Jump to content

ఇమాంబారా

వికీపీడియా నుండి

ఇమాంబారా షియా ముస్లింలు ముహర్రం జ్ఙాపకార్థ సమావేశ స్థలంగా ఉపయోగించబడే భవనం. దీనినే అషుర్ఖానా అని కూడా వ్యవహరిస్తారు. హుస్సేనియా అని కూడా అంటారు. హుస్సేనియా, మసీదు కంటే విభిన్నంగా ఉంటుంది. ఈ పేరు పన్నెండు ఇమామ్‌లలో మూడవవాడు, ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్కు మనవడూ అయిన హుస్సేన్ ఇబ్న్ అలీ నుండి వచ్చింది. 680 అక్టోబరు 10 న మొహమ్మద్ ప్రవక్త మనవడు, షియాల ఇమాం అయిన హుసేన్ ఇబ్న్ ఆలీని ఇరాక్లో జరిగిన కర్బాలా యుద్ధంలో ఉమయ్యద్ క్యాలిఫ్ సంహరించాడు. అతడి బలిదానాన్ని షియాలు ప్రతి సంవత్సరం ముహర్రం నెల 10 వ రోజైన అషూరా నాడు జరుపుకుంటారు. [1] హుస్సేనియాలలో అషూరాతో సంబంధం లేని ఇతర వేడుకలు కూడా ఉన్నాయి. [2] జుమువా (శుక్రవారం సమ్మేళన ప్రార్థన) ఉండకపోవచ్చు కూడా.

దక్షిణ ఆసియాలో హుస్సేనియాను ఇమాంబారా, అషూర్‌ఖానా అని అంటారు. ఆఫ్ఘనిస్తాన్ లోను, మధ్య ఆసియా లోనూ దీనిని తక్యాఖానా అని పిలుస్తారు. బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లలో మాతం అంటారు.

చరిత్ర

[మార్చు]

[[దస్త్రం:Bara_Imambara_Lucknow.jpg|alt=|thumb|190x190px|[[లక్నో|లక్నోలో[permanent dead link]]] ఒక పెద్ద హుస్సేనియా]] ఇరాన్లో సఫావిడ్ పాలించిన కాలం నుండి, షియాలు మతపరమైన సంతాప వేడుకలను నిర్వహించేందుకు నడవాలు, పైకప్పు గల ప్రదేశాలు మాత్రమే కాకుండా హోసెనియాలు, తకియేలు కూడా వాడేవారు. [3] హోస్సేనియాకు వివిధ పరిమాణాలలో కొన్ని గదులు, ఆర్కేడ్‌లూ ఉండేవి. వీధులలోను, సందుల్లోను అషూరా దగ్గరపడిన రోజులలో, ప్రజలు గోడలకూ, పైకప్పులకూ నల్ల రంగు వేసి, రంగురంగుల లైట్లతో వాటిని ప్రకాశవంతం చేసేవారు.[4]

కొన్ని ముఖ్యమైన ఇమాంబారాలు

[మార్చు]
  • ఇరాన్‌లోని జంజన్‌లో ఉన్న హోస్సేనిహ్ అజామ్ జంజన్ మసీదు
  • లక్నోలో ఉన్న బారా ఇమాంబారా
  • లక్నోలో చోటా ఇమాంబారా
  • హుగ్లీ ఇమాంబారా, హుగ్లీ (WB) లో
  • నిజామత్ ఇమాంబర, ముర్షిదాబాద్‌లో
  • హైదరాబాద్‌లోని బాద్‌షాహి అశుర్‌ఖానా
  • ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న హోస్సేనియే ఎర్షాద్
  • హుస్సేని ఇమాంబర అసిమ్ రాజా అబ్ది, 100/46 లో, కల్నల్ గంజ్ కాన్పూర్,
  • లక్నోలో ఇమాంబారా ఘుఫ్రాన్ మాబ్
  • కరారి అలహాబాద్‌లోని ఇమాంబర్‌గా మిర్ విలాయత్ హుస్సేన్

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. మూస:Iranica
  2. Hussainiahs and Takkiahs mashreghnews.ir
  3. Zoka, Yahya. History of Royal Citadel in Tehran and guide to Golestan Palace, (تاریخچه ساختمانهای ارگ سلطنتی تهران و راهنمای کاخ گلستان), vol 1. p. 283.
  4. Ansari Qomi. Iran's endowments in Iraq, ( موقوفات ايرانيان در عراق), vol 2. pp. 74–82.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇమాంబారా&oldid=3866022" నుండి వెలికితీశారు