archived from the original on 2016-04-10. Retrieved 2022-12-10.
  8. Unless otherwise noted, land area figures are taken from Demographic Yearbook. United Nations Statistics Division.
  9. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  10. Engerman, p. 486
  11. The Sugar Revolutions and Slavery Archived 2011-06-22 at the Wayback Machine, U.S. Library of Congress
  12. Engerman, pp. 488–492
  13. Engerman, Figure 11.1
  14. Engerman, pp. 501–502
  15. Engerman, pp. 504, 511
  16. Table A.2, Database documentation, Latin America and the Caribbean (LAC) Population Database, version 3, International Center for Tropical Agriculture, 2005.
  17. Christianity in its Global Context Archived 2013-08-15 at the Wayback Machine
"https://te.wikipedia.org/w/index.php?title=కరిబియన్&oldid=4344279" నుండి వెలికితీశారు