ఉదారి నారాయణ
ఉదారి నారాయణ | |
---|---|
జననం | బండల్‌నాగపూర్, తాంసీ మండలం, ఆదిలాబాద్ జిల్లా |
ప్రసిద్ధి | కవి |
ఉదారి నారాయణ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి.
విశేషాలు
[మార్చు]ఇతడు ఆదిలాబాద్ జిల్లా, తాంసీ మండలం, బండల్‌నాగపూర్ గ్రామానికి చెందిన వాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి. పట్టా పొందినవారిలో మొదటి వ్యక్తి.[1] ఇతడు అనేక వచన కవితలను వ్రాశాడు. అంతే కాకుండా అనేక రేడియో నాటికలు, వ్యాసాలు, సమీక్షలు, తెలంగాణ ఉద్యమ పాటలు వ్రాసి అనేక పత్రికలలో ప్రచురించాడు. పొక్కిలి, అలుగు దుంకిన అక్షరం, తంగేడువనం, తొలిపొద్దు, మట్టి ముద్ర వంటి కవితా సంకలనాలలో ఇతని కవితలు చోటు చేసుకున్నాయి. ఇతని కవితలు కొన్ని ఇంగ్లీషు, హిందీ భాషలలోనికి అనువాదమయ్యాయి. జిల్లాకు చెందిన "దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్య వేదిక", "సాహితీ మిత్రమండలి", "నాగదాసు స్మారక సాహితీ సంస్థ", "తెలంగాణా రచయితల వేదిక" మొదలైన అనేక సంస్థలతో ఇతనికి అనుబంధం ఉంది.
రచనలు
[మార్చు]- ఆకుపచ్చని ఎడారి (కవితా సంపుటి)
- యాల్లైంది (కవితా సంపుటి)
- మాగిపొద్దు (కవితా సంపుటి)
- ఎల్గడి (సంపాదకత్వం - ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం)
- అరుగుమీది ముచ్చట్లు ( రేడియో లఘు నాటికల సంపుటి)
- ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ)
పురస్కారాలు
[మార్చు]ఇతని సాహిత్యకృషిని చూచి అనేక సాహిత్య సంస్థలు ఇతడిని పురస్కారాలతో, బహుమతులతో సత్కరించాయి. వాటిలో కొన్ని:
- తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ ఉత్తమ సాహితీ పురస్కారం
- సోమ సీతారాములు సాహిత్య పురస్కారం
- కలహంస సాహిత్య పురస్కారం
- వట్టికోట ఆళ్వారుస్వామి కవితల పోటీలో ప్రత్యేక బహుమతి
- దాశరథి రంగాచార్య స్మారక కవితల పోటీలో తృతీయ బహుమతి మొదలైనవి.
మూలాలు
[మార్చు]- ↑ ఉదారి నారాయణ (1 September 2019). ఆదిలాబాదు జిల్లా సాహిత్య చరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. pp. 58–61.