ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 2019 జూన్ 21 న విడుదలైన కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తెలుగు సినిమా.[1]నెల్లూరు కు చెందిన ఒక నేర పరిశోధకుడి నేపధ్యంగా ఈ కథ సాగుతుంది. ఇందులో దాదాపు అందరూ కొత్త నటులు నటించారు.
కథ
[మార్చు]ఆత్రేయ అనే యువకుడు ఉత్తర భారతదేశంలో ఉండగా తల్లి మరణవార్త గురించి తెలుస్తుంది. అతను హుటాహుటిన నెల్లూరులో తన ఇంటికి చేరుకునే సరికే తల్లి అంత్యక్రియలు జరిగిపోయి ఉంటాయి. కొన్ని నెలల తర్వాత అతను నెల్లూరులో నేరపరిశోధకుడిగా (డిటెక్టివ్) అవతారం ఎత్తుతాడు. అతని దగ్గర సహాయకురాలిగా చేరుతుంది ఒక అమ్మాయి. ఇద్దరూ కలిసి చిన్న చిన్న కేసులు పరిశోధించి పొట్టపోసుకుంటుంటారు. ఒకానొక కేసులో ఆత్రేయ జైలు పాలవుతాడు. ఆ జైల్లో ఒక వృద్ధుడు అతన్ని కలిసి తన పేరు మారుతీ రావు అనీ, తన కుమార్తెను ఒంగోలులో ఎవరో ముగ్గురు అత్యాచారం చేసి చంపేశారనీ, అది అడగడానికి వచ్చిన తనని మరో కేసులో ఇరికించారని చెబుతాడు.
తారాగణం
[మార్చు]- నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
- కళ: క్రాంతి ప్రియం
- కథనం: నవీన్ పొలిశెట్టి, స్వరూప్ ఆర్‌ఎస్‌జె
- సంగీతం: మార్క్ కె. రాబిన్
- కూర్పు: అమిత్ త్రిపాఠి
- ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
- నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
- కథ, మాటలు, దర్శకత్వం: స్వరూప్ ఆర్‌ఎస్‌జే
మూలాలు
[మార్చు]- ↑ athreya, agent. "Agent Sai Srinivasa Athreya". Bookmyshow.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (26 February 2020). "'భీష్మ'లో చిన్న భాగమైనందుకు గర్వంగా ఉంది: అప్పాజీ అంబరీష". Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
- ↑ Athreya, Agent. "Agent Sai Srinivasa Athreya". timesofindia.
- ↑ athreya, agent. "Agent Sai Srinivasa Athreya". Bookmyshow.
- ↑ athreya, agent. "Agent Sai Srinivasa Athreya". filmibeat. Archived from the original on 2019-06-03. Retrieved 2019-06-27.
- ↑ Agent, Athreya. "Agent Sai Srinivasa Athreya". filmybuzz. Archived from the original on 2019-06-17. Retrieved 2019-06-27.