ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్
ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్: ఫ్రం ది బిగ్ బ్యాంగ్ టు బ్లాక్ హోల్స్ విశ్వసృష్టి గురించి భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్తకం. ఇది 1988లో మొదటిసారిగా ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని హాకింగ్ భౌతిక శాస్త్ర పరిజ్ఞానం లేనివారి కోసం రాశాడు.
ఈ పుస్తకంలో హాకింగ్, విశ్వం నిర్మాణం, మూలాలు, పుట్టుక, అభివృద్ధి, చివరికి విశ్వం ఏమవుతుంది అనే విషయాలు చర్చించాడు. ఖగోళ శాస్త్రం, ఆధునిక భౌతికశాస్త్రం కూడా ఇదే విషయాలను పరిశోధిస్తాయి. ప్రాథమిక అంశాలైన స్థలం/ప్రాంతం (స్పేస్), కాలం (టైమ్) గురించి, విశ్వానికి ఆధారభూతమైన మూలకణాలు (క్వార్క్), వాటిని నియంత్రించే గురుత్వాకర్షణ లాంటి ప్రాథమిక బలాల గురించి కూడా చర్చించబడ్డాయి. బిగ్ బ్యాంగ్, బ్లాక్ హోల్ వంటి విశ్వసృష్టి గురించి వ్రాసాడు. ఆధునిక శాస్త్రవేత్తలు విశ్వాన్ని వివరించడానికి ఉపయోగించే సాధారణ సాపేక్షత, క్వాంటం మెకానిక్స్ అనే రెండు ప్రధాన సిద్ధాంతాలను చర్చించాడు. చివరగా విశ్వంలోని ప్రతిదాన్ని పొందికైన పద్ధతిలో వివరించే ఏకీకృత సిద్ధాంతం కోసం అన్వేషణ గురించి మాట్లాడాడు.
40 భాషలలో 25 మిలియన్ కాపీలు అమ్ముడై అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకంగా నిలిచింది.[1]
ప్రచురణ
[మార్చు]1983 ప్రారంభంలో, హాకింగ్ మొదటిసారిగా కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్‌లో ఖగోళ శాస్త్ర పుస్తకాల ఎడిటర్‌గా ఉన్న సైమన్ మిట్టన్‌ను కాస్మోలజీపై ఒక ప్రసిద్ధ పుస్తకం కోసం తన ఆలోచనలతో సంప్రదించాడు. ముసాయిదా మాన్యుస్క్రిప్ట్‌లో ఉన్న పలు రకాల గణిత సమీకరణాల గురించి మిట్టన్ సందేహించాడు. హాకింగ్ అనుకున్న విమానాశ్రయ పుస్తకాల షాపుల్లో కొనుగోలుదారులు విముఖత చూపుతారని అతను భావించాడు. అతను హాకింగ్‌ను ఒక సమీకరణం తప్ప మిగిలినవన్నీ వదలమని ఒప్పించాడు.[2] పుస్తకంలోని ప్రతి సమీకరణానికి, పాఠకుల సంఖ్య సగానికి తగ్గుతుందని హెచ్చరించినట్లు రచయిత స్వయంగా పుస్తకం యొక్క ముందుమాటలో పేర్కొన్నాడు. అందువల్ల ఇది ఒకే సమీకరణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది: కానీ పుస్తకం అన్వేషించే కొన్ని భావనలను వివరించడానికి అనేక సంక్లిష్ట నమూనాలు, రేఖాచిత్రాలు మరియు ఇతర దృష్టాంతాలను ఉపయోగించింది.
మూలాలు
[మార్చు]- ↑ McKie, Robin (August 2007). "A brief history of Stephen Hawking". Cosmos. Retrieved 13 June 2020.
- ↑ Gribbin, John; White, Michael (1992). Stephen Hawking: a life in science. Viking Press. ISBN 978-0670840137.