ఎం. ఎం. కీరవాణి
కీరవాణి | |
---|---|
జననం | కోడూరి మరకతమణి కీరవాణి 1961 జూలై 4 |
ఇతర పేర్లు | ఎం. ఎం. కీరవాణి, మరకతమణిగా, ఎం. ఎం. క్రీమ్ |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు , గాయకుడు |
జీవిత భాగస్వామి | శ్రీవల్లి |
పిల్లలు | శ్రీ సింహాతో సహా ఇద్దరు కుమారులు |
తల్లిదండ్రులు |
|
కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు.[1] తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.[2] తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్ళి సందడి, సుందరకాండ.
కీరవాణి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించాడు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023 లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం రణం రుధిరం (2022) కి రెండు నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ, ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు...’ పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయ్యింది.[3]
రౌద్రం రణం రుధిరం (2022) చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి కి ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ పాట విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023 లభించింది. [4][5]
2023 సంవత్సరం కు గాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సంగీత దర్శకుడిని పద్మశ్రీ పురస్కారం వరించింది.[6][7]
ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ పాట గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[8] [9]
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ (2021) సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ నుపథ్య సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[10]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కీరవాణి 1961 జూలై 4న జన్మించాడు. ఈయన తండ్రి శివశక్తి దత్తా. కీరవాణి భార్య శ్రీవల్లి. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. సినీ దర్శకుడు రాజమౌళికి ఈయన వరసకి అన్న అవుతాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కీరవాణి చిన్నాన్న.
సినిమాలు
[మార్చు]ఈయన మొదటి సినిమా రామోజీ రావు నిర్మించిన మనసు మమత అనే చిత్రం. తర్వాత అదే సంస్థలో పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని తదిరత చిత్రాలకు పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత కె. రాఘవేంద్రరావుతో 27కి పైగా సినిమాలు చేశాడు. తర్వాత రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించాడు.
ఇతరాలు
[మార్చు]- మాతృదేవోభవ
- ఎక్కువగా నాగార్జున నటించిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
- ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం సమకూర్చాడు.
- ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్ వంటి ఉద్ధండుల నిష్క్రమణానంతరం నేటి తరం తెలుగు సంగీత దర్శకులలో సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరొందాడు.
- వ్యాపారాత్మక సినిమాల్లోనూ సంగీత విలువలతో రాగాలు కట్టి మెప్పించగల దిట్ట (ఉదా: నేనున్నాను చిత్రంలోని ఏ శ్వాసలో చేరితే పాట).
- గాయకునిగానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించాడు.
- కీరవాణి స్వరపరచి ఆలపించిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే (మాతృదేవోభవ) పాటకుగాను గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డునందుకున్నారు.
- తెలుగు సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కీరవాణి అన్నయ్య వరుస.
- సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ కీరవాణికి చెల్లెలు వరుస (బాబాయ్ కూతురు).
- ఐతే, ఆంధ్రుడు, బాస్ చిత్రాలకు సంగీతాన్నందించిన వర్ధమాన సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ కీరవాణికి స్వయానా తమ్ముడు.
- కీరవాణి తండ్రి శివ శక్తి దత్త. ఈయన అర్ధాంగి, చంద్రహాస్ అనే రెండు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు.
కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]కీరవాణి స్వరపరచిన కొన్ని విజయవంతమైన గీతాలు
[మార్చు]చిత్రం | పాటలు |
సీతారామయ్యగారి మనవరాలు | "కలికి చిలకల కొలికి", "పూసింది పూసింది పున్నాగ" |
క్షణక్షణం | "జామురాతిరి జాబిలమ్మా", "చలి చంపుతున్న చమక్కులో" |
సుందరకాండ | "నవ్వవే నవమల్లిక", "అరె మామ ఇల్లలికి పండగ చేసుకుందామా", "ఉలికి పడకు కుకుకుకు" |
అంతం | "గుండెల్లో దడ దడలాడే" |
క్రిమినల్ | "తెలుసా మనసా", "హల్లో గురూ" |
అల్లరి అల్లుడు | "నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు" |
రక్షణ | "ఘల్లుమంది బాసు గలాసు" |
అన్నమయ్య | "ఏలే ఏలే మరదలా", "తెలుగు పదానికి" (ఈ చిత్రంలోని చాలా పాటలు అన్నమాచార్య స్వరపరచిన కీర్తనలు) |
శ్రీరామదాసు | "చాలు చాలు చాలు" (ఈ చిత్రంలోని చాలా పాటలు రామదాసు స్వరపరచిన కీర్తనలు) |
నేనున్నాను | "ఏ శ్వాసలో చేరితే", "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని", "శీతాకాలం ఎండల్లాగ" |
ఆపద్బాంధవుడు | "ఔరా అమ్మకచల్ల", "చుక్కల్లారా, చూపుల్లారా, ఎక్కడమ్మా జాబిలి" |
ఘరానా మొగుడు | "బంగారు కోడిపెట్ట", "ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు" |
శుభసంకల్పం | "హరిపాదాన పుట్టావేమో గంగమ్మా", "హైలెస్సో హైలెస్స", "సీతమ్మ అందాలు" |
మాతృదేవోభవ | "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" |
మొండి మొగుడు-పెంకి పెళ్లాం | "నాటకాల జగతిలో జాతకాల జావళి", "లాలూ దర్వాజ లష్కర్" |
అన్న | "గురుగురు పిట్ట గోగుల గుట్ట మీద" |
ఖతర్నాక్ | "లవ్వు చేసే వాళ్లకేమో కోలాటం" |
అల్లరి బుల్లోడు | "త్రిషా, అసలు సిసలు తళుకులొలుకు రూపమా" |
ఒకరికి ఒకరు | "ధిరననన ధిరననన ధిరనననా" |
ఒక్కడున్నాడు | "అడుగడుగున", "ఇవ్వాళ నా గెలుపు" |
అనుకోకుండా ఒక రోజు | "ఐ వన్నా సింగ్", "ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని", "నీడల్లే తరుముతూ ఉంది గతమేదో వెంటాడి" |
స్టూడెంట్ నంబర్ 1 | "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి", "పడ్డానండీ ప్రేమలో మరి" |
సింహాద్రి | "చిరాకు అనుకో పరాకు అనుకో", "ఏదేదో చెయ్యమాక సందెకాడ" |
సై | "నల్లా నల్లాని కళ్ల పిల్లా" |
ఛత్రపతి | "గుండు సూదీ గుండు సూదీ", "మన్నేలదింటివిరా కృష్ణా", "ఎ వచ్చి బి పై వాలె" |
విక్రమార్కుడు | "కాలేజి పాపల బస్సు", "వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా", "డమ్మారె డమ్మ డమ్మ" |
యమదొంగ | "రబ్బరు గాజులు", "యంగ్ యమా" |
రాజహంస | "రోసా రోసా రోసా" |
పెళ్లిసందడి | "నవ మన్మధుడా అతి సుందరుడా", "మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగె", "సౌందర్యలహరి స్వప్నసుందరి" |
పరదేశి | "చందన చర్చిత" |
బొంబాయి ప్రియుడు | "పరువమా మరుమల్లె పూలతోటలో ఘుమఘుమా", "రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు" |
అల్లరి మొగుడు | "నా పాట పంచామృతం", "బాత్ టబ్ షవరులో కాలుజారి పడ్డవేళ" |
అల్లరి ప్రియుడు | "రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా", "ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి" |
మనీ | "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ" |
పాతబస్తీ | "వేటూరి పాట వేగం, సాలూరి వారి రాగం" |
అవార్డులు
[మార్చు]అకాడమీ అవార్డ్స్ :
- 2023 – ఉత్తమ ఒరిజినల్ పాట - నాటు నాటు (ఆర్.ఆర్.ఆర్)
జాతీయ చలన చిత్ర అవార్డులు :
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు :
- 1993 - Filmfare Best Music Director Award (Telugu) for Allari Priyudu
- 1995 - Filmfare Best Music Director Award (Telugu) for Subha Sankalpam
- 1996 - Filmfare Best Music Director Award (Telugu) for Pelli Sandadi
- 2009 - Filmfare Best Music Director Award (Telugu) for Magadheera
- 2017 - ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గేయరచయిత – తెలుగు - బాహుబలి
- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ సంగీత దర్శకుడు (ఈగ)[11][12][13][14]
- 2010 - Nandi Award for Best Male Playback Singer for Maryada Ramanna
- 2009 - Nandi Award for Best Music Director for Vengamamba
- 2005 - Nandi Award for Best Music Director for Chatrapathi
- 2002 - Nandi Award for Best Music Director for Okato Number Kurraadu
- 2001 - Nandi Award for Best Male Playback Singer for Student No. 1
- 1995 - Nandi Award for Best Music Director for Pelli Sandhadi
- 1993 - Nandi Award for Best Music Director for Allari Priyudu
- 1992 - Nandi Award for Best Music Director for Rajeswari Kalyanam
Other awards:
- 2003 - Santosham Best Music Director Award for Gangotri
సన్మానం
[మార్చు]ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్నఅనంతరం కీరవాణి, చంద్రబోస్‌లను 2023 ఏప్రిల్ 09న హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం సన్మానించారు.[15][16]
మూలాలు
[మార్చు]- ↑ మహమ్మద్, అన్వర్. "మా అబ్బాయిల్ని కూలికి పంపా". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 5 March 2018. Retrieved 5 March 2018.
- ↑ తెలుగుసినిమా.కాం Archived 2012-03-13 at the Wayback Machine లో కీరవాణి ఇంటర్వ్యూ
- ↑ "'ఆర్‌ఆర్‌ఆర్'కు మరో అంతర్జాతీయ పురస్కారం". web.archive.org. 2022-12-13. Archived from the original on 2022-12-13. Retrieved 2022-12-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "RRRకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్.. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న కీరవాణి". Samayam Telugu. Retrieved 2023-01-26.
- ↑ Eenadu (22 January 2023). "సాహోరే... కీరవాణీ". Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
- ↑ S, Hari Prasad. "Padma Shri to Keeravani: కీరవాణికి మరో గౌరవం.. పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం". Hindustantimes Telugu. Retrieved 2023-01-26.
- ↑ Andhra Jyothy (5 April 2023). "కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం". Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.
- ↑ https://www.eenadu.net/telugu-news/movies/naatu-naatu-song-wins-oscar-award-2023/0210/123043452
- ↑ https://telugu.abplive.com/entertainment/cinema/oscar-awards-2023-naatu-naatu-song-from-rrr-movie-wins-95th-academy-award-for-best-original-song-82296
- ↑ "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ Namasthe Telangana (10 April 2023). "తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
- ↑ Eenadu (10 April 2023). "ఆస్కార్‌తో తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
యితర లింకులు
[మార్చు]- సినిమా పురస్కారాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- నంది ఉత్తమ సంగీతదర్శకులు
- నంది ఉత్తమ నేపధ్య గాయకులు
- భారతీయ పురుష గాయకులు
- భారతీయ సంగీతకారులు
- తెలుగు కళాకారులు
- పశ్చిమ గోదావరి జిల్లా గాయకులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా సంగీత దర్శకులు
- అకాడమీ అవార్డు విజేతలు
- గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు