Jump to content

ఎన్‌ఆర్‌సీ

వికీపీడియా నుండి

జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులందరితో కూడిన జాబితాను 'నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ , ' క్లుప్తంగా ఎన్‌ఆర్‌సీ అంటారు.పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ ప్రకారం, 1966 జనవరి 1కి ముందు నుంచి అస్సాంలో నివసిస్తున్నవారు భారతీయ పౌరులు. 1966 జనవరి, 1971 మార్చి 25 మధ్య అస్సాంలో నివాసం ఉండేందుకు వచ్చినట్లయితే, వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్లకు భారతీయ పౌరుడిగా గుర్తింపు వస్తుంది. ఓటు హక్కు కూడా పొందుతారు.ఒకవేళ 1971 మార్చి 25 తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినట్లయితే అక్రమ వలసదారు గా పరిగణిస్తారు. [1]

నేపద్యం

[మార్చు]

1985లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు), రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరంది.అదే అస్సాం ఒప్పందం. ఆ అస్సాం అకార్డ్ లో ఒకటి ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఇది అస్సాం రాష్ట్రంలోని భారతీయ పౌరులను గుర్తించడానికి పేర్లు, కొన్ని సంబంధిత సమాచారాన్ని కలిగి ఉన్న భారత ప్రభుత్వం నిర్వహించే రిజిస్టర్. ఈ రిజిస్టర్ ప్రారంభంలో, ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రం కోసం తయారు చేయబడింది. అయితే, నవంబర్ 20, 2019 న, హోంమంత్రి మిస్టర్ అమిత్ షా పార్లమెంటరీ సమావేశంలో దీనిని మొత్తం దేశానికి విస్తరిస్తామని ప్రకటించారు. 1951 భారత జనాభా లెక్కల తరువాత ఈ రిజిస్టర్ మొదట తయారు చేయబడింది, అప్పటి నుండి ఇది మార్పులకు నోచుకోలేదు.[2]అసోంలో నివసిస్తున్న వారిలో 19 లక్షల మంది భారతీయులు కారని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019 న ప్రకటించింది.[3] దేశ వ్యాప్త జాతీయ పౌరుల జాబితా ప్రణాళికను అమలు చేయటంలో ప్రభుత్వం ముందుకు వెళితే.. అందులో చోటు దక్కని వారిని రెండు వర్గాలుగా విభజించటం జరుగుతుంది. ఒకటి అత్యధిక సంఖ్యలో ఉండే ముస్లింలు: వీరిని ఇప్పుడు అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. రెండు ముస్లిమేతరులు: ఇంతకుముందైతే వీరిని అక్రమ వలసదారులుగా పరిగణించి ఉండేవారు.. ఇప్పుడు వీరు గనుక తాము అఫ్ఘానిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ వచ్చామని చూపగలిగితే - వీరికి పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా రక్షణ లభిస్తుంది

భారత పౌరసత్వ చట్టం, 1955 లో చేసిన సవరణ కారణంగా, అస్సాం రాష్ట్రానికి చెందిన పౌరుల రాష్ట్ర రిజిస్టర్, ఇది జాతీయ పౌరుల రిజిస్టర్‌లో భాగంగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు".
  2. "నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్". Archived from the original on 2019-12-06.
  3. "అసోంలో 19 లక్షల మంది భారతీయులు కాదట". Archived from the original on 2019-12-16.

వెలుపలి లంకెలు

[మార్చు]