Jump to content

ఈతముక్కల

అక్షాంశ రేఖాంశాలు: 15°22′28.024″N 80°6′49.165″E / 15.37445111°N 80.11365694°E / 15.37445111; 80.11365694
వికీపీడియా నుండి
ఈతముక్కల
పటం
ఈతముక్కల is located in ఆంధ్రప్రదేశ్
ఈతముక్కల
ఈతముక్కల
అక్షాంశ రేఖాంశాలు: 15°22′28.024″N 80°6′49.165″E / 15.37445111°N 80.11365694°E / 15.37445111; 80.11365694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొత్తపట్నం
విస్తీర్ణం16.07 కి.మీ2 (6.20 చ. మై)
జనాభా
 (2011)[1]
6,995
 • జనసాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,482
 • స్త్రీలు3,513
 • లింగ నిష్పత్తి1,009
 • నివాసాలు1,920
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523280
2011 జనగణన కోడ్591349


ఈతముక్కల ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొత్తపట్నం నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1920 ఇళ్లతో, 6995 జనాభాతో 1607 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3482, ఆడవారి సంఖ్య 3513. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1183 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1179. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591349[2].

పేరువెనుక చరిత్ర

[మార్చు]

రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కును ఈ ప్రదేశంలో కోసినందున, ఇంతి యొక్క ముక్కును ముక్కలు చేసినందున ఇంతిముక్కల అని పిలిచెను. అ పేరు మార్పు చెంది "ఈతముక్కల"గా స్థిరం అయినది.

సమీప గ్రామాలు

[మార్చు]

మదనూరు 2 కి.మీ, ఆలకూరపాడు 5.6 కి.మీ, సూరారెడ్డిపాలెం 10 కి.మీ, కొత్తపట్నం 9 కి.మీ, రాజుపాలెం 3 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది.సమీప బాలబడి అల్లూరు కొత్తపట్నంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులో ఉన్నాయి.

శ్రీ ఉలిచి వెంకారెడ్డి, సీతారామమ్మ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల

[మార్చు]
  • ఈ కళాశాల విద్యార్థినులు, 2015, మార్చి-8వ తేదీనాడు, తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర పాలిటెక్నిక్ కళాశాలల బ్యాండ్ మింటన్ డబుల్స్ పోటీలలో, ద్వితీయస్థానం పొందినారు.
  • ఈతముక్కలలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఇమ్మడిశెట్టి సుప్రజ అను విద్యార్థిని, డిప్లమా ఇన్ ఎలెక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ కోర్స్ చదువుచున్నది. ఈమె ఇటీవల ఈ-సెట్ ప్రవేశ పరీక్ష వ్రాయగా, అందులో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించింది.

గ్రామ పంచాయితీ

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన దాసూరి గోపాలరెడ్డి, 1988 నుండి 1995 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసారు. ఆ రోజులలో డబ్బుతో పనిలేదు. మనిషిని బట్టి ఓట్లు వేసే రోజులవి.

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో బసంగారి పద్మ సర్పంచిగా ఎన్నికైనారు. అనంతరం ఈమె మండల సర్పంచిల సంఘం డైరెక్టరుగా ఎన్నికైనారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఈతముక్కలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈతముక్కలలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఈతముక్కలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 74 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 54 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 77 హెక్టార్లు
  • బంజరు భూమి: 855 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 547 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 863 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 616 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఈతముక్కలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 69 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 547 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఈతముక్కలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, వేరుశనగ, కూరగాయలు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం

[మార్చు]
  • ఈ ఆలయంలో 2013 అక్టోబరు 18 నాడు అమృతపూర్ణిమ సందర్భంగా, 5వ వార్షికోత్సవం ఘనంగా జరిపినారు. వెన్నెల్లో పాయసం తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకుకున్నవారికి మానసిక ప్రశాంతత వస్తుందని ప్రతీతి. అమ్మవారు ఆరోజు అరటిపళ్ళ మధ్య కొలువుదీరినారు. అందువలన అమ్మవారిని "కదళీఫల కదంబ వనప్రియే" అని సంబోధించెదరు.
  • శ్రీ జ్వాలాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2014, ఆగస్టు-2వ తేదీ శనివారం నాడు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలు, ఈఫిల్ టవర్, ప్రభలు గ్రామమంతా వెలుగులు నింపినవి. ఉదయం నుండియే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యుత్తు ప్రభలవద్ద ఏర్పాటుచేసిన మ్యూజికల్ నైటె, పాటకచేరి కార్యక్రమాలు అలరించినవి. ఈ తిరునాళ్ళలో, మందుచెట్లు కాల్చే కార్యక్రమం, ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ఈ గ్రామానికి చెందిన డా.ఎ.రవీంద్రబాబు, ఈతముక్కల జ్వాలాముఖీదేవి అను పుస్తకాన్ని రచించారు. వీరు ముందుగా జంటగ్రామాల చరిత్ర తెలుసుకొని, అనేక గ్రంథాలు తరచిచూసి, అంతర్జాలంలో కొంత సమాచారాన్ని సేకరించి, ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ, 2014, మే-29 న ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాచలప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి శక్తిపీఠానికి, అనుబంధ ఉపపీఠాలలో ఈతముక్కల ఆలయం గూడా ఉండటం విశేషం.
  • ఈ ఆలయంలో 2014, అక్టోబరు-9 న, షష్టమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ప్రతి కుటుంబం నుండి ఒక పసుపు బిందె నీటిని తీసికొని మేళతాళాలమధ్య ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుండి మద్యాహ్నం వరకు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. ఆలయప్రాంగణం అంతటా రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో ప్రత్యేకత సంతరించుకొన్నది.

శ్రీ కన్నేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో కార్తీకమాసం చివరిరోజైన 2015, డిసెంబరు-11వ తేదీ శుక్రవారంనాడు, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రభిషేకాలు నేత్రపర్వంగా నిర్వహించారు.

శ్రీ జాలమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. 2014, జూలై-30 నుండి నిర్వహించుచున్న ఈ తిరునాళ్ళ కార్యక్రమంలో, తొలిరోజు బుధవారం నాడు రాములవారికి గ్రామీణులు హారతులిచ్చారు. గురు, శుక్రవారాల్లో ఆలయంలో ప్రత్యేకపూజలు మరియూ భక్తుల వినోదం కొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారంనాడు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. ఆఖరి రోజయిన ఆదివారం నాడు, భక్తులు ఆలయప్రాంగణంలో అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించెదరు.

శ్రీ అనంతకోదండరామస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో నూతన జీవ ధ్వజస్తంభ మహా ప్రతిష్ఠోత్సవాలు, 2015, జూన్-8వ తేదీ సోమవారం నుండి ప్రారంభించారు. సోమవారంనాడు అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించారు. 9వ తేదీ మంగళవారం నాడు, ఈతముక్కల, మడనూరు గ్రామాలలో, నూతన ధ్వజస్తంభానికి గ్రామోత్సవం నిర్వహించారు. 10వ తేదీ బుధవారంనాడు, విష్వక్సేనపూజ, నిత్య హోమం, మహాశాంతిహోమం, సర్వదైవత్య పరమాత్మక హోమం నిర్వహించారు. 11వ తేదీ గురువారం తెల్లవారుఝామునుండియే భక్తులు అధికసంఖ్యలో పూజాకార్యక్రమాలలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రామనామస్మరణతో ఆలయప్రాంగణం ప్రతిధ్వనించింది. అనంతరం ఉదయం 8 గంటలకు, వేదపండితుల ఆధ్వర్యంలో, జీవధ్వజప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ నూతన ధ్వజస్తంభాన్ని, ఈతముక్కల గ్రామానికి చెందిన శ్రీ కేశవరపు కోటిరెడ్డి, తన స్వంత నిధులనుండ్ సమకూర్చారు. తదుపరి ఆలయప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆంజనేయస్వామివారి విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శాంతికళ్యాణం, తదుపరి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీ భావనాఋషేశ్వరస్వామి దేవస్థానం

[మార్చు]

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు (హ్యాచరీస్).

గ్రామ విశేషాలు

[మార్చు]

జర్మనీ దేశస్థురాలయిన "శాండీ రాబ్సన్" అను ఒక మహిళ, జర్మనీ నుండి ఆస్ట్రేలియాకు, ఒక పడవపై, ఒంటరిగా సముద్రయానం చేసి ప్రపంచ రికార్డు సాధించాలనే క్రమంలో, 2014, మే-30, శుక్రవారం సాయంత్రం, అనుకోకుండా, ఈతముక్కల పల్లెపాలెం వచ్చి, ఆ రాత్రి ఒకరి ఇంట్లో బస చేసారు. శనివారం ఉదయమే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో, ఆమె బసచేసిన ఇంటికి చేరుకొని ఆమెను అభినందించారు. ఆమెకు మామిడి, అరటి పండ్లను అందజేసినారు. ఆమె రాత్రి తనకు ఆతిధ్యం ఇచ్చిన గృహస్థురాలికి కృతఙతలు తెలియజేసినారు. తరువాత ఆమె తన సామానులు పడవలోకి సర్దుకొని, గ్రామస్థులు వీడ్కోలు పలుకుతుండగా, తన పడవలో సముద్రంలోనికి వెళ్ళిపోయి, తన యాత్రను తిరిగి ప్రారంభించారు.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,454. ఇందులో పురుషుల సంఖ్య 3,619, మహిళల సంఖ్య 3,835, గ్రామంలో నివాస గృహాలు 1,800 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,607 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఈతముక్కల&oldid=4267194" నుండి వెలికితీశారు