కప్పగంతుల మల్లికార్జునరావు
స్వరూపం
కప్పగంతుల మల్లికార్జునరావు | |
---|---|
కప్పగంతుల మల్లికార్జునరావు | |
జననం | డిసెంబరు 23, 1936 కారుమంచి, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా |
మరణం | నవంబరు 11, 2006 |
ప్రసిద్ధి | కథా, నవలా, నాటక రచయిత |
తండ్రి | ఆంజనేయశాస్త్రి |
తల్లి | మల్లికాంబ |
కప్పగంతుల మల్లికార్జునరావు ( డిసెంబరు 23, 1936 - నవంబరు 11, 2006) కథా, నవలా, నాటక రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన కారుమంచి గ్రామంలో 1936, డిసెంబరు 23వ తేదీన జన్మించాడు.[1] ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం - విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెలమల సిమ్మన్న పర్యవేక్షణలో జరిగింది.
రచనలు
[మార్చు]- కత్తుల పంజరం
- కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -2
- కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -3
- కప్పగంతుల మల్లికార్జునరావు నాటికలు నాలుగు
- ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం
- నాటక సమీక్ష
- మునపటి కథకులు ముప్ఫయ్ ముగ్గురు
- వ్యాసమాలిక (ఆధునిక నాటకరంగం, తెలుగు సాహిత్యంపై వ్యాసాలు)
- ది నీడిల్ (నవల)
- అశోకుని ఆత్మవిచారము (ఏకపాత్ర రూపకం)
- ఉద్ధారకులు (నాటిక)
- పరిష్కృతి (నాటిక)
- సప్తపది (నాటకం)
- దూరపు కొండలు (నాటకం)
- తపస్విని (నవల)
- కాంతికిరణం (నవల)
- నీలినీడలు (నాటకం)
- కాంతిపథం
- యాచకులు (స్త్రీ పాత్ర లేని నాటకం)
- నూటపదహారు (నాటిక)
- మారని మనిషి (నాటకం)
- వైకుంఠపాళి (నవల)
- జ్వాల (స్త్రీపాత్ర లేని నాటిక)
- క్షంతవ్యులు (స్త్రీపాత్ర లేని నాటిక)
- సాలెగూడు (నాటిక)
- చరిత్రహీనులు (నాటిక)
- దాగుడు మూతలు (నాటిక)
- సిగరెట్లు త్రాగరాదు (నాటిక)
- మబ్బు వీడింది (నాటిక)
- వెలుగు (నాటిక)
- ఆదర్శాలు ఆవలి అంచున (నాటిక)
- నయనతార (నాటిక)
మూలాలు
[మార్చు]- ↑ "ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు, జూన్ 1971 - పేజీ 91". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-05.