Jump to content

యాకూబ్ (కవి)

వికీపీడియా నుండి
(యాకూబ్ నుండి దారిమార్పు చెందింది)
యాకూబ్
కవి యాకూబ్
జననంయాకూబ్
(1962-03-02) మార్చి 2, 1962 (age 62)
India రొట్టమాకు రేవు ,
ఖమ్మం జిల్లా ,
తెలంగాణ
నివాస ప్రాంతంచైతన్యపురి, హైదరాబాద్ , తెలంగాణ
ఇతర పేర్లుకవి యాకూబ్
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
ఉద్యోగంతెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ
ప్రసిద్ధికవి యాకూబ్
మతంభారతీయుడు
భార్య / భర్తడాక్టర్ పి.లక్ష్మి (శిలాలోలిత)
పిల్లలుసందీప్,
సాహిర్ భారతి
తండ్రిషేక్ మహమ్మద్ మియా
తల్లిషేక్ హూరాంబీ

యాకూబ్ తెలుగు కవి, అధ్యాపకుడు, కవిసంగమం వ్యవస్థాపకుడు. తెలుగు కవిత్వంలో ‘బహుత్ ఖూబ్ యాకూబ్’’ అని చేకూరి రామారావు (చేరా) గారి ఆంధ్రజ్యోతి పత్రిక చేరాతలు శీర్షికలో కొనియాడ్డాడు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డాడు.[1][2]

రొట్టమాకురేవు కవితా పురస్కారం తన తండ్రి కీ.శే. షేక్ మహమ్మద్ మియా, గురువు కీ.శే. కె.యల్. నరసింహారావు, మామ కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి గార్ల స్మారక కవితా పురస్కారాన్ని ఏర్పాటుచేసి, యువ కవులకు అందజేస్తున్నాడు. 2024 మే 21న హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా కవి యాకూబ్ ఎన్నికయ్యాడు.[3][4][5]

జననం

[మార్చు]

యాకుబ్ 1962, మార్చి 2న ఖమ్మం జిల్లా కారేపల్లె మండలం రొట్టమాకు రేవు గ్రామంలో షేక్ మహమ్మద్ మియా, షేక్ హూరాంబీ దంపతులకు జన్మించాడు. ఐదుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలలో యాకూబ్ రెండవవారు.

విద్యాభ్యాసం

[మార్చు]

ఈయన ఉన్నత పాఠశాల వరకూ కారేపల్లి సింగరేణి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కొత్తగూడెం లోని కె.వై.కె.ఆర్.వై అండ్ బి.యన్ గౌడ్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపిసి, ఖమ్మం లోని శీలం సిద్దారెడ్డి డిగ్రీ కళాశాలలో బికాం డిగ్రీ చదివాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ తెలుగు చేసి, మసాబ్ ట్యాంక్ లోని కాంప్రహెన్సివ్ కాలేజ్ లో తెలుగు పండిత శిక్షణ పొందాడు. 1990లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం నుండి తెలుగు సాహిత్య విమర్శ లో రారా మార్గం అనే అంశంలో యం.ఫిల్ పట్టా పొందాడు. 2007లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘తెలుగు సాహిత్య విమర్శ - ఆధునిక ధోరణులు’ పైలో పరిశోధన చేసి పి.హెచ్ డి డాక్టరేట్ పట్టా పొందాడు.

కుటుంబం

[మార్చు]

1991 మే 10న డాక్టర్ పి.లక్ష్మి (శిలాలోలిత) ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సందీప్, సాహిర్ భారతి.

నివాసం - ఉద్యోగం

[మార్చు]
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాల్ లో కవి యాకూబ్.

ప్రస్తుతం హైదరాబాద్ లోని చైతన్యపురిలో స్వంత ఇంటిలో నివసిస్తున్నాడు. 1990 నుంచి 2018 వరకు హైదరాబాద్ లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కళాశాల లో తెలుగు శాఖ అధ్యక్షునిగా విధినిర్వహణలో ఉన్నాడు.2018,2019,2020లలో గోల్కొండ డిగ్రీ కాలేజి, సిటీ కాలేజీలలో పనిచేసారు. 2008 లో ద్రవిడ యూనివర్శిటీ, కుప్పంలో డిప్యుటేషన్ పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా బాధ్యతలు నిర్వహించాడు. 2020 మార్చిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం హైదరాబాదులోని ముంతాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేస్తున్నాడు.

ఫేస్ బుక్ లో కవిసంగమం

[మార్చు]

అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నాడు. దీనిద్వారా వందలాదిమంది కవుల కవిత్వాలను ఒక దగ్గర చేర్చుతున్నాడు. కవిసంగమం అనే ఫేస్బుక్ వేదికను 2012లో ప్రారంభించి గత పదేళ్లుగా కొత్తతరం కవుల వేదికగా మలిచి, సీనియర్ కవులతో కలిసేందుకు కవిత్వ సందర్భాలను, కవిసంగమం పొయట్రీఫెస్టివల్స్, జాతీయ కవులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ప్రతినెలా 'మూడుతరాల కవిసంగమం',  'ఊరూరా కవిసంగమం' నిర్వహిస్తున్నాడు.

ప్రచురణలు

[మార్చు]

రచించిన పుస్తకాలు

[మార్చు]
  1. 1991 - తెలుగు సాహిత్యంలో రారా మార్గం (పరిశోధనా వ్యాసం)
  2. 1992 - ప్రవహించే జ్ఞాపకం (కవితాసంపుటి), 1997 లో రెండవ ముద్రణ
  3. 2000 - Arc of Unrest (కవిత్వ ఆంగ్లానువాదాలు)
  4. 2002 - సరిహద్దురేఖ (కవితాసంపుటి)
  5. 2008 - తెలంగాణా సాహిత్య విమర్శ (సాహిత్య వ్యాసాలు)
  6. 2010 - ఎడతెగని ప్రయాణం (కవితాసంపుటి)
  7. 2014 - నదీమూలంలాంటి ఆ ఇల్లు (కవితాసంపుటి)
  8. 2019- తీగలచింత [కవితాసంపుటి]
  9. పాఠక ప్రతిక్రియ [సాహిత్య విమర్శ]
  10. సృజనానుభవం [కవిత్వ వాచకం ]
  11. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ
  12. మనుషుల్రా మనుషులు (కవితాసంపుటి)
  13. The Incessent journey (కవిత్వ ఆంగ్లానువాదాలు)

సంపాదకత్వం వహించిన పుస్తకాలు

[మార్చు]
  1. చలం శతజయంతి సంచిక (1995)
  2. దేవి30-అభినందన సంచిక
  3. దేవిప్రియ కవితల సంకలనం (2000)
  4. గుజరాత్ గాయం (2002)
  5. మనచేరా (2003)
  6. సలాం ఇస్మాయిల్ (నివాళి వ్యాసాలు)-2004
  7. గుమ్మం-ఖమ్మం కవుల కవిత్వ సంకలనం (2006)
  8. ఉప్పల రాజామణి -జీవితం సాహిత్యం (2006)
  9. కవిసంగమం 2012 (కవిసంగమంలో 2012 లో కవులు రాసిన కవితల సంకలనం)
  10. గోరటి వెంకన్న గేయరూప కవిత్వం 'అలసెంద్రవంక' కు గుడిపాటితో కలిసి సంపాదకత్వం (2010)

పురస్కారాలు

[మార్చు]
  • 2009లో ఎడతెగని ప్రయాణం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు కూడా లభించింది.
  • 1989లో రంజని - కుందుర్తి పురస్కారం
  • 1993లో ఎస్.వి.టి.దీక్షితులు పురస్కారం
  • 1998లో అమిలినేని లక్ష్మీరమణ స్మారక ధర్మనిధి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం
  • 2000లో కె.సి.గుప్తా సాహిత్య పురస్కారం
  • 2003లో డా.సి.నా.రె.కవితా పురస్కారం
  • 2003లో నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం
  • 2004లో ఉత్తమ కవిత్వ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయంచే
  • 1998,2002లలో రాష్ట్ర ఉత్తమకవి
  • 1998 ఆంధ్రప్రదేశ్ మాదిగ సాహిత్య సమాఖ్య పురస్కారం
  • ఎస్ వి టి దీక్షితులు అవార్డు - యలమంచిలి
  • సి.నారాయణ రెడ్డి కవితా పురస్కారం - కరీంనగర్
  • ఉమ్మిడిశెట్టి కవితా పురస్కారం -అనంతపురం
  • ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం - హైదరాబాద్
  • నూతలపాటి గంగాధరం పురస్కారం -తిరుపతి
  • కళాభారతి అవార్డు -తిరుపతి
  • తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం -హైదరాబాద్
  • తెలుగు యూనివర్సిటీ ఉత్తమ కవితాసంకలనం అవార్డు -హైదరాబాద్
  • సాహితీమాణిక్యం కవితా పురస్కారం -ఖమ్మం
  • ఆలూరి బైరాగి కవిత్వ పురస్కారం - విజయవాడ
  • ఇస్మాయిల్ కవిత్వ పురస్కారం -కాకినాడ
  • కే సి గుప్తా పురస్కారం -హైదరాబాద్
  • రంజని కుందుర్తి పురస్కారం -హైదరాబాద్
  • జస్నే ఎ తెలంగాణ -ద ఉర్దూ రైటర్స్ ఫోరం పురస్కారం - హైదరాబాద్
  • ఖమ్మం జిల్లా కవిగా తానా సత్కారం .
  • శ్రీశ్రీ పురస్కారం (శంకరం వేదిక, 10.8.2017)
  • రావెళ్ల వెంకటరామారావు స్ఫూర్తి పురస్కారం
  • సిటీ కాలేజి మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డు, 2021
  • నయీధార రచనా సమ్మాన్, పాట్నా - డిసెంబర్ 1, 2021
  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అవార్డు, 26.12. 2021
  • డా. సి. నారాయణరెడ్డి సాహితీ పురస్కారం (తెలంగాణ సారస్వత పరిషత్తు, 247.07.2024)[6]

పదవులు - గుర్తింపులు

[మార్చు]
  1. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారులు[7]
  2. తెలుగుకవిగా కేరళలోని తుంచన్ కవిత్వోత్సవంలో పాల్గొనడం.
  3. తెలుగుకవిగా కేరళ యూత్ ప్రోగ్రాంలో కవిగా, మోటివేటర్ గా పాల్గొనడం .
  4. తెలుగుకవిగా అలహాబాద్ జాతీయ కవిసమ్మేళనంలో పాల్గొనడం .
  5. కేంద్ర సాహిత్య అకాడెమీ ఆహ్వానం మేరకు వారణాశి, గోవా, త్రివేండ్రం, విజయనగరం, గౌహతి, హైదరాబాద్, కవిత్వోత్సవాలలో తెలుగుకవిగా పాల్గొనడం .
  6. కేంద్ర సాహిత్య అకాడెమీ విశిష్ట గుర్తింపు 'కవిసంధి' కార్యక్రమానికి 2012 లో ఎంపిక అవడం.
  7. ఆల్ ఇండియా రేడియో జాతీయకవిగా నాగపూర్ లో పాల్గొనడం .
  8. కృత్యా ఇంటర్నేషనల్ పోయెట్రీ ఫెస్టివల్ ,త్రివేండ్రంలో తెలుగుకవిగా పాల్గొనడం.
  9. Union Territory, Mahe లో తెలుగుకవిగా పాల్గొనడం .
  10. Publishing Next కు ప్రతినిధిగా గోవాలో పాల్గొనడం .
  11. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారానికి రెండుసార్లు ఎంపిక కావడం.
  12. బొంబాయి ఆంధ్రమహాసభ &జింఖానా ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా కవిత్వ సభలలో పాల్గొనడం.
  13. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో కవిగా పాల్గొనడం .
  14. చెన్నై ప్రకృతి ఫౌండేషన్ సాహిత్యోత్సవంలో కవిగా భారతీయ కవులతోపాటు పాల్గొనడం
  15. కేంద్ర సాహిత్య అకాడమి ఆహ్వానం మేరకు 2017, 20 నుండి 24వరకు అస్సాం లోని గౌహతిలో జరిగిన నార్త్ -ఈస్ట్ సాహిత్య ఉత్సవంలో పాల్గొనడం .
  16. TANA ఆహ్వానం మేరకు అమెరికాలోని సెంట్ లూయిస్ నగరంలో 2017 మే26నుండి జరుగుతున్నతానా సభలకు అతిధిగా పాల్గొనడం.
  17. మార్చి 2018 లో కేరళ లోని కొచ్చి కి ఇంటర్నేషనల్ బుక్స్&ఆథర్స్ ఫెస్టివల్ కు ఆహ్వానం అందుకుని తెలుగు కవిగా పాల్గొన్నారు.
  18. పంబ లిటరరీ ఫెస్టివల్, చెంగన్నూర్, కేరళ
  19. ఇతని కవిత్వంపై మధురై కామరాజ్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలలో పరిశోధన జరుగుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (23 March 2018). "కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుగా యాకూబ్". Archived from the original on 24 మార్చి 2018. Retrieved 24 March 2018.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (24 March 2018). "కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా యాకూబ్‌". Retrieved 24 March 2018.[permanent dead link]
  3. EENADU (22 May 2024). "హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా కవియాకూబ్". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  4. Nava Telangana (21 May 2024). "హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష , కార్యదర్శులుగా కవి యాకూబ్, ఆర్ వాసు -". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  5. "పుస్త‌క‌మంటే జ్ఞానం..స‌ర్వ‌జ‌న నేస్తం -". 16 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  6. "కవి యాకూబ్‌కు సినారె పురస్కారం ప్రదానం". EENADU. 2024-07-28. Archived from the original on 2024-07-28. Retrieved 2024-07-28.
  7. ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (24 March 2018). "ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం". Retrieved 24 March 2018.[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]