ఇటిక్యాల మండలం
ఇటిక్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
ఇటిక్యాల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ఇటిక్యాల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°04′26″N 77°51′10″E / 16.073919°N 77.852808°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | ఇటిక్యాల |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 302 km² (116.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 52,926 |
- పురుషులు | 27,308 |
- స్త్రీలు | 25,618 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.10% |
- పురుషులు | 55.60% |
- స్త్రీలు | 25.84% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.7 వ నెంబరు జాతీయ రహదారి నుంచి 6 కిలోమీటర్లు లోపలికి ఉంది.ఈ గ్రామానికి రైలు సౌకర్యం ఉంది. రైల్వే స్టేషను గ్రామానికి ఒక కిలోమీటర్ దూరం ఉంది. ఈ గ్రామానికి రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఇటిక్యాల.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం52,926 - పురుషులు27,308 - స్త్రీలు 25,618
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 302 చ.కి.మీ. కాగా, జనాభా 52,926. జనాభాలో పురుషులు 27,308 కాగా, స్త్రీల సంఖ్య 25,618. మండలంలో 11,734 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గోపాల్‌దిన్నె
- మొగిల్‌రావల్‌చెరువు
- కొండేరు
- తిమ్మాపూర్
- సాసనూలు
- పుటన్‌దొడ్డి
- మునగాల
- ఇటిక్యాల
- పెద్దదిన్నె
- ఉద్దండాపూర్
- సాతర్ల
- వావిలాల
- షాబాద్
- చాగాపూర్
- వేముల
- బట్లదిన్నె
- వల్లూరు
- ధర్మవరం
- బోచువీరాపూర్
- కర్పాకుల
- ఆర్ గార్లపాడ్
- బీచుపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.