Jump to content

ఇలుడు

వికీపీడియా నుండి
శివపార్వతులు

ఇలుడు కర్దమ ప్రజాపతి కుమారుడు. ఈతడు బాహ్లిక దేశపు రాజు, బహు పరాక్రమశాలి, ధార్మికుడు.

ఒకనాడు సపరివారంగా అడవికి వేటకు బయలుదేరాడు. అదే ప్రదేశంలో పార్వతీపరమేశ్వరులు విహరిస్తున్నారు. పరమేశ్వరుడు దేవిని సంతోషపరచడానికి, తాను మహిళయై, అక్కడ ఉన్న వృక్షాలను మహిళలుగా చేసి క్రీడిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్న ఇలుడు సపరివారంగా స్తీలుగా మారిపోయారు. శంకరుని ఎంతగా ప్రార్థించినా తిరిగి పురుషులుగా మార్చడానికి అంగీకరించలేదు. ఇలుడు పార్వతిని వేడుకొనగా ఇలుడు ఒక నెల పురుషుడుగాను, మరొక నెల స్త్రీగాను ఉండవచ్చని చెప్పింది. పురుషుడుగా ఉన్నప్పుడు ఇలుడని, స్త్రీగా ఉన్నప్పుడు ఆమె ఇలయని వ్యవహరించబడునని అనుగ్రహించింది. ఒకసారి అందమైన రమణులుగా విహరిస్తున్నప్పుడు, ఆ వనంలోనే తపస్సు చేసుకొంటున్న ఇంద్రుడు కుమారుడు బుధుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై తపస్సుమాని ఆమె యందే మనస్సు లగ్నంచేసాడు. ఇంతలో నెల గడచిపోయింది. ఇలగా ఉన్నప్పటి జ్ఞాపకాలు ఏమీ ఇలునికి మిగలలేదు. మరొక నెల గడిచింది. ఇలుడు తిరిగి ఇలగా మారాడు. బుధుడు ఆమెను వివాహమాడి తొమ్మిది నెలలు ఆమెతో గడిపాడు. ఇలకు బుధుని వలన పురూరవుడు జన్మించాడు.

బుధుడు కర్దమ ప్రజాపతి, పులస్యుడు, క్రతువు, కశ్యప, దూర్వాసులను రావించి ఇలునికి పురుషత్వాన్ని ప్రసాదించే మార్గం ఉపదేశించమని ప్రార్థించాడు. వారందరు శివుని ఆరాధించడం ఒక్కటే మార్గం అన్నారు. మహర్షులందరితోను అశ్వమేధ యాగం నిర్వహించి, శంకరుని తృప్తి పరచి, ఇలునికి పూర్తి పురుషత్వం సిద్ధించింది.

మూలాలు

[మార్చు]
  • ఇలుని కథ: ఎ.సూర్యకుమారి మార్చి 2008 సప్తగిరి పత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇలుడు&oldid=3275313" నుండి వెలికితీశారు