ఎం. అరుణాచలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. అరుణాచలం
భారత రసాయనాల శాఖ మంత్రి
In office
1997 జూన్– 1997 సెప్టెంబర్
నియోజకవర్గంతెన్కాసి లోక్ సభ నియోజకవర్గం
భారత కార్మిక ఉపాధి శాఖ మంత్రి
In office
1996 ఆగస్ట్– 1997 మే
ప్రధాన మంత్రిహెచ్.డి. దేవే గౌడ
నియోజకవర్గంతెన్కాసి లోక్ సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1944 మార్చి 3
, చెన్నై
మరణం2004 జనవరి 21
చెన్నై, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (1966-1996)
జీవిత భాగస్వామిఅమలా అరుణాచలం
సంతానంమోహన్ అరుణాచలం
నివాసంచెన్నై ,

ఎం. అరుణాచలం ( 1944 మార్చి 4 - 2004 జనవరి 21), ఒక భారతీయ రాజకీయ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి. అరుణాచలం చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి బి ఎల్ చేసారు అరుణాచలం తూత్తుకుడిలోని చిదంబరం కళాశాల నుండి పట్టా పొందారు. అరుణాచలం తెన్కాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అరుణాచలం 1977, 1980, 1984, 1989 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

రాజకీయ జీవితం

[మార్చు]

అరుణాచలం తిరునెల్వేలి (జిల్లా కాంగ్రెస్ కమిటీ)లో యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు. 1977లో తొలిసారిగా తెన్కాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన అరుణాచలం 1998 వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోను గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. అరుణాచలం తన రాజకీయ జీవితంలో 3 సార్లు కేంద్ర మంత్రిగా 3 సార్లు తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

విజయాలు

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్ల శాతం
1977 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి భారత జాతీయ కాంగ్రెస్ గెలుపు 67.6 రాజగోపాలన్ ఎస్ భారత జాతీయ కాంగ్రెస్ 26.2
1980 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి భారత జాతీయ కాంగ్రెస్ గెలుపు 53.4 రాజగోపాలన్ ఎస్ జనతా పార్టీ 36.6
1984 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి భారత జాతీయ కాంగ్రెస్ గెలుపు 64.7 ఆర్.కృష్ణన్ సిపిఎం 30.3
1989 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి భారత జాతీయ కాంగ్రెస్ గెలుపు 62.5 ఆర్.కృష్ణన్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 35.04
1991 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి భారత జాతీయ కాంగ్రెస్ గెలుపు 63.56 డిఎంకె 33.24
1996 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి టీఎంసీ గెలుపు 44.98 సెల్వరాజ్.వి భారత జాతీయ కాంగ్రెస్ 30.14
1998 భారత సాధారణ ఎన్నికలు తెన్కాసి టిఎంసి ఓటమి 26.77 ఎస్. మురుగేషన్ అన్నా డీఎంకే 41.84

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1972–1977 : తిరునెల్వేలి జిల్లా జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు
  • 1977–1981 : తమిళనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
  • 1977-1980 : లోక్‌సభకు (ఆరవ) 1వ సారి ఎన్నికయ్యారు.
  • 1980-1984 : లోక్‌సభకు (ఏడవ) 2వ సారి ఎన్నికయ్యారు.
  • 1984-1989 : లోక్‌సభకు (ఎనిమిదవ) 3వ సారి ఎన్నికయ్యారు.
  • 1985 - 1989 : తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి.
  • 1989-1991 : 4వ సారి లోక్‌సభకు (తొమ్మిదవ) . ఎన్నికయ్యారు
  • 1990 జనవరి–1990 సెప్టెంబరు : సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యునిగా నియమించబడ్డారు.
  • 1991-1996 : 5వ సారి లోక్‌సభకు (పదో) ఎన్నికయ్యారు.
  • 1991 - 1993 : తమిళనాడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి.
  • 1993 - 1995 : తమిళనాడు రాష్ట్ర, చిన్న తరహా వ్యవసాయ పరిశ్రమల మంత్రి
  • 1996-1998 : లోక్‌సభకు (పదకొండవ) 6వ సారి ఎన్నికయ్యారు.
  • 1996లో కొన్ని నెలలు : పట్టణాభివృద్ధి శాఖామంత్రి
  • 1996 ఆగస్టు - 1997 మే : భారత కార్మిక శాఖ మంత్రి.
  • 1997 జూన్ - 1997 డిసెంబరు : భారత రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి

మరణం

[మార్చు]

ఎం. అరుణాచలం 2004 జనవరి 21న చెన్నైలో 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.

[1][2][3][4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. Volume I, 1971 Indian general election, 5th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  2. Volume I, 1977 Indian general election, 6th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  3. Volume I, 1980 Indian general election, 7th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  4. Volume I, 1984 Indian general election, 8th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  5. Volume I, 1989 Indian general election, 9th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  6. Volume I, 1991 Indian general election, 10th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
  7. Volume I, 1996 Indian Lok Sabha election, 11th Lok Sabha