క్వార్క్
కూర్పు | ప్రాథమిక కణం |
---|---|
కణ గణాంకాలు | ఫర్మియోనిక్ |
ఉత్పత్తి | 1st, 2nd, 3rd |
Interactions | strong, weak, electromagnetic, gravitation |
చిహ్నం | q |
వ్యతిరేక కణము | antiquark ( q ) |
సైద్ధాంతీకరణ |
|
ఆవిష్కరణ | SLAC (సుమారు 1968) |
రకములు | 6 (up, down, strange, charm, bottom, and top) |
విద్యుదావేశం | +2/3 e, −1/3 e |
Color charge | yes |
స్పిన్ | 1/2 ħ |
బేరియన్ సంఖ్య | 1/3 |
క్వార్క్ అంటే పదార్థానికి మూలాధారమైన ప్రాథమిక కణాల్లో ఒక రకం. ఈ క్వార్కులు ఒకదానితో ఒకటి కలిసి హెడ్రాన్లు అనే సంయుక్త కణాలను ఏర్పరుస్తాయి. ఈ హెడ్రాన్లలో అత్యంత నిలకడ అయినవి పరమాణు కేంద్రకంలో భాగమైన ప్రోటాన్లు, న్యూట్రాన్లు.[1] సాధారణంగా మనం పరిశీలించగలిగిన పదార్థమంతా అప్ క్వార్కులు, డౌన్ క్వార్కులు, ఎలక్ట్రాన్ల చేత నిర్మితమై ఉంటుంది. కలర్ కన్‌ఫైన్‌మెంట్ అనే ధర్మం వలన ఈ క్వార్కులు ఎప్పుడూ విడిగా కనిపించవు. వీటిని బేరియాన్లు (ప్రోటాన్లు, న్యూట్రాన్లు), మేసాన్లు లాంటి హెడ్రాన్లలోనూ, లేదా క్వార్క్-గ్లువాన్ ప్లాస్మాలో మాత్రమే చూడగలం.[2][3][4] ఈ కారణం వల్ల క్వార్కుల గురించి మనకు తెలిసిన సమాచారమంతా హెడ్రాన్లను పరిశీలించడం ద్వారా సంపాదించినదే.
ఈ క్వార్కులకు కొన్ని స్వాభావికమైన గుణాలు ఉన్నాయి. అవి విద్యుదావేశం, ద్రవ్యరాశి, కలర్ చార్జ్, ఇంకా స్పిన్.
మూలాలు
[మార్చు]- ↑ "Quark (subatomic particle)". Encyclopædia Britannica. Retrieved 2008-06-29.
- ↑ R. Nave. "Confinement of Quarks". HyperPhysics. Georgia State University, Department of Physics and Astronomy. Retrieved 2008-06-29.
- ↑ R. Nave. "Bag Model of Quark Confinement". HyperPhysics. Georgia State University, Department of Physics and Astronomy. Retrieved 2008-06-29.
- ↑ There is also the theoretical possibility of more exotic phases of quark matter.