Jump to content

ఎనుమాముల

అక్షాంశ రేఖాంశాలు: 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E / 17.9857; 79.6248
వికీపీడియా నుండి
ఎనుమాముల
ఎనుమాముల is located in Telangana
ఎనుమాముల
ఎనుమాముల
తెలంగాణలో ఎనుమాముల ఉనికి
ఎనుమాముల is located in India
ఎనుమాముల
ఎనుమాముల
ఎనుమాముల (India)
Coordinates: 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E / 17.9857; 79.6248
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావరంగల్
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
506013
Vehicle registrationటిఎస్

ఎనుమాముల, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ మండలం లోని, జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1] ఈ పట్టణం వరంగల్ మహానగరపాలక సంస్థలో ఒక భాగంగా ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ గ్రామీణ జిల్లా స్థానంలో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]2011 జనగణన సమాచారం ప్రకారం ఎనుమాముల గ్రామ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 578155.[4] ఈ గ్రామంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. దాదాపు 117 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.[5]

భౌగోళికం

[మార్చు]

ఈ పట్టణం 17°59′09″N 79°37′29″E / 17.9857°N 79.6248°E / 17.9857; 79.6248 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[6]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఎనుమాముల పట్టణంలో 13,183 జనాభా ఉంది. ఇక్కడ 3,430 గృహాలు ఉన్నాయి. అందులో 6,628 మంది పురుషులు, 6,555 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1438 మంది ఉన్నారు. ఎనుమాముల సగటు అక్షరాస్యత రేటు 70.06% కాగా ఇది రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత దాదాపు 80.19% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 59.91%గా ఉంది.[7]

సమీప గ్రామాలు

[మార్చు]

ఖిలా వరంగల్, ఉరుసు, అల్లీపూర్, తిమ్మాపూర్, మమ్నూర్, నక్కలపల్లి, వసంతపూర్, బొల్లికుంట, గాదెపల్లి మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

రవాణా

[మార్చు]

ఇక్కడికి సమీపంలోని వరంగల్, హన్మకొండ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, రోడ్డు కనెక్టివిటీ ఉంది.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • బ్రాహ్మణ పోచమ్మ దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • మైసమ్మ గుడి
  • మస్జిద్-ఈ-మహమూదియా
  • అఫ్జాలియా జామా మస్జిద్

విద్యాసంస్థలు

[మార్చు]
  • నోబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్
  • డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
  • సికెయం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
  • చందా కాంతయ్య మెమోరియల్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల
  • ఉర్దూ ప్రాథమిక పాఠశాల
  • ఎడ్-ఫోర్ట్ టెక్నో స్కూల్
  • జీనియస్ ఉన్నత పాఠశాల

మూలాలు

[మార్చు]
  1. "Enumamula Locality". www.onefivenine.com. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "Enumamula Village in Hanamkonda (Warangal) Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
  5. "Telangana government's Rs 30 lakh deposit norm stuns agricultural traders". The New Indian Express. Archived from the original on 2020-09-29. Retrieved 2021-11-11.
  6. "Enumamula - Village in Hanamkonda Mandal". www.indiagrowing.com. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
  7. "Enumamula Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2021-09-15. Retrieved 2021-11-11.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎనుమాముల&oldid=4333573" నుండి వెలికితీశారు