ఋతువిరతి
ఋతువిరతి | |
---|---|
ఇతర పేర్లు | క్లైమాక్టీరిక్, మెనోపాజ్ |
రుతువిరతి స్థితికి నమూనా | |
ప్రత్యేకత | గైనకాలజీ |
లక్షణాలు | ఒక సంవత్సరం ఋతుస్రావం లేకపోవడం |
సాధారణ ప్రారంభం | 49 నుండి 52 సంవత్సరాల |
కారణాలు | సహజమైన మార్పు, అండాశయాల శస్త్ర చికిత్స, హార్మోనుల అసమతుల్యత |
చికిత్స | జీవన విధానం లో |
ఔషధం | మెనోపాజ్ హార్మోన్ థెరపీ, క్లోనిడిన్, గబాపెంటిన్, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్‌టేక్ ఇన్హిబిటర్ |
ఋతువిరతిని , క్లైమాక్టిరిక్ అని కూడా పిలుస్తారు. ఇది మహిళల శరీర ధర్మం. సాధారణంగా ఇది చాలా మంది మహిళలల్లో ఋతుస్రావం శాశ్వతంగా ఆగిపోతుంది, వారు ఇకపై పిల్లలను ప్రసవించలేరు. దీనినే ఆంగ్లంలో మెనోపాజ్ అంటారు. [1][2] ఋఋతుక్రమం అంటే ఒక అమ్మాయికి ఋతుకాలము ప్రారంభమయ్యే సమయం. ఋతువిరతి దీనికి పూర్తిగా వ్యతిరేకం,[3] ఋతువిరతి సాధారణంగా 49 నుండి 52 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది.[4] వైద్య నిపుణులు ఒక మహిళకు ఒక సంవత్సరం పాటు ఋతుస్రావం కలుగనప్పుడు ఋతువిరతి సంభవించినట్లు నిర్వచిస్తారు.[5] అండాశయాల ద్వారా హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. [6] ఇలాంటప్పుడు సాధారణంగా 45 సంవత్సరాల వయస్సులో గర్భాశయం తొలగించిన తరువాత ఈ లక్షణాలు ముందుగానే సంభవిస్తాయి.[7]గర్భాశయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఇంకా అండాశయాలు ఉన్నవారిలోను, శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత లేదా వారి హార్మోన్ స్థాయిలు పడిపోయినప్పుడు రుతువిరతి సంభవించినట్లు పరిగణిస్తారు.[6]
లక్షణాలు
[మార్చు]ఋతువిరతికి ముందు సంవత్సరాలలో, సహజంగానే ఒక మహిళ ఋతుక్రమం సక్రమంగా ఉండదు, అంటే ఋతుక్రమం ఎక్కువ లేదా తక్కువ వ్యవధిలో ఉండవచ్చు ఇంకా తేలికగా లేదా ఎక్కువ ఉండవచ్చు. ఈ సమయంలో, మహిళలకు తరచుగా వేడి ఆవిర్లు లాంటివి అనుభవం లోకి వస్థాయి, ఇవి సాధారణంగా 30 సెకన్ల నుండి పది నిమిషాల వరకు ఉంటాయి. చర్మం వణుకడం, చెమట పట్టడం ఎర్రబడటం వంటి లక్షణాలు ఉండవచ్చు.[8] హాట్ ఫ్లాషెస్ ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత జరగడం ఆగిపోతుంది.[2] ఇతర లక్షణాలలో యోని పొడి బారడం, నిద్ర, మానసిక స్థితిలో మార్పులు ఉండవచ్చు.[8] లక్షణాల తీవ్రత మహిళలను అనుసరించి మారుతూ ఉంటుంది. ఋతువిరతికి గుండె జబ్బులతో సంబంధం ఉంటుందని తరచుగా భావించినప్పటికీ, ఇది ప్రధానంగా పెరుగుతున్న వయస్సు కారణంగా సంభవిస్తుంది కాబట్టి ఋతువిరతికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఇంకా కొంతమంది మహిళల్లో, ఎండోమెట్రియోసిస్ లేదా బాధాకరమైన ఋతుకాలము వంటి సమస్యలు, ఈ రుతువిరతి తర్వాత మెరుగుపడతాయి.[2]
కారణాలు
[మార్చు]ఋతువిరతి సాధారణంగా సహజమైన మార్పు,[9] ఎందుకంటే అండాశయాలు వయస్సు క్రమంతో చిన్నవిగా మారుతాయి.[10] పొగాకు ధూమపానం చేసేవారిలో ఇది ముందుగానే ఏర్పడవచ్చు.[5][11] ఈ పరిస్థితికి వేరు కారణాలు అంటే అండాశయాలను తొలగించే శస్త్రచికిత్స లేదా కొన్ని రకాల కీమోథెరపీ ఉన్నాయి.[5] శారీరక స్థాయిలో, అండాశయాలలో ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల ఋతువిరతి సంభవిస్తుంది.[1]
నిర్ధారణ, చికిత్స
[మార్చు]సాధారణంగా రక్తం లేదా మూత్రంలో హార్మోన్ స్థాయిలను కొలవడం ద్వారా ఋతువిరతిని నిర్ధారించవచ్చు.[12]
సాధారణంగా దీనికి చికిత్స అవసరం లేదు. అయితే, హాట్ ఫ్లష్ లు వంటి కొన్ని లక్షణాలు చికిత్సతో మెరుగుపడవచ్చు. ధూమపానం, కెఫిన్, మద్యాన్ని నివారించడం సిఫార్సు చేస్తారు. చల్లని గదిలో నిద్రపోవడం, ఫ్యానును ఉపయోగించడం ఉపశమనం కలిగిస్తుంది.[13] ఋతుక్రమం ఆగిపోయినప్పుడు హార్మోన్ థెరపీ (MHT) క్లోనిడిన్, గాబాపెంటిన్, లేదా సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్.[13][14] వాడుతారు. వ్యాయామం కూడా నిద్ర పట్టని సమస్యలకు సహాయపడుతుంది. అయితే MHT దుష్ప్రభావాల గురించి ఆందోళనలు ఉన్నందున, దీనిని అరుదుగా చాలా అవసరం ఉన్నవారికి మాత్రమే సిఫార్సు చేస్తున్నారు.[13] ప్రత్యామ్నాయ ఔషధాల ప్రభావం గురించిన ఆధారాలు కనుగొనలేదు.[2] ఆయితే ఫైటోఈస్ట్రోజెన్లకు తాత్కాలిక నివారణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. [15] ఇది రుతువిరతి తర్వాత బోలు ఎముకల వ్యాధికి చికిత్స చేయడానికి బజెడోక్సిఫెన్ ఉపయోగిస్తున్నారు.
ముందులు
[మార్చు]- ఫెజోలినెంట్: మెనోపాజ్ కారణంగా వచ్చే వేడి ఆవిర్లు చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.
- ఆస్పెమిఫేన్: మెనోపాజ్ కారణంగా మహిళల్లో యోని క్షీణతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.
ఇది కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Menopause: Overview". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. 2013-06-28. Archived from the original on 2 April 2015. Retrieved 8 March 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Menopause: Overview". PubMedHealth. 29 August 2013. Archived from the original on 10 September 2017. Retrieved 8 March 2015.
- ↑ Wood, James. "9". Dynamics of Human Reproduction: Biology, Biometry, Demography. Transaction Publishers. p. 401. ISBN 9780202365701. Archived from the original on 10 సెప్టెంబరు 2017.
- ↑ Takahashi TA, Johnson KM (May 2015). "Menopause". The Medical Clinics of North America. 99 (3): 521–34. doi:10.1016/j.mcna.2015.01.006. PMID 25841598.
- ↑ 5.0 5.1 5.2 "What is menopause?". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. 2013-06-28. Archived from the original on 19 March 2015. Retrieved 8 March 2015.
- ↑ 6.0 6.1 Sievert, Lynnette Leidy (2006). Menopause : a biocultural perspective ([Online-Ausg.] ed.). New Brunswick, N.J.: Rutgers University Press. p. 81. ISBN 9780813538563. Archived from the original on 10 సెప్టెంబరు 2017.
- ↑ International position paper on women's health and menopause : a comprehensive approach. DIANE Publishing. 2002. p. 36. ISBN 9781428905214. Archived from the original on 10 సెప్టెంబరు 2017.
- ↑ 8.0 8.1 "What are the symptoms of menopause?". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. 6 May 2013. Archived from the original on 20 March 2015. Retrieved 8 March 2015.
- ↑ "What causes menopause?". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. 6 May 2013. Archived from the original on 2 April 2015. Retrieved 8 March 2015.
- ↑ Suster, David; Liu, Martina Z.; Lin, Douglas I. (2019). "3. Benign diseases of the ovary". In Zheng, Wenxin; Fadare, Oluwole; Quick, Charles Matthew; Shen, Danhua; Guo, Donghui (eds.). Gynecologic and Obstetric Pathology (in ఇంగ్లీష్). Vol. 2. Springer: Springer. p. 96. ISBN 978-981-13-3018-6. Archived from the original on 2 August 2022. Retrieved 30 July 2022.
- ↑ Warren, volume editors, Claudio N. Soares, Michelle (2009). The menopausal transition : interface between gynecology and psychiatry ([Online-Ausg.] ed.). Basel: Karger. p. 73. ISBN 978-3805591010.
{{cite book}}
:|first=
has generic name (help)CS1 maint: multiple names: authors list (link) - ↑ "How do health care providers diagnose menopause?". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. 6 May 2013. Archived from the original on 2 April 2015. Retrieved 8 March 2015.
- ↑ 13.0 13.1 13.2 "What are the treatments for other symptoms of menopause?". Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. 2013-06-28. Archived from the original on 20 March 2015. Retrieved 8 March 2015.
- ↑ Krause MS, Nakajima ST (March 2015). "Hormonal and nonhormonal treatment of vasomotor symptoms". Obstetrics and Gynecology Clinics of North America. 42 (1): 163–79. doi:10.1016/j.ogc.2014.09.008. PMID 25681847.
- ↑ Franco OH, Chowdhury R, Troup J, Voortman T, Kunutsor S, Kavousi M, Oliver-Williams C, Muka T (June 2016). "Use of Plant-Based Therapies and Menopausal Symptoms: A Systematic Review and Meta-analysis". JAMA. 315 (23): 2554–63. doi:10.1001/jama.2016.8012. PMID 27327802.