ఎం.ఎస్. రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎస్. రాజు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు ఎం. తిప్పేస్వామి
నియోజకవర్గం మడకశిర

వ్యక్తిగత వివరాలు

జననం 1982
శింగనమల, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఎం.ఎస్. కుళ్లాయప్ప
జీవిత భాగస్వామి ఉమాదేవి
సంతానం సందేశ్ మోక్షజ్ఞ, భవ్యకాంత్ కిరీటి
నివాసం 7-245-A, ఆదర్శ్ కాలనీ, రామ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం.ఎస్. రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మడకశిర నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.ఎస్. రాజు తొలుత ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో ప్రజా ప్రస్థానం ప్రారంభించి ఆ తరువాత టీడీపీలో చేరి ఆ పార్టీ  అనుబంధ సంఘం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. లోకేష్ జట్టులో సభ్యుడిగా ఉంటూ యువగళం పాదయాత్రలో కీలకంగా వ్యవహరించాడు. ఆయనను 2024 మార్చి 2న బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి,[2] ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఏప్రిల్ 21న మడకశిర అభ్యర్థిగా ప్రకటించడంతో[3][4] రాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మడకశిర నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై 351 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో ఎం.ఎస్. రాజుకు 79983 ఓట్లు, లక్కప్పకు 79632 ఓట్లు, మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌కు 17380 ఓట్లు వచ్చాయి.[5][6]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. A. B. P. Desam (2 March 2024). "టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎం.ఎస్.రాజు - పార్టీ విధేయతకు చంద్రబాబు గుర్తింపు !". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  3. TV9 Telugu (21 April 2024). "ఐదుగురు ఔట్.. అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన చంద్రబాబు.. లాస్ట్ మినట్‌లో వారికి నో ఛాన్స్‌." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (22 April 2024). "Naidu tweaks candidates' list; Raju to contest from Undi assembly seat". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Madakasira". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  6. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.