Jump to content

ఏనుగు

వికీపీడియా నుండి
(కరి నుండి దారిమార్పు చెందింది)
ఆప్రికాకు చెందిన ఏనుగు

ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి.

భాషా విశేషాలు

[మార్చు]

ఆఫ్రికా ఏనుగు

[మార్చు]

ఆఫ్రికా ఏనుగులు (ప్రజాతి Loxodonta) ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుకభాగం పుటాకారంలో ఉంటుంది. వీటి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. విశేషమేమిటంటె, వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి. శరీరం పై వెండ్రుకలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.

  1. సంఖ్యా జాబితా అంశం

ఆసియా ఏనుగు

[మార్చు]
నడుస్తున్న ఏనుగు

ఆసియా ఏనుగులు (Elephas maximus) ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి. మొత్తం ఏనుగులలో 10 శాతం మాత్రమే ఆసియా ఏనుగులు. జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు.

  • శ్రీలంక ఏనుగు (Elephas maximus maximus) ఆసియా ఏనుగులన్నింటిలోను పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంచుమించు 3,000-4,500 వరకు ఉన్నాయని అంచనా. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.
  • భారతదేశపు ఏనుగు (Elephas maximus indicus) ఆసియా ఏనుగులన్నింటిలో సంఖ్యలో ఎక్కువగా, అంటే 36,000 వరకు ఉన్నాయని అంచనా. ఇవి భారతదేశం నుండి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇంచుమించు 5,000 కి.గ్రా. బరువు ఉంటాయి.
  • సుమత్రా ఏనుగు (Elephas maximus sumatranus) ఇవి అన్నిటికన్నా చిన్న పరిణామంలో ఉంటాయి.

సుమత్రాన్ ఏనుగు

[మార్చు]

సుమత్రాన్ ఏనుగు అనేది ఆసియాలో గుర్తించబడిన మూడు ఉపజాతులలో ఒకటి. ఇవి ఇండోనేషియాలోని సుమత్రాన్ ద్వీపానికి చెందినవి. సాధారణంగా ఆసియా ఏనుగులు ఆఫ్రికన్ ఏనుగుల కంటే చిన్నవి. ఆడ ఏనుగులు సాధారణంగా మగవాటి కంటే చిన్నవిగా, పొట్టిగా ఉంటాయి. దంతాలు కలిగి ఉండవు. సుమత్రాన్ ఏనుగులు 2 నుంచి 3.2 మీటర్ల ఎత్తు ఉంటాయి. 4,400 నుంచి 8,800 పౌండ్ల మధ్య బరువు కలిగి ఉంటాయి. ఇండోనేసియాలో ఏనుగుల సహజ ఆవాసాలైన బోర్నియో, సుమత్రాన్ దీవుల్లో అటవీ నిర్మూలన వేగంగా జరుగుతోంది. అందువల్ల వేగంగా అంతరించిపోతోన్న జాతిగా వీటిని పరిగణిస్తున్నారు.  అలాగే ఈ జాతికి చెందిన మగ ఏనుగుల దంతాలకు అధిక విలువ పలుకుతుండటంతో వేటగాళ్ల నుంచి వీటికి అధిక ముప్పు పొంచి ఉంది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని సగం తొండాన్ని కోల్పోయిన ఏడాది వయస్సున్న గున్న ఏనుగు చికిత్స పొదుతూ నవంబరు 16, 2021న మృతి చెందింది. దీంతో గత తొమ్మిదేళ్లలో తూర్పు అచే జిల్లాలో వేటగాళ్లు పన్నిన వలలకు మరణించిన ఏనుగుల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమత్రాన్ లో ఏనుగుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. 2014లో 1300 ఉండగా ఇప్పుడు ఏనుగులు సంఖ్య 693కి పడిపోయిందని ఇండోనేషియా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెప్తున్నాయి.[1][2]

మానవులతో సంబంధం

[మార్చు]
తిరుగుబాటు చేసిన ఖాన్ జహాన్ను బహదూర్ ఖాన్ తో మొఘలులు యుధ్ధసమయంలో ఉదయ్ అనే ఏనుగుతో పోరాడుతున్న చిత్రానంద్ అనే ఏనుగు- అక్బనామా నుండి ఒక దృశ్యం.
  • ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు.
  • యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.
  • మహారాజులు అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
  • ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల లలో, సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
  • గజారోహణం, గండపెండేరం లతో మహారాజులు ఆనాటి గొప్ప కవులను, పండితులను సన్మానించేవారు.
  • సంస్కృత భాషా తరగతుల్లో, విద్యార్థులకు “గజః గచ్ఛతి” (ఏనుగు వెళుతుంది) అని ఒక సరళమైన వాక్యం నేర్పిస్తారు. మాములుగా విద్యార్థులు నేర్చుకునే మొదటి వాక్యం ఇదే.

తెలంగాణలో ఏనుగు శిలాజాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం లోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీ-4 తవ్వకాల్లో సుమారు 5కోట్ల నుంచి 10కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న పురాతనమైన ‘స్టెగోడాన్‌' జంతువు శిలాజాలు లభ్యమయ్యా యి. ఈ శిలాజాలు ఈ నెల 30 బయటపడ్డాయని, ఇవి ఏనుగు జాతి కంటే ముందు తరం జంతువు స్టెగోడాన్‌ వేనని జువాలాజికల్‌ సర్వే అధికారులు నిర్ధారించారని సింగరేణి సంస్థ పేర్కొంటున్నది. స్టెగోడాన్ ‌కు చెందిన దవడ ఎముకతోపాటు, దంతాలు సైతం లభ్యమయ్యాయి.

ఏనుగు సవారి

దేవాలయాల్లో ఏనుగుల వాడుక

[మార్చు]

భారతదేశములోనే కాక పలు ఇతర దేశాలలో సైతం దేవాలయాల యందున ఏనుగులను వాడటం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షణ భారత దేశ ప్రధాన దేవస్థానములవారు స్వామి యొక్క అన్ని ఉత్సవములయందున తప్పక హస్తి యొక్క సేవలను తీసుకొంటారు. ఊరేగింపులలోనూ, దేవాలయ ప్రధాన ద్వారముల వద్ద వీటిని అధికముగా వీక్షించవచ్చు.

హిందూ పురాణాలలో

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రపంచ ఏనుగుల దినోత్సవం

[మార్చు]

ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీని ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారు.

ఇతర పేర్లు

[మార్చు]
  1. కరి
  2. గజము
  3. దంతి
  4. హస్తి

బయటిలింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "వేటగాళ్ల ఉచ్చుతో తొండం తెగడంతో ఏనుగు పిల్ల మృతి". BBC News తెలుగు. 2021-11-18. Retrieved 2021-11-22.
  2. Telugu, TV9 (2021-11-17). "Baby Elephant: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న గున్న ఏనుగు.. తొండం కోల్పోయి మృతి.. రోజు రోజుకీ అంతరించిపోతున్న జాతి". TV9 Telugu. Retrieved 2021-11-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఏనుగు&oldid=4356935" నుండి వెలికితీశారు