ఉమా నెహ్రూ
ఉమా నెహ్రూ | |
---|---|
జననం | |
మరణం | 1963 ఆగస్టు 28 | (వయసు 79)
జాతీయత | భారతదేశం |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | శ్యామ్‌లాల్ నెహ్రూ |
పిల్లలు | శ్యామ్ కుమారి ఆనంద్ కుమార్ |
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం |
ఉమా నెహ్రూ ( 1884 మార్చి 8 - 1963 ఆగస్టు 28) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]ఉమా 1884, మార్చి 8న ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించింది. హుబ్లీలోని సెయింట్ మేరీస్ కాన్వెంట్‌లో చదువుకున్నది.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1901లో ఉమా నెహ్రూకు జవహర్‌లాల్ నెహ్రూ బంధువు శ్యామ్‌లాల్ నెహ్రూతో వివాహం జరిగింది. వారికి శ్యామ్ కుమారి అనే కుమార్తె, ఆనంద్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు.[3] ఆనంద్ కుమార్ నెహ్రూ కుమారుడు అరుణ్ నెహ్రూ 1980లలో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
పత్రికారంగం
[మార్చు]20వ శతాబ్దం ప్రారంభంలో 1909లో రామేశ్వరి నెహ్రూ స్థాపించిన స్త్రీ దర్పన్ అనే మహిళా మాస పత్రికలో రచయితగా గుర్తింపు పొందింది. తన రచనల్లో స్త్రీవాద అభిప్రాయాలను వ్యక్తం చేసింది.[4]
ఉద్యమం, రాజకీయరంగం
[మార్చు]ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలలో పాల్గొని, జైలుకు కూడా వెళ్ళింది.[5] స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయింది.[2] 1962 నుండి ఆమె మరణించే వరకు, రాజ్యసభ సభ్యురాలిగా కూడాపనిచేసింది.[6]
మరణం
[మార్చు]ఉమా నెహ్రూ 1963, ఆగస్టు 28న లక్నోలో మరణించింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-10-08.
- ↑ 2.0 2.1 "Members Bioprofile". 164.100.47.132. Archived from the original on 2014-07-14. Retrieved 2014-06-15.
- ↑ Nehru-Gandhi family tree.
- ↑ Anup Taneja (2005). Gandhi, Women, and the National Movement, 1920–47. Har-Anand Publications. pp. 46–47.
- ↑ R. S. Tripathi, R. P. Tiwari (1999). Perspectives on Indian Women. APH Publishing. p. 143. ISBN 81-7648-025-8.
- ↑ http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/n.pdf
- ↑ "Homage to Uma Nehru". 30 August 1963. p. 5.
గ్రంథ పట్టిక
[మార్చు]- «ఐ ప్రిమి పాసి డెల్ ఫెమ్మినిస్మో ఇండియానో: రామేశ్వరి ఇ ఉమా నెహ్రూ నెల్లీ'ఇండియా డి ఇనిజియో నోవెసెంటో | Storia delle Donne », 10 luglio 2020. https://oaj.fupress.net/index.php/sdd/article/view/2520/2520 .