Jump to content

ఇద్రీస్ ప్రవక్త

వికీపీడియా నుండి

ఇద్రీస్ : ఒక ఇస్లామీయ ప్రవక్త. ఖురానులో ఇతని గురించి విపులంగా ఉంది.

ఇతని సంతానం హనోఖ్, ఖునూఖ్ (అఖ్నూఖ్) . వారి వేలి ఉంగరం మీద "అస్ బరు మ అల్ ఈమాని బిల్లాహి యూరిసూజ్ జఫర" అని రాసి ఉందట. ఇద్రీస్ దర్జీ. అతను సూదితో కుట్టిన ప్రతి కుట్టుకూ సుబ్ హానల్లాహ్ అని పలికేవాడట. సాయంత్రానికి ఇతనికి లభించినన్ని పుణ్యాలు ఎవరికీ లభించలేదట. అల్లాహ్ ఇతనికి ప్రవక్త పదవినిచ్చాడు. ఇతనికి అన్ని భాషలూ మాట్లాడే జ్ఞానం అల్లాహ్ ఇచ్చాడు. ఈయన 200 గ్రామాలు తిరిగి వారి వారి భాషల్లోనే దైవ సందేశమిచ్చి వాళ్ళందరినీ ఏకంచేశాడు. కలంతో రాసిన మొదటి ప్రవక్త. లెక్కలు, తూనికలు, బట్టలు కుట్టటం, నక్షత్రాల గురించిన వ్రాతపూర్వక జ్ఞానం, ఇతని నుండే ఆరంభం. ఇద్రీస్ సత్యవంతుడైన ప్రవక్త అని ఖురాన్ లో మర్యమ్ :56, అంబియా:85 లో ఉంది.

బైబిల్ లో ఇద్రీస్

[మార్చు]

యెరెదు కుమారుడైన ఇద్రిస్ పేరు బైబిల్ లో హనోకు .మెతూషెలా తండ్రి. ఇతను మరణాన్ని చూడకుండానే దేవుడు తీసికెళ్ళడని ఆదికాండం 5:24 లో ఉంది. ఇతని యాత్రల గురించిన పుస్తకం బైబిల్ లో చేర్చబడని అపోక్రిపలో ఉంది.