Jump to content

కగిసో రబాడా

వికీపీడియా నుండి
Kagiso Rabada
Rabada whilst playing for కెంట్ in July 2016 at Tunbridge Wells
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Kagiso Rabada
పుట్టిన తేదీ (1995-05-25) 1995 మే 25 (వయసు 29)
Johannesburg, Gauteng, South Africa
మారుపేరుKG
ఎత్తు1.91 మీ. (6 అ. 3 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 323)2015 నవంబరు 5 - ఇండియా తో
చివరి టెస్టు2023 మార్చి 8 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 114)2015 జూలై 10 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2023 మార్చి 31 - నెదర్లాండ్స్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.25
తొలి T20I (క్యాప్ 62)2014 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 మార్చి 28 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.25
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14Gauteng
2013/14–2020/21Lions
2016కెంట్
2017–2021ఢిల్లీ క్యాపిటల్స్
2018–2019జోజి స్టార్స్
2022–presentపంజాబ్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I FC
మ్యాచ్‌లు 60 89 56 80
చేసిన పరుగులు 897 317 147 1,121
బ్యాటింగు సగటు 11.80 15.85 21.00 11.80
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 47 31* 22 48*
వేసిన బంతులు 11,117 4,579 1,159 15,065
వికెట్లు 280 137 58 355
బౌలింగు సగటు 22.34 27.94 29.87 23.01
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 13 2 0 16
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 4 0 0 5
అత్యుత్తమ బౌలింగు 7/112 6/16 3/20 9/33
క్యాచ్‌లు/స్టంపింగులు 29/– 31/– 18/– 38/–
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 31

కగిసో రబాడా (జననం 1995 మే 25) దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. ఆటలో అన్ని రూపాల్లోనూ ఆడాడు. అతను కుడిచేతి ఫాస్టు బౌలరు. 2015 నవంబరులో తన తొలి టెస్టు ఆడడానికి ముందే, 2014 నవంబరు లోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. 2018 జనవరి నాటికి, 22 ఏళ్ల వయస్సులో, అతను ఐసిసి వన్‌డే బౌలరు ర్యాంకింగ్స్, ఐసిసి టెస్టు బౌలరు ర్యాంకింగ్స్ రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉన్నాడు. 2018 జూలైలో, టెస్టుల్లో (23 ఏళ్ల 50 రోజులు) 150 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు. [1]

2016 జూలైలో, క్రికెట్ సౌతాఫ్రికా (CSA) వార్షిక విందులో, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బహుమతితో సహా ఆరు అవార్డులను గెలుచుకున్న మొదటి క్రికెటర్‌గా రబాడా నిలిచాడు. [2] 2018 జూన్లో, అతను CSA యొక్క వార్షిక విందులో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌, వన్‌డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌తో సహా ఆరు అవార్డులను మళ్లీ గెలుచుకున్నాడు. [3] 2018 ఆగస్టులో, విజ్డెన్ అతన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ యువ ఆటగాడిగా పేర్కొంది.[4] అతను, క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల లోనూ హ్యాట్రిక్ సాధించాడు.

దేశీయ వృత్తి

[మార్చు]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]
2014లో శిక్షణలో రబాడా

రబాడా 2014 నవంబరు 5న ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా తరపున తన తొట్ట తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.[5]

రబాడా 2015 జూలై 10న బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా తరపున తన తొలి వన్డే అంతర్జాతీయ పోటీ ఆడాడు, [6] అందు లోనే 6/16తో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. [7] తైజుల్ ఇస్లామ్ తర్వాత, తొలి వన్డే మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన రెండవ ఆటగాడిగా కూడా అతను నిలిచాడు. [8] [9] 2015 నవంబరు 5న భారత్‌పై దక్షిణాఫ్రికా తరపున టెస్టు రంగప్రవేశం చేశాడు.[10] ఇంగ్లండ్ 2015-16 దక్షిణాఫ్రికా పర్యటన లోని నాల్గవ టెస్ట్‌లో, అతను 13/144 గణాంకాలు సాధించి, జట్టును గెలిపించాడు. ఈ ప్రక్రియలో, అతను ఒక టెస్ట్‌లో పది వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన దక్షిణాఫ్రికా ఆటగాడు అయ్యాడు. మఖాయా ఎంటిని సాధించిన 13/132 తర్వాత అతనిది రెండవ అత్యుత్తమ గణాంకం ఇది. [11] ఇందులో రెండు ఐదు వికెట్ల పంటలు ఉన్నాయి. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు 7/112 సాధించాడు. [12]

2017లో కేప్ టౌన్‌లో శ్రీలంకపై రెండోసారి పది వికెట్ల పంట సాధించాడు. దక్షిణాఫ్రికా 2017 లో చేసిన ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో, మొదటి రోజు స్టోక్స్‌ను అవుట్ చేసాక, బెన్ స్టోక్స్‌తో "అనుచితమైన పదజాలం" ఉపయోగించినందుకు గాను, ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన రెండవ టెస్టులో ఆడకుండా రబాడాను సస్పెండ్ చేసారు. [13]


2017లో ఇంగ్లండ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా టూర్‌లో మూడో వన్డే మ్యాచ్‌లో రబాడా 4/39 స్కోరును తీసుకున్నాడు. [14] ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శన తరువాత, ఐసిసి వన్‌డే బౌలరు ర్యాంకింగ్స్ [15] ప్రకారం స్వదేశీయుడైన ఇమ్రాన్ తాహిర్‌ను స్థానభ్రంశం చేస్తూ రబాడా ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ వన్‌డే బౌలరు అయ్యాడు. 1998లో సక్లైన్ ముస్తాక్ తర్వాత వన్‌డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడు (22 ఏళ్ల వయస్సు) అయ్యాడు [16]

2018లో భారత దక్షిణాఫ్రికా పర్యటనలో న్యూలాండ్స్‌లో జరిగిన తొలి టెస్టులో, రబాడా మొదటి, రెండో ఇన్నింగ్స్‌లో 3/34, 2/41 స్కోరును తీసుకున్నాడు. [17] ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శనను అనుసరించి, ఐసిసి టెస్టు బౌలరు ర్యాంకింగ్స్ [18] ప్రకారం ఇంగ్లండ్ బౌలరు జేమ్స్ ఆండర్సన్‌ను స్థానభ్రంశం చేస్తూ రబాడా ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ టెస్టు బౌలరు అయ్యాడు. [19]

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో రబాడా 150 పరుగులకు 11 వికెట్లు పడగొట్టి చివరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. [20] ఈ ప్రదర్శన ఐసిసి టెస్టు బౌలరు ర్యాంకింగ్స్‌లో 902 పాయింట్లతో జేమ్స్ ఆండర్సన్ పైన 15 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. వెర్నాన్ ఫిలాండర్, షాన్ పొలాక్, డేల్ స్టెయిన్ తర్వాత 900 పాయింట్లు దాటిన నాల్గవ దక్షిణాఫ్రికా బౌలరు అయ్యాడు.[21]

2018 జూలైలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రబాడా హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించి టెస్టు క్రికెట్‌లో 150 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌ల పరంగా (31) అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన మూడో దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.[22] [23]

2018లో, అతను 52 అవుట్‌లతో, ఆ సంవత్సరం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు. [24] 2019 మార్చిలో, శ్రీలంకతో జరిగిన రెండో వన్‌డేలో రబాడా, వన్‌డేల్లో తన 100వ వికెట్‌ను తీశాడు. [25] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [26] [27] 2021లో దక్షిణాఫ్రికా పాకిస్తాన్‌ పర్యటనలో భాగంగా జరిగిన 1వ టెస్టులో హసన్ అలీని ఔట్ చేసి, 200 టెస్టు వికెట్లు తీసిన 8వ దక్షిణాఫ్రికా బౌలర్‌గా రబాడా నిలిచాడు [28] [29] [30]

2021 సెప్టెంబరులో, 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో రబాడా ఎంపికయ్యాడు. [31] 2021 నవంబరు 6న, ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌లో, T20I క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. [32] 2022 జనవరిలో, రబాడా తన 50వ టెస్టు మ్యాచ్‌లో, భారత్‌తో జరిగిన సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ఆడాడు. [33] 2022 ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు రబాడా, లార్డ్స్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. ఇది అతనికి గౌరవనీయమైన ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించింది. [34] అతను అలన్ డోనాల్డ్, మఖాయా ఎంటిని, వెర్నాన్ ఫిలాండర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన నాల్గవ దక్షిణాఫ్రికా బౌలరు. [35]

ఇతర వెంచర్లు

[మార్చు]

2020లో కగిసో రబాడా, కామెరాన్ స్కాట్ లు కలిసి కింగ్‌డమ్ కోమ్ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు, [36] [37] వారి మొదటి ప్రాజెక్టుగా "ది రింగ్ ఆఫ్ బీస్ట్స్" అనే షార్ట్ ఫిల్మ్ తీసారు. [36] [38]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రబాడా తండ్రి డాక్టర్ [39] తల్లి ఫ్లోరెన్స్, న్యాయవాది. [40] అతను వెండా, స్వనా వంశానికి చెందినవాడు.

మూలాలు

[మార్చు]
  1. "Kagiso Rabada becomes youngest to claim 150 Test wickets". Crictracker. Retrieved 14 July 2018.
  2. "Rabada dominates CSA awards". ESPNcricinfo. Retrieved 27 July 2016.
  3. "Rabada sweeps CSA awards with six trophies again". ESPNcricinfo. Retrieved 3 June 2018.
  4. "Rabada crowned Wisden's best young player in the world". International Cricket Council. Retrieved 13 August 2018.
  5. "South Africa tour of Australia (November 2014), 1st T20I: Australia v South Africa at Adelaide, Nov 5, 2014". ESPNcricinfo. Retrieved 10 July 2015.
  6. "South Africa tour of Bangladesh, 1st ODI: Bangladesh v South Africa at Dhaka, Jul 10, 2015". ESPNcricinfo. Retrieved 10 July 2015.
  7. "Records – One-Day Internationals – Bowling records – Best figures in a innings on debut". ESPNcricinfo. Retrieved 10 July 2015.
  8. "Kagiso Rabada becomes only second player in ODI history to take a hat-trick on international debut in South Africa's match against Bangladesh". Metro. UK. Retrieved 10 July 2015.
  9. "Rabada's record six-for sets up South Africa win". ESPNcricinfo. Retrieved 10 July 2015.
  10. "South Africa tour of India, 1st Test: India v South Africa at Mohali, Nov 5–9, 2015". ESPNcricinfo. Retrieved 5 November 2015.
  11. Seervi, Bharath (26 January 2016). "Rabada's records, and England's lows". ESPNcricinfo. Retrieved 26 January 2016.
  12. Hopps, David (16 January 2016). "Rabada takes five as England make 323". ESPNcricinfo. Retrieved 16 January 2016.
  13. England v South Africa: Kagiso Rabada suspended for second Test BBC Sport, 7 July 2017. Retrieved 7 July 2017.
  14. "Scorecard of third England vs South Africa ODI match 2017 at Lord's". espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 10 January 2018.
  15. "Kagiso Rabada tops ODI bowling rankings". espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 10 January 2018.
  16. "Kagiso Rabada officially the best in the world". iol.co.za (in ఇంగ్లీష్). Retrieved 10 January 2018.
  17. "Scorecard of first South Africa vs India Test match 2018". espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 10 January 2018.
  18. "Rabada climbs to top of Test rankings". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 9 January 2018.
  19. "Kagiso Rabada takes top spot from James Anderson". espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 10 January 2018.
  20. "2nd Test, Australia tour of South Africa at Port Elizabeth, Mar 9-12 2018 - Match Summary - ESPNCricinfo". ESPNcricinfo.
  21. "Rabada climbs to No. 1 in ICC Test bowler's rankings".
  22. "Kagiso Rabada topples Harbhajan Singh to become youngest to 150 Test wickets". India Today (in ఇంగ్లీష్). Retrieved 14 July 2018.
  23. Desk, India.com Sports (14 July 2018). "Rabada Youngest Bowler To 150 Test Wickets". India.com (in ఇంగ్లీష్). Retrieved 14 July 2018.
  24. "Most Test Wickets in 2018". ESPN Cricinfo. Retrieved 31 December 2018.
  25. "Du Plessis, Rabada landmarks sink Sri Lanka". SuperSport. Retrieved 7 March 2019.
  26. "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  27. "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  28. "Rabada 8th Proteas bowler to scalp 200 Test wickets". sify.com. Archived from the original on 28 January 2021. Retrieved 28 January 2021.
  29. "Pakistan vs South Africa: Kagiso Rabada Becomes Eighth SA Bowler to Take 200 Test Wickets". Retrieved 28 January 2021.
  30. "Kagiso Rabada 8th South African bowler to scalp 200 Test wickets". sify.com. Archived from the original on 29 జనవరి 2021. Retrieved 28 January 2021.
  31. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  32. "Kagiso Rabada becomes first SA bowler to take hat-trick in T20Is; leads Proteas to win over England". Times Now News. Retrieved 6 November 2021.
  33. "Virat Kohli returns as India resume hunt for history in South Africa". ESPN Cricinfo. Retrieved 11 January 2022.
  34. "Kagiso Rabada: numbers worthy of bowling greatness". ESPNcricinfo. Retrieved 2022-08-20.
  35. "Honours Boards | Lord's". www.lords.org. Retrieved 2022-08-20.
  36. 36.0 36.1 "Kagiso Rabada and Cameron Scott are moving into the film space with their latest project". Sandton Chronicle (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-01. Retrieved 2021-10-19.
  37. "About". Kingdom Kome (in ఇంగ్లీష్). 2021-06-08. Retrieved 2021-10-19.
  38. "Home". Kingdom Kome (in ఇంగ్లీష్). 2021-06-08. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-19.
  39. "South Africa cricket sensation Kagiso Rabada could face Australia in proposed pink ball Test". Courier Mail. Retrieved 7 November 2016.
  40. "Kagiso And His Mom". Sports Eagle. Retrieved 7 November 2016.